జబర్ధస్త్ వర్ష వాళ్ల కోరికలు తీర్చింది.. నాలుగు సార్లు దొరికిపోయింది: కమెడియన్ సంచలన వ్యాఖ్యలు
బుల్లితెరపైకి చాలా మందే అమ్మాయిలు పరిచయమై అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే సక్సెస్‌ఫుల్‌గా తమ కెరీర్‌లను ముందుకు తీసుకు వెళ్తున్నారు. అలాంటి వారిలో క్యూట్ లేడీ వర్ష ఒకరు.
జబర్ధస్త్ ద్వారా సెన్సేషన్ అయిన ఈ చిన్నది.. యాక్టింగ్, గ్లామర్‌తో మెప్పిస్తోంది. ఫలితంగా ఎన్నో అవకాశాలను సొంతం చేసుకుంటూ సాగిపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె ఓ షోలో పాల్గొనగా.. అందులో టాప్ కమెడియన్ వర్ష క్యారెక్టర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. అసలేం జరిగింది? దానికి సంబంధించిన వివరాలను మీరే చూసేయండి!

సీరియళ్లతో మెప్పించి
నటనపై ఉన్న ఆసక్తితో ఆరంభంలోనే వర్ష మోడల్‌గా మారి యమా పేరు తెచ్చుకుంది. ఇలా ఆ రంగంలో ఉన్నప్పుడే ఎన్నో ఆఫర్లను అందుకుంది. ఈ క్రమంలోనే 'అభిషేకం' అనే సీరియల్‌లో నటించే ఆఫర్ వచ్చింది. ఇందులో అదిరిపోయే నటనతో వర్ష సత్తా చాటింది. దీంతో ఆ తర్వాత 'తూర్పు పడమర', 'ప్రేమ ఎంత మధురం' వంటి సీరియళ్లతో మెప్పించింది.
జబర్ధస్త్ నుంచి టర్న్
ఎన్నో సీరియళ్లలో నటించి సత్తా చాటుకున్న క్యూట్ లేడీ వర్ష.. ఓ సందర్భంలో జబర్ధస్త్ షోలోకి వచ్చి స్కిట్ చేసింది. ఇందులో అదరగొట్టడంతో ఆమెకు అదే షోలో అవకాశాలు వచ్చాయి. అలా వర్ష అందులో పర్మినెంట్ మెంబర్ అయిపోయింది. అప్పటి నుంచి జబర్దస్త్ ఫేమ్‌గా మారిపోవడంతో పాటు ఫుల్ పాపులర్ అయింది. తద్వారా ఆమె బిగ్ సెలెబ్రిటీగా అయిపోయింది.

ఆ షోలు, ఈవెంట్లలో
జబర్ధస్త్ షోలో చాలా కాలంగా సందడి చేస్తోన్న వర్ష.. అప్పుడప్పుడూ సీరియళ్లలోనూ కనిపిస్తూ వచ్చింది. అదే సమయంలో జబర్ధస్త్, స్పెషల్ ఈవెంట్లతో పాటు 'శ్రీదేవీ డ్రామా కంపెనీ' షోలోనూ భాగమై ప్రేక్షకులకు ఓ రేంజ్‌లో అలరిస్తోంది. అలాగే, సినిమా నటిగా మారేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇలా ఇప్పటికే కొన్ని చిత్రాల్లో క్రేజీ రోల్స్ చేసేందుకు సంతకాలు కూడా చేసేసింది.
అతడితో లవ్ ట్రాకు
అందం, అభినయం, కామెడీతో హైలైట్ అయిన వర్ష.. మరింత పేరు తెచ్చుకోవడానికి యంగ్ కమెడియన్ ఇమాన్యూయేల్‌తో లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు కనిపించడం కూడా ఒక కారణం. అతడితో ప్రేమలో ఉన్నట్లు కనిపిస్తోన్న ఈ పిల్ల.. తరచూ కిస్‌లు, హగ్గులతో రెచ్చిపోతోంది. అంతేకాదు, వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని టాక్ రావడంతో వీళ్ల ట్రాక్ హైలైట్ అవుతోంది.
ఆ షోలో రచ్చ లేపి
జబర్ధస్త్ వర్ష, ఇమాన్యూయేల్‌కు ఉన్న క్రేజ్‌ను చాలా మంది సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే వీళ్లిద్దరితో కలిసి కొన్ని షోలో ప్లాన్ చేస్తున్నారు. ఇలా ఇప్పుడు వీళ్లు జంటగా 'మనసంతా నువ్వే' అనే షోను హోస్ట్ చేస్తున్నారు. ఇందులో వర్ష క్యారెక్టర్‌పై ఇమాన్యూయేల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఈ షో ప్రోమో విడుదల అవగా.. ఇది వైరల్ అవుతోంది.
షాకింగ్ కామెంట్లతో
ఈ షోలో భాగంగా వర్ష 'రెండు రాష్ట్రాల ప్రజలు మనల్ని జోడీగా చూడాలని కోరుతున్నారు' అని చెప్పగా.. ఇమాన్యూయేల్ 'అందరి కోరికలు తీర్చుతున్నావు కానీ, నాదే తీర్చట్లేదు' అన్నాడు. ఆ తర్వాత ఓ సందర్భంలో 'ఫోన్ హిస్టరీ చూసినప్పుడు ఇది (వర్ష) నాలుగు సార్లు దొరికింది' అన్నాడు. ఇలా వర్ష క్యారెక్టర్‌పై ఇమ్మూ సరదాగానే ఎన్నో పంచులు వేసి షాకిచ్చేశాడు.


Click it and Unblock the Notifications











