జబర్ధస్త్ షోలో కలకలం: ఆమె చీర లాగిన కమెడియన్.. అందరి ముందే పరువు తీయడంతో!
తెలుగు బుల్లితెరపై సుదీర్ఘ కాలంగా నెంబర్ వన్ షోగా వెలుగొందుతూ.. ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్‌ను ప్రసారం చేస్తూ.. ప్రేక్షకులకు మజాను పంచుతోంది జబర్ధస్త్. ఈ మధ్య కాలంలో కొత్త టీమ్ లీడర్లను తీసుకొచ్చి మరింత ఎక్కువ ఫన్ వచ్చేలా చూస్తున్నారు. మరీ ముఖ్యంగా ఇమాన్యూయేల్, వర్ష జంటను కూడా బాగా హైలైట్ చేస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే వీళ్లిద్దరూ రెచ్చిపోయి మరీ నటీస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో వర్షపై కమెడియన్ ఇమాన్యూయేల్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అసలేం జరిగిందో మీరే చూసేయండి మరి!
వర్ష అలా.. ఇమ్మూ ఇలా ఎంట్రీ: సీరియల్ నటిగా ఫేమస్ అయిన వర్ష.. హైపర్ ఆది ద్వారా జబర్ధస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చి ఒక్కసారిగా గుర్తింపును తెచ్చుకుంది. ఇందులో అందంతో పాటు యాక్టింగ్‌తో ఇరగదీస్తూ ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకుంది. మరోవైపు.. 'పటాస్' అనే షో ద్వారా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చాడు ఇమాన్యూయేల్. అది ఆగిపోయిన తర్వాత జబర్ధస్త్‌లోకి ప్రవేశించి తక్కవ టైమ్‌లోనే ఫేమస్ అయ్యాడు.

ఇద్దరి మధ్య లవ్ ట్రాకు పెట్టి: జబర్ధస్త్ షోలోకి ఎంతో మంది ఎంట్రీ ఇచ్చినా.. కొందరు మాత్రమే పాపులర్ అవుతారు. అందులో చాలా తక్కువ మందికి మాత్రమే ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది. ఇలా బుల్లితెర జంటగా అప్పట్లో రష్మీ.. సుధీర్ ఫేమస్ అయ్యారు. వీళ్ల తర్వాత ఇప్పుడు వర్ష - ఇమాన్యూయేల్‌ను కూడా జోడీగా చేశారు. ఈ జంట క్రమక్రమంగా పాపులర్ అవుతోంది. దీంతో వీళ్లపై ఎన్నో స్కిట్లు ప్లాన్ చేస్తున్నారు.

మరింత రొమాంటిక్‌గా చూపిస్తూ: వర్ష - ఇమాన్యూయేల్ జోడీ అంత నమ్మశక్యంగా లేకపోయినా.. తరచూ వీళ్ల మధ్య రొమాంటిక్ సీన్స్ చూపిస్తుండడంతో ప్రేక్షకుల్లో ఇది నిజమేనేమో అన్న భావన కలుగుతుంది. అందుకు అనుగుణంగానే షోల నిర్వహకులు ప్రతి స్కిట్‌లోనూ హగ్గులిచ్చుకోవడం.. ముద్దులు పెట్టుకోవడం వంటివి చేస్తున్నారు. ఫలితంగా ఈ జంటకు క్రమక్రమంగా ఊహించని క్రేజ్ పెరిగిపోతోంది.

గత వారం జంటలతో స్పెషల్: గత శుక్రవారం ప్రసారం అయిన ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్ ఎపిసోడ్‌ను షో నిర్వహకులు మరింత కొత్తగా ప్లాన్ చేశారు. దీన్ని జంటల స్పెషల్‌గా చూపించారు. ఇందులోకి కొందరు సెలెబ్రిటీలు కూడా ఎంట్రీ ఇచ్చారు. మొత్తానికి ఈ ఎపిసోడ్ గతంలో కంటే ఎక్కువగానే ఫన్ క్రియేట్ చేసింది. దీంతో దీనికి ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన కూడా దక్కిందనే చెప్పుకోవాలి.
వాళ్లిద్దరూ జంటగా హల్‌చల్: ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్ షోలో భాగంగా గత శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో ఇమాన్యూయేల్, వర్ష ట్రాకును మరింత హైలైట్ చేశారు. ముందుగా వీళ్లిద్దరూ 'సింహాద్రి' సినిమాలోని నువ్వు విజిలేస్తే ఆంధ్రా సోడా బుడ్డి అనే పాటకు అదిరిపోయే మాస్ స్టెప్పులు వేసి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత వీళ్ల స్కిట్‌లో ఎప్పటిలాగే ఇమాన్యూయేల్.. వర్షపై దారుణమైన పంచులు వేశాడు.

ముద్దు పెట్టి.. మూతి నాకుద్ది: వీళ్ల స్కిట్ ప్రారంభంలో వర్ష 'ఏయ్.. నేను ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నా.. నాకు కుక్క కావాలి.. కుక్క కావాలి' అంటుంది. దీనికతడు 'కుక్క ఎందుకే' అనగా.. 'కుక్క అయితే ముద్దు పెట్టుద్ది.. మూతి నాకుద్ది.. మీద పడిద్ది.. బాగా చూసుకునిద్ది' అని వర్షం అంటుంది. దీంతో ఇమ్మూ 'ప్రతి కుక్కకూ ఒకరోజు వస్తుంది అంటారు. మాకు మాత్రం రావట్లేదు' అని పంచ్ వేశాడు.
చీరను లాగి మరీ చూపించి: ఆ తర్వాత వర్ష 'ఇప్పుడు మీరు ఎలా పడితే అలా మాట్లాడడానికి నేను మామూలు అమ్మాయిని కాదు. ఆయన ఆర్థాంగిని' అని సీరియస్‌గా డైలాగ్ చెప్పింది. దీంతో ఇమాన్యూయేల్ ఆమె చీర కొంగును లాగి జాకెట్ చూపిస్తూ 'ఇలా అర్ధ అర్ధ బట్టలు వేసినప్పుడే అర్థం చేసుకోవాల్సిందే' అని అందరి ముందే వర్ష పరువును తీసేశాడు. ఈ దెబ్బతో ఆ అమ్మాయి ముఖం మాడిపోయింది.


Click it and Unblock the Notifications











