మేఘాలలో తేలిపోతోన్న జబర్ధస్త్ జోడీ: బైక్‌పై వెళుతుండగానే షాక్.. అలా చూసే సరికి కేకలు వేసిన బ్యూటీ!

తెలుగు బుల్లితెర చరిత్రలోనే జబర్ధస్త్ షోది ప్రత్యేకమైన స్థానం అన్న విషయం తెలిసిందే. అందుకు కారణం ఇది దాదాపు ఎనిమిదేళ్లుగా ప్రేక్షకులకు మజాను పంచుతుండడమే. ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్కిట్లతో మెప్పించే టీమ్ లీడర్లు.. అద్భుతమైన పంచులతో అదరగొట్టే ఆర్టిస్టులతో ఈ షో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఇలాంటి సమయంలో షోలో కెమిస్ట్రీని జోడించేందుకు మరో ఇద్దరిని బాగా హైలైట్ చేస్తున్నారు. వాళ్లు వర్ష - ఇమాన్యూయేల్. జబర్ధస్త్ జోడీగా పేరొందిన వీళ్లు తాజాగా మేఘాలలో తేలిపోతూ బైక్ రైడ్‌కు వెళ్లారు. ఆ తర్వాత ఊహించని ఘటన జరిగింది. ఆ వివరాలు మీకోసం!

చీరకట్టు అందాలతో అనసూయ భరద్వాజ్: స్టేజీపై డాన్స్ (ఫొటోలు)

ఎంతో మందికి లైఫ్ ఇచ్చిన జబర్ధస్త్

ఎంతో మందికి లైఫ్ ఇచ్చిన జబర్ధస్త్

ఈటీవీలో కామెడీ షోగా ప్రారంభం అయింది జబర్ధస్త్. ఆరంభంలో వారానికి ఒకరోజు మాత్రమే వచ్చిన ఇది.. ఆ తర్వాత గురు, శుక్రవారాల్లో ప్రసారం అవుతోంది. ఈ షో వల్ల ఎంతో మంది ఆర్టిస్టులు బుల్లితెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత చిత్ర సీమలోకి సైతం ఎంట్రీ ఇచ్చారు. అలాగే, ఎంతో మంది టెక్నీషియన్లు కూడా పరిచయం అయ్యారు. వీళ్లంతా సెలెబ్రిటీలుగా వెలుగొందుతున్నారు.

ఆ నలుగురికి మరింత కలిసొచ్చింది

ఆ నలుగురికి మరింత కలిసొచ్చింది

జబర్ధస్త్ షో వల్ల టాలెంట్ ఉండి అవకాశాలు లేని ఎంతో మంది ఇండస్ట్రీలో స్థిరపడిపోయారు. అదే సమయంలో అందులో యాంకర్లుగా పని చేస్తున్న అనసూయ భరద్వాజ్.. రష్మీ గౌతమ్ కూడా బాగా లాభ పడ్డారు. వీళ్లకు ఎనలేని క్రేజ్ రావడానికి ఈ షోనే కారణం అన్న విషయం అందరికీ తెలిసిందే. వీరితో పాటు మెగా బ్రదర్ నాగబాబు.. రోజాకు కూడా ఇది చాలా ఉపయోగపడింది.

వివాదాలున్నా షో హవా తగ్గలేదుగా

వివాదాలున్నా షో హవా తగ్గలేదుగా

దాదాపు ఎనిమిదేళ్లుగా బుల్లితెరపై హవాను చూపిస్తోంది జబర్ధస్త్ షో. దీనికి కారణం ఈ షోకు ఎంతో మంది అభిమానులు ఉండడమే. అదే సమయంలో దీనిని విమర్శించే వాళ్లు కూడా అంతే స్థాయిలో ఉన్నారు. వెకిలి కామెడీ చేస్తున్నారనో.. బూతులు మాట్లాడుతున్నారనో.. పలానా కులం, ప్రాంతం వారిని కించపరిచారో.. ఆడవాళ్లను అగౌరపరిచారనో.. దీనిపై వివాదాలూ చెలరేగాయి.

అప్పుడు వాళ్లు.. ఇప్పుడు ఈ జంట

అప్పుడు వాళ్లు.. ఇప్పుడు ఈ జంట

జబర్ధస్త్ షో వల్ల ఎంతో మంది ఎనలేని గుర్తింపును తద్వారా ఊహించని రీతిలో పాపులారిటీని సంపాదించుకున్నారు. వీళ్లంతా తమ తమ టాలెంట్ల వల్ల ఫేమస్ అయ్యారు. అయితే, యాంకర్ రష్మీ గౌతమ్.. కమెడియన్ సుడిగాలి సుధీర్ మాత్రమే జంటగా క్రేజ్‌ను సంపాదించుకున్నారు. ఈ మధ్య వాళ్ల మాదిరిగానే వర్ష - ఇమాన్యూయేల్ జంట కూడా హైలైట్ అయిన విషయం తెలిసిందే.

ముద్దులు... హగ్గులతో హల్‌చల్ చేసి

ముద్దులు... హగ్గులతో హల్‌చల్ చేసి

ఈ కామెడీ షోలో రష్మీ - సుధీర్ జంట ఎంతగా సందడి చేస్తుందో చాలా కాలంగా చూస్తునే ఉన్నాం. ఈ కారణంగానే వీళ్లిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది. వాళ్లకు ఏమాత్రం తీసిపోని విధంగా వర్ష - ఇమాన్యూయేల్ జంట కూడా తరచూ ముద్దులు, హగ్గులు, రొమాంటిక్ డ్యాన్సులతో హాట్ టాపిక్ అవుతోంది.

మేఘాలలో తేలిపోమ్మన్నది బైక్ రైడ్

మేఘాలలో తేలిపోమ్మన్నది బైక్ రైడ్

వచ్చే శుక్రవారం ప్రసారం కానున్న ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో కెవ్వు కార్తీక్ టీమ్‌ స్కిట్‌లో భాగంగా వర్ష... ఇమాన్యూయేల్ బైకులా చేసిన బొమ్మను పట్టుకుని 'మేఘాలలో తేలిపొమ్మన్నది' అంటూ రైడ్ చేస్తున్నట్లు కనిపించారు. అదే సమయంలో ఆమెను దించేసిన ఇమాన్యూయేల్.. 'పెట్రోల్ రేటు వందైంది పక్కకు పో' అంటూ షాకిచ్చాడు.

అలా చూసే సరికి కేకలు వేసిన బ్యూటీ

అలా చూసే సరికి కేకలు వేసిన బ్యూటీ

ఇదే స్కిట్‌లో ఇమాన్యూయేల్ అమ్మాయిలా మారిపోయాడు. అతడికి కార్తీక్ వచ్చి బొట్టు పెట్టి, పూలు కూడా అలంకరించాడు. దీంతో అతడి బాడీ లాంగ్వేజ్ కూడా మారిపోయింది. అదే సమయంలో అక్కడకు ఎంట్రీ ఇచ్చిన వర్ష.. అతడిని చూసి భయపడిపోయింది. వెంటనే కేకలు వేస్తూ అక్కడి నుంచి పరారైంది. మొత్తానికి వచ్చే వారం కూడా ఈ జంటను బాగా హైలైట్ చేసినట్లు కనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X