Naga Panchami: మోక్షపై పాము పగ.. ఎందుకో చెప్పమంటూ పంచమిని అడిగిన భర్త - నిజం చెప్పేస్తుందా?
Naga Panchami November 9th Episode: నాగ పంచమి సీరియల్ అత్యధికి టీఆర్పీని సొంతం చేసుకుంటూ దూసుకెళ్తోంది. ముఖ్యంగా అద్భుతమైన ట్విస్టులతో రోజురోజుకూ బుల్లితెర ప్రేక్షకులను ఉర్రూతలు ఊగించడంలో ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఇటీవలే పంచమి జన్మరహస్యం తెలుసుకున్న మోక్ష.. పంచమిని ఏం చేయబోతున్నాడో తెలుసుకునేందుకు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పంచమికి సాయంగా ఉండేందుకు వచ్చిన సుబ్బును కూడా ఇంట్లోంచి బలవంతంగా పంపించేశారు. ఈక్రమంలోనే పాము అయిన తన భార్యను తలుచుకుంటూ మోక్ష భయపడిపోతూ, బాధతో తనలో తానే కుమిలిపోతున్నాడు. అసలు ఆ పాము తనను ఎందుకు చంపాలనుకుంటుందో చెప్పమంటూ పంచమని అడిగాడు.
అందుకు పంచమికి కూడా సమాధానం చెప్పింది. మీపై పగ తీర్చుకోవడం ఆ పాము ఖర్మ అంటూ మొదలెట్టింది. తన తల్లి అని చెప్పకుండా నాగరాణికి జరిగిన అన్యాయం గురించి చెబుతుంది. అలా దెబ్బతిన్న పాము మిమ్మల్ని చంపాలని చూస్తోందని.. అందరిలాగా ఆ పాములు జాలి, దయా గుణం లేవని.. కచ్చితంగా పగ తీర్చుకుంటాయని వివరించింది. ఇన్నాళ్లూ తన జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తాను.. ఎందుకు చనిపోవాలంటూ మోక్ష ప్రశ్నించగా... పంచమి కూడా ఏడుస్తుంది. ఇదంతా రేపటి ఎపిసోడ్ లో జరుగుతుండగా... పూర్తిగా ఏం జరిగిందో తెలియాలంటే మాత్రం రేపటి ఎపిసోడ్ చూడాల్సిందే.

ఈరోజుటి ఎపిసోడ్ లో ముందుగా మోక్ష హాల్లోని సోఫాలో కూర్చొని పంచమి గురించి ఆలోచిస్తుంటాడు. ఆ సమయంలోనే శిశిర వచ్చి బాబాయి, బాబాయి అంటూ పిలుస్తుంది. వెళ్లు శిశిర నాకిప్పుడు ఆడుకనే మూడ్ లేదని చెప్పినా ఆమె వినకపోవడంతో.. తోసేస్తాడు. దీంతో పాప ఛైర్ లో పడుతుంది. ఇక వెంటనే శిశిర తల్లి చిత్ర పరిగెత్తుకుంటూ వచ్చి మోక్ష పిల్లలతో ఎలా బిహేవ్ చేయాలో తెలుసుకో అంటూ చెబుతుంది. ఈక్రమంలోనే మోక్ష గట్టిగా అరవగా... కుటుంబ సభ్యులు అంతా వచ్చేస్తారు. ఏమైందిరా ఇలా అరుస్తున్నావు అంటూ తల్లి ప్రశ్నించగా.. మరింత కోప్పడుతూ ఫైర్ అయిపోతాడు. తన జీవితం అంతా ఇలా అయిందంటూ బాధను వ్యక్తం చేస్తాడు.
అలాగే తన జీవితంలో వెనకా ముందు అంతా చనిపోయే వాళ్లంటూ వేదాంతం వల్లిస్తాడు. అది విన్న మోక్ష తల్లి మరింత ఏడుస్తుంది. దీనికి వెంటనే ఆమె భర్త నీ వల్లే వాడిలా తయారు అయ్యాడంటూ ఫైర్ అవుతాడు. మోక్షకు పెళ్లి అయిన తర్వాత కూడా నీవు చెప్పినట్లుగానే వినాలి అనుకుంటే కుదరదు అని.. వాడికి పంచమి అంటే ప్రాణం అని వివరిస్తాడు. ఆమెను నువ్వు ఇలా తిడుతూ.. ఇంట్లోంచి వెళ్లిపోమంటే వాడిలాగే తయారవుతాడని.. నీవు ఆ పద్ధతి మార్చుకోవాలని సూచిస్తాడు. మోక్షను కాపాడేది ఈ లోకంలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క పంచమి మాత్రమేనంటూ చెప్పుకొస్తాడు.

ఇక ఆ తర్వాత పంచమి గుడిలో కూర్చొని తాను ఎందుకు బతకాలని, బతికి భర్తను చంపి పాపం మూటగట్టుకోవడం కంటే చనిపోవడమే మేలు అంటూ ఏడుస్తుంది. సుబ్రహ్మణ్య స్వామిని వేడుకుంటుంది. అదే సమయంలో సుబ్బు వస్తాడు. నీవు ఓ సముద్రంలో పడిపోతే.. ఈత రాక, పడవ లేక మునిగిపోయే పరిస్థితి వస్తే ఏం చేస్తావని అంటాడు. అందుకు పంచమి దేవుడిపై భారం వేస్తానని చెప్పగా... ఆ దేవుడు కేవలం నీ మనసులో ఏదైనా ఆలోచన వచ్చేలా చేస్తాడే తప్ప.. నిన్ను భుజాలపై తీసుకెళ్లి గట్టున కూర్చోబెట్టడని చెప్పి ఆమెకు అర్థమయ్యేలా వివరిస్తాడు. సుబ్బుతో మాట్లాడాకా.. కాస్త నిమ్మళించిన పంచమి ఇంటికి బయలు దేరుతుంది.
అలాగే చిత్ర, జ్వాలలు ఓ చోట కూర్చొని... మోక్ష మాటలు చూస్తుంటే త్వరలోనే అతడు చనిపోయేలా అనిపిస్తుందంటూ మాట్లాడుకుంటారు. పౌర్ణమి వరకు ఆగలేం కానీ ఆలోపే మోక్ష చనిపోతే బాగుండని అనుకుంటారు. అలాగే పంచమికి, పౌర్ణమికి, పాముకి ఏదో సంబంధం ఉందంటూ ఆలోచిస్తారు. కానీ వారికి ఏమీ తట్టదు. ఈక్రమంలోనే ఓ నాగు పాము తెచ్చి మోక్షను కాటేసేలా చేద్దామని ప్లాన్ వేస్తారు. ఇక ఆ తర్వాత వారు కూర్చున్న చైర్ లోంచి బయటకు రాలేక ఇబ్బంది పడుతూ కనిపిస్తారు. ఇదంతా పంచమియే చేసుంటుంది. రేపటి ఎపిసోడ్ చూస్తే తప్ప పూర్తిగా క్లారిటీ రాదు.


Click it and Unblock the Notifications











