Naga Panchami: ఓవైపు యాగం, మరోవైపు పంచమి సజీవ దహనం.. శివయ్యే తరలిరానున్నాడా?
నాగ పంచమి సీరియల్ రోజురోజుకూ మహా అద్భుతంగా సాగుతుంది. ముఖ్యంగా ఎవరూ ఊహించని విధంగా సాగుతున్న ఈ సీరియల్ ను చూసేందుకు బుల్లితెర ప్రేక్షకులు కూడా పెద్ద ఎత్తున ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే ఈ సీరియల్ లో కార్తీక పౌర్ణమి దగ్గరపడడం పంచమి పాముగా మారాక ఏం జరుగుతుందోనని అంతా ఎగ్జైటింగ్ గా టీవీలు చూస్తున్నారు. అయితే తాజా ఎపిసోడ్ లోనే సీరియల్ లో కార్తీక పౌర్ణమి వచ్చింది. ఈ క్రమంలోనే పంచమిని కాపాడుకోవడానికి మోక్ష, మోక్షను కాపాడుకోవడానికి పంచమి తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.
ముఖ్యంగా కచ్చితంగా తాను ప్రాణాలు విడవాలనుకున్న పంచమి.. తన సజీవ దహనానికి తానే అన్ని ఏర్పాట్లు చేసుకుంది. పెంచిన తల్లి గౌరీకి చివరి గుడ్ బై కూడా చెప్పేసింది. మళ్లీ జన్మంటూ ఉంటూ నీ కడుపులోనే పుట్టాలంటూ చెప్పుకొచ్చింది. తల్లిని చివరి సారిగా గట్టిగా కౌగిలించుకుని కన్నీళ్లు పెట్టింది. గుడి నుంచి వెళ్లిపోవాలని సూచించింది. రాత్రంగా ఏం జరిగినా సరే గుడికి రాకూడదని... పౌర్ణమి రోజు తర్వాత మాత్రమే గుడికి రావాలని తనపై ఒట్టు వేసుకుని మరీ తల్లిని ఇంటికి పంపించేసింది. అలాగే ఎప్పుడూ తన గురించే ఆలోచించే సుబ్బును కూడా పంపించేలా ప్లాన్ చేసింది.

కట్టెలన్నీ ఏరుకుని తన సజీవ దహనం కోసం ఏర్పాట్లు చేసుకుంది. ఈక్రమంలోనే ఈ విషయాన్ని గుర్తించిన సుబ్బ పంచమి వద్దకు వెళ్లాడు. ఏం చేస్తున్నావు పంచమి అని ప్రశ్నించగా... సుబ్బు ఇక నీవు వెళ్లిపోవాల్సిన సమయం ఆసన్నమైంది.. వెళ్లిపో అంటూ తెలిపింది. నేను వెళ్లాలి అనుకున్నప్పుడు నీకు చెప్పే వెళ్లిపోతాను కానీ ఇప్పుడు మాత్రం వెళ్లనని వివరించాడు. కానీ పంచమి మాత్రం అందుకు ఒప్పుకోలేదు. నువ్వు కచ్చితంగా వెళ్లిపోవాల్సిందే లేదంటే నా మీద ఒట్టే అంటూ ఒట్టు వేయించుకుంది. దీంతో చేసేదేమీ లేక సుబ్బు వెళ్లిపోయాడు. నేను ఇప్పుడు వెళ్తే నువ్వు మళ్లీ నన్ను చూడాలనుకున్నా చూడలేవు అంటూ చెప్పి మాయమైపోయాడు.
సుబ్బును పంపించేసిన పంచమి... నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనంటూ సుబ్బును ఉద్దేశించి మాట్లాడింది. ఇక ఆ తర్వాత తాను అగ్నిలో దూకు చనిపోయేందుకు నిప్పు కూడా పెట్టింది. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ... శివైక్యం అయ్యేందుకు ప్రయత్నిస్తుంది. అయితే ఏం జరిగిందో తెలియాలంటే సోమవారం రోజు వచ్చే ఎపిసోడ్ వరకూ ఆగాల్సి వచ్చేటట్లు అర్థం అవుతుంది. ఇదంతా ఈరోజుటి ఎపిసోడ్ లో మనం చూడవచ్చు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో మహా మృత్యుంజయ యాగం చేసేందుకు నాగ సాధువు.. స్వాములను వెతుక్కుంటూ వెళ్తారు.

ఈక్రమంలోనే సప్త రుషులు కనిపిస్తారు. నాగ సాధువు వాళ్లను చూడగానే... అయ్యా మేము ఇలా మహా మృత్యుంజయ యాగం చేయాలనుకుంటున్నాం.. మీరేమైనా సాయం చేస్తారా అని అడుగుతారు. పంచమి గురించి వివరించి ఆమె భర్తను కాపాడాలని చెబుతారు. ఇందుకు సప్త రుషులు కూడా ఓకే చెప్పగా... వారంతా వెళ్తారు. ఇలా వాళ్లను యాగ శాలకు తీసుకు వెళ్తారు. ఇక ఆతర్వాత గుడికి వెళ్లిన నాగ సాధువు... మోక్ష తల్లిదండ్రులు ఈ యాగం చేస్తే బాగుంటుందని అంటారు. అలాగే మోక్ష, పంచమి, గౌరీలు గుడిలోనే ఉంటే బాగుంటుందని అంటారు.
అలా గుడిలో ఉండిపోయిన పంచమి... మోక్షను అక్కడే ఉంచి తల్లికి అప్పగింతలు చెబుతుంది. ఇంటికి పంపిచేస్తుంది. ఆ తర్వాత సుబ్బును కూడా పంపించేసి తాను మాత్రం అగ్నిలో ఆహుతి అయ్యేందుకు ప్లాన్ చేస్తుంది. చూడాలి మరి ఏం జరనగుంది అనేది. ఎవరు చనిపోతారు, ఎవరు బతుకుతారు.... పంచమి పాములా మారుతుందా లేదా ఏం చేయబోతుందనేది.


Click it and Unblock the Notifications











