Brahmamudi November 2nd: రాజ్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన కావ్య... రాహుల్, రుద్రాణిలకు స్వప్న వార్నింగ్..
ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్లో... ఇక స్వప్న బండారం అందరి ముందు బయటపడటంతో.. స్వప్న ఫ్లేట్ ఫిరాయిస్తుంది. కావ్య మీద నిందలు వేస్తుంది. నాకు కడుపు లేదనే సంగతి నీకు తెలియాదా.. అంటూ కావ్యను నిలదీస్తుంది. అమ్మ మీద ఒట్టు వేసి చెప్పు అంటూ స్వప్న రివర్స్ డ్రామా ప్లే చేస్తుంది. ఇక కావ్య సైలెంట్ అయిపోతుంది. ఇక స్వప్న మళ్లీ డ్రామా ప్లే చేస్తుంది. ఇక రాజ్ వచ్చి.. నిన్న ఒక్కటే ప్రశ్న అడుగుతాను. స్వప్నకు కడుపు లేదనే విషయం నీకు మొదటి నుంచి తెలుసా లేదా అని అడుగుతాడు. దానికి కావ్య తెలుసు అని సమాధానం చెప్పడంతో ఇంట్లో వాళ్లంతా షాక్ అవుతారు.
ఇక రుద్రాణి.. ఇలాంటి అక్కచెల్లెల్ని ఎక్కడా చూడాలేదని అంటుంది. ఇక కావ్య రాజ్ కు అసలు నిజం చెప్పబోతుంతే... రాజ్ ఆపి.. ముసుగువేసుకుని తాళి కట్టించుకున్నప్పుడే మోసం గురించి గుర్తించాల్సింది. నీకు సిగ్గుగా అనిపించడం లేదా అంటూ కావ్యను అంటాడు. ఇక అపర్ణ కూడా కావ్యపై ఫైర్ అవుతుంది. మోసాలు, అబద్ధాలు అన్నింటికీ రంగులు వేసి.. అంగట్లో అమ్మగలరు.. వీరు కళాకారులు అంటూ ఫైర్ అవుతుంది. మొత్తం అందరు మాయ చేసి.. మన కుటుంబాన్ని బ్రస్టు పట్టించారు అంటూ అపర్ణ తిడుతుంది.

ఇక రుద్రాణి పుల్ల పెట్టేందుకు...ఇదంతా నడిపించింది తల్లే అంటూ అబండం వేస్తుంది. ఇక కావ్య మాట్లాడబోతుంటే... కావ్యపై ఫైర్ అవుతుంది. ఇక ఇందీరాదేవి, సీతారామాయ్యను వెటకారం చేస్తూ మాట్లాడుతుంది రుద్రాణి. ఏం మాట్లాడారు ఏంటి అని అడుగుతుంది అపర్ణ. అల్లుడా.. నా మేనల్లుడా.. అంటూ రాజ్ మీద కూడా వెటకారంగా మాట్లాడుతుంది. ఇంటిల్లి పాది తప్పు చేసినా.. నా భార్య తప్పు చేయదు అని అన్నావ్ ఇప్పుడు ఏమైంది అంటూ ఫైర్ అవుతుంది. అపర్ణ, సుభాష్ లపై కూడా రుద్రాణి వెటకారంగా మాట్లాడుతుంది.
దీంతో రుద్రాణిపై అపర్ణ ఆపు అంటూ ఫైర్ అవుతుంది. నీ కొడుక్కు ఎంత అన్యాయం జరిగిందో.. నా కొడుక్కి అంతే అన్యాయం జరిగిందని అపర్ణ అంటుంది. నీ కొడల్ని నువ్వు పంపించు... నా కొడల్ని నేను పంపిస్తాను అంటుంది. ఇక కనకం అడ్డుకోబోతుంటే.. క్షమించే ప్రసక్తే లేదు అంటూ ఖరాఖండిగా చెప్తుంది. ఇద్దరినీ పుట్టింటికి పంపుతాను అంటుంది.
ఇక స్వప్న రివర్స్ డ్రామా చేస్తుంది. రాహుల్ ను కూడా పంపించండి అంటుంది. ఇక తనకు రంగుల ప్రపంచం చూపిస్తా అంటూ లేవదీసుకుపోయాడు.. పాకెట్ మనీ కోసం అమ్మ దగ్గర డబ్బులు తీసుకునే ఈ వ్యక్తి... కోటిశ్వరుడు అంటూ నాటాకాలు ఆడాడు. ఈ వ్యక్తి చేసింది తప్పు కాదా అంటూ స్వప్న అంటుంది. నాకు కడుపు ఒక్కటే లేదు.. కానీ నా సర్వస్వం దోచుకున్నాడు అంటూ ఫైర్ అవుతుంది. ఇక మీరు నన్ను బయటకు పంపిస్తే... వెళ్తాను పుట్టింటికి కాదు.. కోర్టుకు అంటూ వార్నింగ్ ఇస్తుంది.
షర్టప్ అంటూ రుద్రాణి అనబోతుంటే.. యూ షర్టప్ అంటూ షాక్ ఇస్తుంది. మరోవైపు రాహుల్ అడ్డుకోబోతుంటే.. నోర్మూయ్ అంటుంది. ఇప్పుడు చెప్పండి వెళ్లమంటే వెళ్తాను అంటూ స్వప్న రివర్స్ లో డ్రామా చేస్తుంది. ఇక అపర్ణ కలగజేసుకుని.. కోర్టుకు వెళ్తావా అంటుంది. ఇక రుద్రాణి కూడా బయటకు నడువు అంటూ గెంటేస్తుంది. ఇక సుభాష్ ఆపండి అంటూ అరుస్తాడు. ఇక ఇప్పటిదాకా ఈ ఇంట్లో అబద్ధం రాజ్యమేలిందని తెలుస్తోంది. ఇక ఈ ఇంట్లో ఎవరు కోట్లు మేట్లు ఎక్కలేదు.. అనార్థాలన్నింటికి మూల కారణం తెలిసింది కాబట్టి.. మేమే ఓ నిర్ణయం తీసుకుంటాం అంటూ ఫైర్ అవుతాడు.
ఇక రుద్రాణి వీళ్లేదు.. ఇప్పుడే వెళ్లగొట్టండి అని చెప్తుంది. అందరూ నీలా ఉండాలని అనుకోకు.. వెళ్లాల్సి వస్తే.. నువ్వు మీ ఆయన దగ్గరకు వెళ్లు అని రుద్రాణికి చెప్తాడు సుభాష్. ఇక గదిలో స్వప్న చెంప పగుల గొడుతుంది కావ్య. నన్నే కొడుతావా అని స్వప్న అంటుంది. నా కంటే ముందు పుట్టావ్ అనే కారణంతో ఇన్నాళ్లు నువ్వు ఎన్ని తప్పులు చేసినా క్షమించినా.. నీ మంచి కోరుకున్నా... కానీ ఇవాళ నా భవిష్యత్తును నాశనం చేయాలనుకున్నావ్.. చివరకు నిజం బయటపడగానే నా మీద నెట్టేశావ్ అంటూ ఫైర్ అవుతుంది.
ఎంత మందిని మోసం చేశావో తెలియడం లేదా... నీ మూలంగా అమ్మ నాన్నలను మాటలు అన్నారు. అంటూ కావ్య చెబుతుంది. ఇక వాళ్లను ఎన్ని అన్నా.. వాళ్లు దులుపుకుంటారు అంటూ స్వప్న అంటుంది. ఇక కావ్య.. అమ్మనాన్నలను పేరు పెట్టి పిలుస్తారా... నిన్ను ఈ ఇంట్లో అంతా ఛీ అనుకుంటున్నారు అంటే.. స్వప్న .. నిన్ను అలాగే చూస్తున్నారు అంటూ చెప్తుంది. ఇక కావ్య.. స్వప్నకు ఏదో మంచి మాటలు చెప్పినా... ఆమె వినిపించుకోకు. ఇక ఇక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.
ఇక తర్వాతి ఎపిసోడ్ లో కావ్యతో రాజ్... నువ్వు అబద్ధం చెప్తావ్ అని మా అత్త చెప్తే నమ్మలేదు.. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు అబద్ధం చెప్పావ్ అని భావించాను. మొట్ట మొదటి సారి తెలిసింది. ఇప్పటి వరకు నీ మీద కోపమే ఉండేది. కానీ ఈరోజు నుంచి అది ద్వేషంగా మారింది. అబద్ధం చెప్పడం నిజం దాచిపెట్టం రెండు నేరమే అని అంటాడు రాజ్. మరి ఆ నేరం మీరు కూడా చేశారు కదా తాతాయ్య గారి కోసం అంటూ కావ్య.. రాజ్ కు షాక్ ఇస్తుంది.


Click it and Unblock the Notifications











