ఆ సినిమాలోలా రెచ్చిపోయిన జబర్ధస్త్ కమెడియన్: అసలైన రొమాన్స్ చూపిస్తా అంటూ ఆమెను నలిపేశాడు!

తెలుగు బుల్లితెర చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో ప్రేక్షకాదరణ పొందిన షోలలో జబర్ధస్త్ ఒకటి. దాదాపు ఎనిమిదేళ్లుగా రకరకాల స్కిట్ల ద్వారా మజాను పంచుతోన్న ఈ షో.. సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లను కూడా చేరుకుంది. అదే సమయంలో ఎంతో మందిని ఇండస్ట్రీకి పరిచయం చేసింది. ఆ తర్వాత టాలెంట్ ఉన్న వాళ్లంతా విపరీతమైన ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. అలాంటి వారిలో ఇమాన్యూయేల్ ఒకడు. తక్కువ సయమంలోనే ఎక్కువ పేరు సంపాదించిన అతడు.. తాజాగా ఓ అమ్మాయితో అదిరిపోయే రొమాన్స్ చేశాడు. ఆ వివరాలు మీకోసం!

పటాస్‌తో పరిచయం అయిన ఇమాన్యూయేల్

పటాస్‌తో పరిచయం అయిన ఇమాన్యూయేల్

బుల్లితెరపై ప్రసారం అయిన కామెడీ షోలలో జబర్ధస్త్‌ అంత పేరును సంపాదించింది 'పటాస్'. కొన్ని వందల ఎపిసోడ్‌లుగా ప్రసారం అయిన దీని వల్ల కూడా చాలా మందే ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అందులో ఇమాన్యూయేల్ ఒకడు. మామూలుగా ఈ షోలోకి ఎంట్రీ ఇచ్చిన అతడు.. అద్భుతమైన టాలెంట్‌తో ఆకట్టుకున్నాడు. తద్వారా తక్కువ టైంలోనే ఎక్కువ ఫేమ్ అయ్యాడు.

జబర్ధస్త్‌లోకి ఎంట్రీ.. విపరీతమైన పాపులారిటీ

జబర్ధస్త్‌లోకి ఎంట్రీ.. విపరీతమైన పాపులారిటీ

'పటాస్' షోలో మెయిన్ కమెడియన్‌గా ఎదిగిపోయాడు ఇమాన్యూయేల్. దీంతో అతడు లీడ్ క్యారెక్టర్లు కూడా చేస్తూ వచ్చాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ షో నిలిచిపోయింది. దీంతో అతడు జబర్ధస్త్‌లోకి ప్రవేశించాడు. వెంకీ మంకీస్, కెవ్వు కార్తీక్ టీమ్‌లలో ప్రధాన సభ్యుడిగా చేస్తున్న ఈ కుర్రాడికి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. దీంతో మరింత ఉత్సాహంగా కామెడీని పంచుతున్నాడతను.

ఆ భామతో లవ్ ట్రాక్.. హగ్గులు.. ముద్దులతో

ఆ భామతో లవ్ ట్రాక్.. హగ్గులు.. ముద్దులతో

జబర్ధస్త్ షో అంటేనే యాంకర్ రష్మీ గౌతమ్.. కమెడియన్ సుడిగాలి సుధీర్ మధ్య సాగే లవ్ ట్రాక్ గుర్తొస్తుంది. అయితే, ఈ మధ్య కాలంలో వాళ్ల కంటే ఎక్కువగా వర్ష - ఇమాన్యూయేల్ జోడీ హైలైట్ అవుతోంది. ఈ షోలో లేడీ కంటెస్టెంట్‌గా చేస్తోన్న ఆమెతో అతడు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. ఈ క్రమంలోనే వీళ్లిద్దరూ హగ్గులు, ముద్దులతోనూ రెచ్చిపోతూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.

మరో షోలోకి ఎంట్రీ.. అక్కడ కూడా జంటగానే

మరో షోలోకి ఎంట్రీ.. అక్కడ కూడా జంటగానే

'శ్రీదేవి డ్రామా కంపెనీ' పేరుతో ఈటీవీలో మరో కామెడీ షో ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ప్రది ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు ప్రసారం అయ్యే ఈ కార్యక్రమాన్ని మల్లెమాలనే రూపొందిస్తోంది. ఈ షోలోనూ కమెడియన్ ఇమ్మానుయేల్, వర్ష జోడీగా కనిపిస్తున్నారు. ఎక్కువగా వీళ్లిద్దరినే హైలైట్ చేస్తూ వస్తున్నారు నిర్వహకులు. దీంతో ఈ షో కూడా మంచిగా సాగుతోంది.

ఆ సినిమాలోలా రెచ్చిపోయిన ఇమాన్యూయేల్

గొప్ప గొప్ప టాలెంట్లు ఉన్న పలువురిని తీసుకొచ్చి ప్రేక్షకులకు పరిచయం చేస్తోంది 'శ్రీదేవి డ్రామా కంపెనీ'. ఇందులో భాగంగానే కొందరు గెస్టులను కూడా రప్పిస్తున్నారు. ఇక, వచ్చే వారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌కు నటి హేమ ముఖ్య అతిథిగా వచ్చారు. ఇందులో ఇమాన్యూయేల్ 'ఉప్పెన' సినిమాలోని 'జల జల జలపాతం నువ్వు' అనే పాటకు రెచ్చిపోయి మరీ రొమాన్స్ చేశాడు.

రొమాన్స్ చూపిస్తా అంటూ ఆమెను నలిపేశాడు

రొమాన్స్ చూపిస్తా అంటూ ఆమెను నలిపేశాడు

'జల జల జలపాతం నువ్వు' అనే పాటకు ఢీ కొరియోగ్రాఫర్లు అమ్మాయిలతో కలిసి డ్యాన్స్ చేశారు. ఈ సమయంలో ఇమాన్యూయేల్ ఎంట్రీ ఇచ్చి 'దీన్ని ఎవరైనా కెమిస్ట్రీ అంటారా? అసలైంది ఎలా ఉంటుందో చూపిస్తా' అంటూ వర్ష దగ్గరకు వెళ్లి ఆమెను స్టేజ్ మీదకు తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఆ పాటలో ఆమెను నలిపేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X