twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వర్షతో లవ్ ట్రాక్‌పై నోరుజారిన ఇమాన్యూయేల్: అందుకే ప్రేమిస్తోందని క్లారిటీ.. పాపం ఆమె కూడా బుక్

    |

    జబర్ధస్త్ షో తెలుగు బుల్లితెరపై సుదీర్ఘమైన ప్రస్థానంతో సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతోంది. దీనికి పోటీగా ఎన్నో కార్యక్రమాలు వచ్చినా.. ఏమాత్రం టీఆర్పీ రేటింగ్‌లో తేడా లేకుండా దూసుకుపోతోంది. దీనికి కారణం ఈ షోలో కామెడీతో పాటు సరికొత్త ప్రయోగాలు చేస్తూ.. ప్రేక్షకులకు ప్రతి వారం మజాను పంచుతుండడమే. ఈ మధ్య కాలంలో జబర్ధస్త్‌లో వర్ష.. ఇమాన్యూయేల్ జంటను బాగా హైలైట్ చేస్తున్నారు. తద్వారా రేటింగ్‌ను అందుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా తమ ప్రేమపై ఇమాన్యూయేల్ నోరు జారాడు. వర్షను కూడా బుక్ చేశాడు. ఆ సంగతులు మీకోసం!

    ఆమె అలా.. అతడు ఇలా ప్రవేశం

    ఆమె అలా.. అతడు ఇలా ప్రవేశం

    సీరియల్ నటిగా బిజీగా ఉన్న సమయంలోనే హైపర్ ఆది ద్వారా జబర్ధస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. ఒక్కసారిగా గుర్తింపును తెచ్చుకుంది వర్ష. ఇందులో అందంతో పాటు యాక్టింగ్‌తో ఇరగదీస్తూ ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకుంది. మరోవైపు.. 'పటాస్' అనే షో ద్వారా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చాడు ఇమాన్యూయేల్. అది ఆగిపోయిన తర్వాత జబర్ధస్త్‌లోకి ప్రవేశించి తక్కవ టైమ్‌లోనే ఫేమస్ అయ్యాడు.

    లవ్ ట్రాకు మొదలు... ఫుల్ ఫేమ్

    లవ్ ట్రాకు మొదలు... ఫుల్ ఫేమ్

    బుల్లితెరపై ఎంతో మంది ఎంట్రీ ఇచ్చినా.. కొందరు మాత్రమే పాపులర్ అవుతారు. అందులో చాలా తక్కువ మందికి మాత్రమే ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది. ఇలా బుల్లితెర జంటగా అప్పట్లో రష్మీ.. సుధీర్ ఫేమస్ అయ్యారు. వీళ్ల తర్వాత ఇప్పుడు వర్ష - ఇమాన్యూయేల్‌ను కూడా జోడీగా చేశారు. ఈ జంట క్రమక్రమంగా పాపులర్ అవుతోంది. దీంతో వీళ్లపై ఎన్నో స్కిట్లు ప్లాన్ చేస్తున్నారు.

    క్యాష్ చేసుకుంటూ.. రొమాంటిక్‌గా

    క్యాష్ చేసుకుంటూ.. రొమాంటిక్‌గా

    వర్ష.. ఇమాన్యూయేల్ జోడీ అంత నమ్మశక్యంగా లేకపోయినా.. తరచూ వీళ్ల మధ్య రొమాంటిక్ సీన్స్ చూపిస్తుండడంతో ప్రేక్షకుల్లో ఇది నిజమేనేమో అన్న భావన కలుగుతుంది. అందుకు అనుగుణంగానే షోల నిర్వహకులు ప్రతి స్కిట్‌లోనూ హగ్గులిచ్చుకోవడం.. ముద్దులు పెట్టుకోవడం వంటివి చేస్తున్నారు. ఫలితంగా ఈ జంటకు క్రమక్రమంగా ఊహించని రీతిలో క్రేజ్ పెరిగిపోతోంది.

     పెళ్లి చేసుకుని... అదిరిపోయిందిగా

    పెళ్లి చేసుకుని... అదిరిపోయిందిగా

    జబర్ధస్త్ షో జంటగా పేరొందిన రష్మీ గౌతమ్.. సుడిగాలి సుధీర్‌కు అప్పట్లో ఓ ఈవెంట్‌లో పెళ్లి చేసిన విషయం తెలిసిందే. దానికి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఇప్పుడదే మాదిరిగా 'శ్రీదేవీ డ్రామా కంపెనీ' అనే షోలో ఇప్పుడిప్పుడే ఫేమస్ అవుతోన్న వర్ష.. ఇమాన్యూయేల్‌కు పెళ్లి చేశారు. ఈ ఎపిసోడ్‌కు భారీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ జంట మరింత పాపులరిటీ దక్కించుకుంది.

    వర్షతో లవ్‌పై ఇమాన్యూయేల్ స్లిప్

    వచ్చే వారం ప్రసారమయ్యే ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్‌ ప్రోమో తాజాగా వచ్చింది. ఇందులో వర్ష.. ఇమాన్యూయేల్ జంటను మళ్లీ హైలైట్ చేశారు. అలాగే, సుధీర్ టీమ్ మొత్తం జోకర్ గెటప్‌లతో ఆకట్టుకుంది. మిగిలిన వాళ్లంతా అదిరిపోయే పంచులతో అలరించారు. ఇక, ఇందులో వర్షను చిత్తు కాగితాలు ఏరుకునే అమ్మాయిలా చూపించారు. దీంతో ఇమ్మూ లవ్ ట్రాకుపై టంగ్ స్లిప్ అయ్యాడు.

    Recommended Video

    Anchor Suma జీవితం లోని ఆసక్తికర విషయాలు | HBD Anchor Suma || Filmibeat Telugu
    వర్ష అందుకే ప్రేమిస్తోందని కామెంట్

    వర్ష అందుకే ప్రేమిస్తోందని కామెంట్

    స్కిట్‌లో భాగంగా స్లమ్‌లో ఉన్న వర్షను చూసిన ఇమాన్యూయేల్.. 'ఇంత అందం పెట్టుకుని ప్లాస్టిక్ ఏరుకుంటున్నారా? నువ్వు నన్ను నమ్మి నాతో వచ్చేయ్. నిన్ను పెద్ద హీరోయిన్‌ను చేస్తాను' అంటాడు. ఆ వెంటనే వర్ష 'పిచ్చిదాన్ని సార్' అని బదులిస్తుంది. దీనికి ఇమాన్యూయేల్ 'తెలుసమ్మా.. అందుకే కదా నన్ను ప్రేమిస్తున్నావు' అని కామెంట్ చేసి అందరిలో అనుమానాలు పెంచాడు.

    English summary
    Telugu Actress, Model Jabardasth Fame Varsha Fell in Love with Comedian Immanuel. Now He Did Shocking Commemts on Varsha Love story. This Video Gone Viral in Internet.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X