జబర్ధస్త్ వర్షకు టీమ్ లీడర్ బ్లాక్‌మెయిల్.. ఆఫర్ కావాలంటే అలా చేయాలంటూ!
గతంలో కంటే ఇప్పుడు తెలుగు బుల్లితెరపై ఎన్నో రకాల కార్యక్రమాలు వస్తున్నాయి. వాటి ద్వారా ఎంతో మంది అమ్మాయిలు ఇండస్ట్రీలోకి పరిచయం అవుతున్నారు. అలా కొన్నేళ్ల క్రితం బుల్లితెరపైకి అడుగు పెట్టిన బ్యూటీనే వర్ష. అందానికి అందం, నటనకు నటనతో మాయ చేస్తోన్న ఈ అమ్మడు.. ఎవరూ ఊహించని రీతిలో పేరును సొంతం చేసుకుంది. ఫలితంగా వరుసగా ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో జబర్ధస్త్ వర్షతో టీమ్ లీడర్ ఊహించని వ్యాఖ్యలు చేశాడు. ఇంతకీ ఏం జరిగింది? దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసమే!
సీరియళ్లతో పాపులర్
సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలన్న లక్ష్యంతో జబర్దస్త్ వర్ష ముందుగా మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది. అందులో తనదైన గ్లామర్‌తో కట్టిపడేసిన ఈ చిన్నది.. 'అభిషేకం' అనే సీరియల్‌తో యాక్టింగ్ కెరీర్‌ను ప్రారంభించుకుంది. అందులో మెప్పించడంతో ఆ తర్వాత 'తూర్పు పడమర', 'ప్రేమ ఎంత మధురం' వంటి వాటిలో నటించే అవకాశం అందుకుని యమ పేరు తెచ్చుకుంది.

జబర్ధస్త్‌లో జంటగానే
సీరియల్ నటిగా చాలా కాలం పాటు హవాను చూపించిన వర్ష.. ఓ స్కిట్ చేయడం కోసం జబర్ధస్త్‌లోకి అడుగు పెట్టింది. ఇందులో ఆరంభంలోనే అదరగొట్టేయడంతో ఆమె బాగా హైలైట్ అయింది. దీంతో మరిన్ని స్కిట్లు చేసే ఛాన్స్ వచ్చింది. ఇలా వర్ష ఆ షోలో కంటిన్యూ అవుతోంది. ముఖ్యంగా ఇందులో ఇమాన్యూయేల్‌కు వర్ష జంటగా చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తోంది.

ఇద్దరితో షోలు ప్లాన్
జబర్ధస్త్ షోలో ఎన్నో ఏళ్లుగా స్కిట్లు చేస్తోన్న వర్ష, ఇమాన్యూయేల్.. ఇదే క్రేజ్‌ను మరింతగా వాడుకుంటున్నారు. ఇలా జబర్ధస్త్, స్పెషల్ ఈవెంట్లతో పాటు 'శ్రీదేవీ డ్రామా కంపెనీ' షోలోనూ భాగమై ప్రేక్షకులకు అమితంగా అలరిస్తున్నారు. వీటితో పాటు యూట్యూబ్‌లో ప్రసారం అయ్యే కొన్ని రకాల షోలను కూడా వీళ్లిద్దరూ జంటగా నడిపిస్తూ ఇంకా రేంజ్‌ను పెంచుకుంటున్నారు.

ఆమెపై షాకింగ్‌గానే
జబర్దస్త్ షోలో అందంతో పాటు టాలెంట్‌తో మెప్పిస్తూ హైలైట్ అయిన వర్ష.. మరింత పేరు తెచ్చుకోవడానికి యంగ్ కమెడియన్ ఇమాన్యూయేల్‌తో లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు నటిస్తోంది. అయితే, అతడు మాత్రం తరచూ ఆమె క్యారెక్టర్‌ను బ్యాడ్ చేసేలా కామెంట్లు చేస్తున్నాడు. మరీ ముఖ్యంగా జబర్ధస్త్ షోలో ఆమెపై అనుచితంగా వ్యాఖ్యలు చేస్తూ పరువు తీస్తున్నాడు.

బ్లాక్‌మెయిల్ చేస్తూ
ఈ వారం ప్రసారం అయ్యే జబర్ధస్త్ షోకు సంబంధించిన ప్రోమోలో వర్షపై ఇమాన్యూయేల్ మరోసారి హాట్ కామెంట్స్ చేశాడు. స్కిట్‌లో భాగంగా ఆమె అతడి ముందు కూర్చుంది. అప్పుడు ఈ కమెడియన్ 'కాసేపు అలాగే ముందుకు వంగి కూర్చో. లేకపోతే నెక్ట్స్ స్కిట్‌లో ఛాన్స్ ఇవ్వను' అని బ్లాక్‌మెయిల్ చేశాడు. దీంతో వర్ష లాంటి వాళ్లను టీమ్ లీడర్లు కావాలనే ఇలా బెదిరిస్తున్నారా అని చాలా మంది చర్చించుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











