Brahmamudi August 1st: స్వప్న ప్రెగ్నెంట్ కాదని తెలుసుకున్న రుద్రాణి.. కావ్య సమస్య రాజ్ తీర్చుతాడా?
బ్రహ్మముడి సీరియల్ రోజురోజుకు మరింత ఆసక్తి పెంచుతోంది. ఇక గతవారం ఎంతో ఉత్కంఠగా సాగిన సీరియల్ ఈ సోమవారం కూడా ఇంట్రెస్టింగ్ గా సాగింది. ఇక ఎపిసోడ్ ప్రారంభంలో సేటు అప్పు తీర్చేందుకు ఇంటిని అమ్మేయాలని నిర్ణయం తీసుకుంటాడు కృష్ణమూర్తి. మరోవైపు రాజ్ తో కలిసి కావ్య ఆఫీసుకు వెళ్తుంది. కాంట్రాక్ వచ్చేలాగా క్లయింట్స్ తో మాట్లాడుతుంది. ఇంకా ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
సేటు అప్పు తీర్చాలని కృష్ణ మూర్తి.. ఇంటిని అమ్మకం పెడుతాడు. అప్పు విషయం అక్కకు చెబితే.. ఎలా ఉంటుందని అప్పు ఆలోచిస్తుంది. ఇక వద్దులే.. అక్కకు మళ్లీ లేనిపోని టెన్షన్ లు ఎందుకు అని బాధపడుతుంది. మరోవైపు రాజ్, అప్పు ఆఫీసుకు వస్తారు. మీరు నిజం చెప్పి చాలా టెన్షన్ తగ్గించారని డిజైనర్ శృతి అంటుంది. మీరు చాలా గ్రేట్ సర్.. మేడమ్ లో ఉన్న టాలెంట్ ని గుర్తించారని చెబుతుంది.

మేడమ్ లో ఉన్న టాలెంట్ నే కాదు.. నువ్ చేసిన మోసాన్ని కూడా గుర్తించానని అంటుంది. నా దగ్గర పని చేస్తూ శిరీష.. శిరీష అంటూ అబద్ధాలు చెప్పావని అంటాడు. డిజైనర్ నుంచి అసిస్టెంట్ డిజైనర్ పోస్టుకు ట్రాన్స్ ఫర్ చేస్తున్నానని చెబుతాడు. కావాలంటే.. నన్ను శృతికి అసిస్టెంట్ గా వేయమని కావ్య రిక్వెస్ట్ చేస్తుంది. కానీ రాజ్ వినిపించుకోడు. అప్పుడే ఓ ఉద్యోగి వచ్చి.. క్లయింట్స్ వేయిట్ చేస్తున్న విషయాన్ని చెబుతాడు. రాజ్, కావ్య కలిసి వెళ్తారు. వాళ్లతో ఎలా మాట్లాడాలో ట్రైనింగ్ ఇస్తానని వేరే ఛాంబర్ లోకి తీసుకెళ్తాడు రాజ్. ఎలా ఉండాలో చెబుతాడు. కానీ కావ్య సెటైర్లు వేస్తుంది.
ఇంటి గురించి అప్పు ఆలోచిస్తూ బాధపడిపోతుంది. కల్యాణ్ కూడా అక్కడే ఉంటాడు. ఏమైంది బ్రో అని అడుగుతాడు. కానీ అప్పు చెప్పదు. నీకు చెప్పే విషయం అయితే చెప్పేదానిని కదా అంటుంది. అదే సమయంలో అప్పు ఫ్రెండ్ వస్తాడు. సారీ అప్పు నువ్ అడిగిన డబ్బు అంటుండగా.. కల్యా్ణ్ చూస్తున్నాడని పక్కకు తీసుకెళ్తుంది. 50 వేలు అడ్జస్ట్ అవ్వలేదని, వాడు హ్యాండ్ ఇచ్చాడని చెబుతాడు. కానీ 5 వేలు మాత్రం ఉన్నాయని అంటాడు. వద్దులే అని చెప్పి, ఫ్రెండ్ ని పంపిస్తుంది. కల్యాణ్ అప్పు దగ్గరకు వచ్చి.. ఏంటి అప్పు ఇది అని అడుగుతాడు. కనీసం అప్పుగా అయినా.. ఇస్తానని చెబుతాడు. మనం ఫ్రెండ్స్ గా ఉన్నామని, మన మధ్య డబ్బు విషయం రావడం ఇష్టం లేదని అంటుంది అప్పు.

ఛాంబర్లోకి క్లయింట్స్ వస్తారు. రాజ్ మాట్లాడుతుండగా.. మధ్యలో కావ్య ఎంటర్ అవుతుంది. స్వరాజ్ గ్రూప్ నుంచి ఏ బ్రాండ్ వచ్చినా.. లక్షాధికారులకు, కోటీశ్వరులకు అందుబాటులో ఉంటున్నాయని, ఈసారి వచ్చే వాటితో మిడిల్ క్లాస్ మార్కేట్ ని క్యాప్చర్ చేయాలనుకుంటున్నామని క్లయింట్ చెబుతాడు. ఆఫ్ కోర్స్ స్వరాజ్ బ్రాండ్ అంటేనే.. నమ్మకానికి ప్రతిరూపం, డైమండ్స్, గోల్డ్ మంచివి వాడతామని, మిడిల్ క్లాస్ వాళ్లు వాటిని.. తట్టుకోలేరని రాజ్ వివరిస్తాడు
మేం మిమ్మల్ని అప్రోచ్ అయ్యిందే.. మిడిల్ క్లాసు వాళ్లకి తక్కువ ధరకే డిజైన్స్ ఇస్తారని క్లయింట్ అనగా.. నో నో మా డిజైన్స్ అన్ని చాలా స్పెషల్ గా ఉంటాయని రాజ్ అంటాడు. కావ్య ఎంటరై.. మిడిల్ క్లాసు వాళ్లకు అందుబాటులో ఉండే డిజైన్స్ కూడా తయారు చేయోచ్చని చెబుతుంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో బ్యూటీ ప్రాడక్ట్స్ మిడిల్ క్లాస్ వాళ్లు కొనలేరు కాబట్టి.. దాన్నే చిన్న ప్యాకెట్స్ రూపంలో తెచ్చారని, మూడు వందలు ఉండే ఫేయిర్నెస్ క్రీమ్ ముప్పై రూపాయల్లోకి తెచ్చారని వివరిస్తుంది.

క్వాలిటీ కూడా సేమ్ గా ఉంటుందని, సో మనం కూడా.. మిడిల్ క్లాసు వాళ్లకి అందుబాటులో ఉండే.. డిజైన్స్ తయారు చేయోచ్చని చెబుతుంది. మిడిల్ క్లాసు వాళ్ల పాపులేషన్ ఎక్కువగా ఉందని, తయారు చేయించొచ్చని అంటుంది. ఫంక్షన్లలో కచ్చితంగా అప్పు చేసైనా.. బంగారం బహుమతిగా ఇస్తారని, అలాంటి వాళ్లకు అందుబాటు ధరలో మనం ఇస్తే.. ఈజీగా పెద్ద రెవెల్యూషన్ అవుతుందని అంటుంది. దీంతో రాజ్ షాక్ అవుతాడు. క్లయింట్స్ కూడా కావ్య ఇచ్చిన వివరణకు చప్పట్లు కొడతారు.
మాకిప్పుడు మంచి సపోర్ట్ దొరికినట్టైందని, ఈ కంట్రాక్ట్ మీ కంపెనీకే ఇస్తున్నామని చెప్పి వెళ్లిపోతారు. క్లయింట్స్ తో ఇలాగేనా అండి డీల్ చేయడమని సెటైర్ వేస్తుంది కావ్య. థాంక్స్.. ఈ కాంట్రాక్ట్ వదులుకోవాలనుకున్నానని, నీ వల్లే వచ్చిందని రాజ్ అనగా.. సాటి మనిషిగా సాయం చేశానని చెబుతుంది కావ్య. అబ్బా ఈ సాటి మనిషి అని పదాన్ని వదలావా అని రాజ్ చిరాకు పడతాడు.

కనకం ఇంటిని కొనేందుకు సీతారామ్ అనే వ్యక్తి వస్తాడు. కనకం షాక్ అవుతుంది. అప్పు వచ్చి.. అన్ని ఇళ్లు ఏం చేసుకుంటావ్ రోజుకో ఇంట్లో కాపురం పెడతావా ఏంది అని అడుగుతుంది. మీ ఇల్లు అమ్ముతున్నామని మూర్తి గారు చెప్పగా వచ్చానని అంటాడు సీతారామ్. ఒకేసారి ఇల్లు చూసి సెటిల్ చేసుకుందామని అంటాడు. కానీ అప్పు మాత్రం సీతారామ్ పై ఫైర్ అవుతుంది. సీతారామ్.. సెటైర్లు వేస్తూనే ఉంటాడు. అప్పు మండిపోతుంది.అన్ని లెక్కలు వేసి.. 20 లక్షలు ఇస్తానని సీతారామ్ వివరిస్తాడు.

మరోవైపు కల్యాణ్ అప్పు వాళ్ల గురించి ఆలోచిస్తాడు. అప్పుడే రాజ్, కావ్య వస్తారు. కావ్యను పక్కకు పిలిచి.. మీ ఇంట్లో పరిస్థితి ఏం బాగాలేదు వదిన అని కల్యాణ్ వివరిస్తాడు. ఏమైందని కావ్య అడగ్గా.. 50 వేలు అర్జంట్ గా కట్టాలని అంటున్నారని చెబుతాడు కల్యాణ్. ఏదో ఇల్లు తాకట్టులో ఉన్న విషయం గురించి టెన్షన్ గా ఉన్నారని తెలుపుతాడు. 50 వేలా అని కావ్య ఆశ్చర్యపోతుంది. రాజ్ విందామా వద్దా.. అని ఆలోచించి.. వద్దులే, వచ్చి చెబుతుందిలే అనుకుంటాడు. కావ్య గదిలోకి బాధపడుతూ వెళ్తుంది. దీంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాతి ఎపిసోడ్లో.. స్వప్న ఓ గదిలోకి వెళ్లి టాబ్లెట్స్ వేసుకుంటుంది. ఈ విషయాన్ని రుద్రాణి గమనిస్తుంది. అంటే స్వప్నకు ప్రెగ్నెన్సీ లేదా అనుకుంటుంది. ఆ టాబ్లెట్స్ ఎందుకు తెప్పించుకున్నావని ప్రశ్నిస్తుంది. ఇంతటితో ముగుస్తోంది.


Click it and Unblock the Notifications











