twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మా ఇంట్లో అంతే.. మీ కల్చర్ గౌరవిస్తా, అనవసరంగా బాధించొద్దు: యాంకర్ రష్మి

    |

    తెలుగు యాంకర్ రష్మి, నెటిజన్లకు మధ్య ట్విట్టర్లో ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. సోమవారం ఉదయం భోగి మంటలకు సంబంధించిన వీడియో షేర్ చేసిన రష్మి.... హ్యాపీ మకర సంక్రాంతి అంటూ ట్వీట్ చేశారు. ఇది రష్మికి, అభిమానులకు మధ్య వాదనకు దారి తీసింది.

    భోగి పండగను మకర సంక్రాంతి అని విష్ చేస్తున్నారేంటి? ముందు మీరు తెలుగు నేర్చుకోండి. ఇలాంటి తప్పుడు పోస్టులు పెట్టొద్దు అంటూ కొందరు వ్యాఖ్యానించడం రష్మిని బాధించినట్లు తెలుస్తోంది. వారి మధ్య జరిగిన సంభాషణపై ఓ లుక్కేద్దాం.

    అయ్యో మేడం అది సంక్రాంతి కాదు.. భోగి

    రష్మి భోగి మంటలకు సంబంధించిన వీడియో పోస్ట్ చేసి మకర సంక్రాంతి అని విష్ చేయడంతో... అయ్యో మేడం అది సంక్రాంతి కాదు, భోగి అంటూ కొందరు ఆమె ట్వీటును సరిదిద్దే ప్రయత్నం చేశారు.

    ఫీలైన రష్మి.... మా ఇంట్లో అంతే, బాధించొద్దు అంటూ

    నెటిజన్ల కామెంట్లకు ఫీలైన రష్మి... మా ఇంట్లో మకర సంక్రాంతి మాత్రమే సెలబ్రేట్ చేసుకుంటాం. అందుకే అలా విస్ చేశాను. నేను మీ కల్చర్‌ను గౌరవిస్తాను, మీరు కూడా అలాగే నాకు గౌరవం ఇవ్వండి, అనవసరంగా నన్ను బాధించొద్దు అంటూ రిప్లై ఇచ్చారు.

    గూగుల్ సాక్ష్యం చూపుతూ....

    గూగుల్‌లో కూడా 2019 సంక్రాంతి జనవరి 14న అని చూపుతోంది.. అంటూ రష్మి తన వ్యాఖ్యలను సమర్దించుకోవడం గమనార్హం. ఈ విధంగా రష్మికి, నెటిజన్లకు మధ్య ఆసక్తికర వాదన చోటు చేసుకుంది.

    ప్రతి అభిమానికి రిప్లై...

    ప్రతి అభిమానికి రిప్లై...

    సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రష్మికి... ప్రతి అభిమానికి రిప్లై ఇస్తూ ఉంటారు. ఎవరైనా తన గురించి తప్పుడు కూతలు కూసినా, అసభ్యంగా మాట్లాడినా ఆమె వారికి తగిన సమాధానం ఇచ్చిన సందర్బాలు అనేకం ఉన్నాయి.

    English summary
    "In my family we only celebrate makar Sankranthi andi hence I wished and the way i respect your culture so shud u respect mine rather than making hurtful statements for no reason." rashmi tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X