జబర్ధస్త్ వర్ష జాకెట్‌పై నొక్కిన కమెడియన్.. చీరను పైకి లేపి మరీ ఘోరంగా!
తెలుగు టెలివిజన్‌పై ఎన్నో రకాల కార్యక్రమాలు వస్తున్నాయి. కానీ, అందులో కొన్ని మాత్రమే ప్రేక్షకుల మెప్పును పొంది సక్సెస్‌ఫుల్‌గా సాగుతున్నాయి. అలాంటి వాటిలో కామెడీ ప్రధానంగా సాగే జబర్ధస్త్ ఒకటి. ఈ షో ద్వారా ఎంతో మంది హైలైట్ అవుతున్నారు.
ఇప్పుడు అలా క్రేజ్ తెచ్చుకున్న వారిలో వర్ష, ఇమాన్యూయేల్ జోడీ కూడా ఉంది. వీళ్లిద్దరూ తమదైన కామెడీతో అలరిస్తున్నారు. తద్వారా తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వర్ష డ్రెస్సింగ్‌పై ఇమాన్యూయేల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అసలేం జరిగింది? ఆ పూర్తి వివరాలు మీకోసమే!

వర్ష అలా.. ఇమ్మూ ఇలా
బుల్లితెర నటిగా పేరొందిన వర్ష.. హైపర్ ఆది ద్వారా జబర్ధస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఇందులో అందంతో పాటు యాక్టింగ్‌తో ఇరగదీస్తూ ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకుంది. మరోవైపు.. 'పటాస్' అనే షో ద్వారా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చాడు ఇమాన్యూయేల్. అది ఆగిపోయిన తర్వాత జబర్ధస్త్‌లోకి ప్రవేశించి తక్కవ టైమ్‌లోనే పాపులర్ అయిపోయాడు.
ఇద్దరి మధ్య లవ్ ట్రాకు
ఎంతో మంది జబర్ధస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చినా.. కొందరు మాత్రమే ఫేమస్ అవుతారు. అందులో చాలా తక్కువ మందికి మాత్రమే ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది. ఇలా బుల్లితెర జంటగా అప్పట్లో రష్మీ.. సుధీర్ పాపులర్ అయ్యారు. వీళ్ల తర్వాత ఇప్పుడు వర్ష - ఇమాన్యూయేల్‌ను కూడా జోడీగా సెన్సేషన్ అవుతోంది. దీంతో వీళ్లపై షో నిర్వహకులు ఎన్నో స్కిట్లు ప్లాన్ చేస్తున్నారు.

మరింత రొమాంటిక్‌గా
వర్ష - ఇమాన్యూయేల్ జోడీ నిజం కాదు అని తెలిసినా.. తరచూ వీళ్ల మధ్య రొమాంటిక్ సీన్స్ చూపిస్తుండడంతో ప్రేక్షకుల్లో ఇది నిజమేనేమో అన్న భావన కలుగుతుంది. అందుకు అనుగుణంగానే షోల నిర్వహకులు ప్రతి స్కిట్‌లోనూ హగ్గులిచ్చుకోవడం.. ముద్దులు పెట్టుకోవడం వంటివి చేస్తున్నారు. ఫలితంగా ఈ జంటకు క్రమక్రమంగా క్రేజ్ రెట్టింపు అవుతూనే ఉంది.

జంటగా యాంకరింగ్
జబర్ధస్త్ వర్ష, ఇమాన్యూయేల్‌కు ఉన్న పాపులారిటీని చాలా మంది ఉపయోగించుకుంటున్నారు. ఇందులో భాగంగానే వీళ్లిద్దరితో కలిసి కొన్ని షోలో ప్లాన్ చేస్తున్నారు. ఇలా ఇప్పుడు వీళ్లు జంటగా 'మనసంతా నువ్వే' అనే షోను హోస్ట్ చేస్తున్నారు. అలాగే, యూట్యూబ్‌లో వచ్చే మరికొన్ని కార్యక్రమాలను సైతం నడుపుతున్నారు. వీటిలో వర్షపై ఇమ్మూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నాడు.

జాకెట్‌ను ముట్టుకుని
జబర్ధస్త్ షోలో సందడి చేస్తోన్న వర్ష, ఇమాన్యూయేల్ వచ్చే వారం స్కిట్ కోసం భార్యభర్తలుగా నటించారు. తాగుబోతు అయిన అతడు 'నేను తాగిన రోజు ఎప్పుడు వస్తానే' అని అడుగుతాడు. దీనికామె తాగితే అసలు వస్తారో రారో తెలీదు అంటుంది. దీంతో ఇమ్మూ 'నేను రానని తెలిసినా ఎందుకు రెడీ అయ్యావు. ఈ జాకెట్ ఏంటి' అంటూ దాన్ని టచ్ చేసి వీణలా వాయించాడు.

చీరను పైకి లేపి మరీ
తన జాకెట్‌పై ఇమాన్యూయేట్ ఘాటుగా కామెంట్లు చేయడంతో 'జాకెట్ ముక్క సరిపోక తాళ్లు పెట్టుకున్నా' అని వర్ష బదులిచ్చింది. అప్పుడు ఇమాన్యూయేల్ ఆమె కట్టుకున్న చీరను పైకి లేపి మరీ చూపిస్తూ 'ఈ క్లాత్‌లో సగం వేసినా నీ ఒళ్లంతా కప్పుకోవచ్చు కదే' అని కామెంట్ చేశాడు. దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











