Brahmamudi November 3rd: రాజ్ మోసాన్ని బయటపెట్టిన కావ్య... కోడలికే సుభాష్ సపోర్ట్

బ్రహ్మముడి ఎపిసోడ్ లో ఈరోజు స్వప్న చేసిన పనికి కావ్య చెంపపగులగొడుతుంది. ఇక తనను ఇరికించడంపై కావ్య ఫైర్ అవుతుంది. ఇక కోర్టుకు ఎక్కి ఈ ఇంటి పరువు తీస్తా అంటూ స్వప్న రెచ్చిపోతుంది. దీనికి కావ్య నువ్వు కోర్టుకు పోతానంటే.. నేనే వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తా అంటూ కావ్య సమాధానం చెప్తుంది. ఈ ఇంట్లో అణిగిమణిగి ఉండాలి అంటూ కావ్య.. స్వప్నకు వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. మరోవైపు కృష్ణమూర్తి, కనకం బాధ పడుతూ కూర్చొంటారు. స్వప్న చేసిన పనికి దిగాలుగా కూర్చొని మాట్లాడుకుంటారు.

స్వప్న ఎందుకు ఇలా తయారయింది... కావ్యను, అప్పు కంటే బాగానే చూసుకున్నాం... అంటూ కనకం బోరున విలపిస్తుంది. ఇక ఇంట్లో పెద్దాయన ఇంట్లో ఇద్దరినీ వెళ్లిపోవాలని అంటే... ఎలా మూర్తి అంటాడు. ఆయన అలాంటి నిర్ణయం తీసుకోడు.. నాకు నమ్మకం ఉంది అంటూ కనకం చెప్తుంది. ఇక దీనికి మూర్తి.. స్వప్న అక్కడే ఉంటే.. కావ్య జీవితాన్ని నాశనం చేస్తుంది. ఇలాగే ఏదో ఒక రకంగా కావ్యను ఇరికించేందుకు ప్రయత్నం చేస్తుంది. కావ్యను అక్కడ ప్రశాంతగా ఉండనివ్వదు.. అంటూ కృష్ణమూర్తి అంటాడు.

in November 3rd 2023 Episode number 243 in Brahmamudi Telugu Serial

తండ్రిగా కూతురి జీవితం బాగుండాలి అని కోరుకోవాలి.. స్వప్న లాంటి కూతురు పుట్టాక ఇలా కోరుకోవడం తప్పట్లేదు. ఏదో ఒకటి జరిగి కావ్య జీవితం నుండి స్వప్న వెళ్లిపోతే బాగుండు అని కృష్ణమూర్తి అంటాడు. ఆ దేవుడే నా బిడ్డను కాపాడాలి అని కోరుకుంటాడు. దీనికి కనకం కూడా ఆయన చెప్పింది నిజమే అని అనుకుంటుంది కనకం. ఏదో ఒకటి చేసి.. ఆ ఇంటి నుంచి స్వప్నను దూరం చేయాలని ఫిక్స్ అవుతుంది కనకం.

ఇక గదిలో రాజ్, కావ్య గురించి మాట్లాడుతాడు. నువ్వు అబద్ధం చెప్తావని.. మా అత్త చెప్తే నేను నమ్మలేదు. మొట్ట మొదటి సారి నీ నిజస్వరూపం ఏంటో తెలిసింది. ముసుగు వేసుకున్న పెళ్లి చేసుకున్న ఓ మోసగత్తే నుంచి నేను నీతిని నిజాయితీని ఆశించడం నాదే తప్పు... ఇప్పుడిప్పుడే మెత్త పడుతున్న మనసుకు నువ్వు ఎంత పెద్ద గాయం చేశావో తెలుసా... ఈ క్షణం వరకు నీ మీద కోపం మాత్రమే ఉండేది.. ఇప్పుడు ద్వేశంగా మారింది. ఇది నేరమే కాదు.. పాపం కూడా.. కుటుంబాన్ని మొత్తం మోసం చేశావ్ అంటూ కావ్యను రాజ్ నిలదీస్తాడు.

in November 3rd 2023 Episode number 243 in Brahmamudi Telugu Serial

ఏం చేయాలి అంటూ రాజ్ అంటాడు. చంపేయాలి అని కావ్య చెప్తుంది. నేను హంతకుడిని కాదు... అని రాజ్ అంటాడు. దానికి నాకు బతికుండే అర్హత లేదు అంటూ కావ్య అంటుంది. మీ దృష్టిలో నేను చేసిదంతా నాటకం.. మరి మీరు చేసింది ఏమిటి అంటూ కావ్య రాజ్ ను ప్రశ్నిస్తుంది. నేనేం చేశాను అని రాజ్ అడగ్గా... నా కోరికల్ని చంపేశాడు.. నా ఆనందాల్ని చంపేశారు.. నా ఉనికిని చంపేశారు. నేను ఒక మర బొమ్మలా నిలబడ్డాను.. మోసం, అబద్ధం అంటూ నన్ను ఎన్ని విషయాల్లో వేలిత్తి చూపించారు.. అంటూ కావ్య అంటుంది.

మోసం చేసిన నేను మహారాణి అయిపోయానా... కేవలం ఈ మంగళసూత్రం కోసం.. ఈ గడప దాటకుండా మొండిగా నిలబడ్డాను.. ఇదంతా ఎందుకోసం.. నా కాపురం కోసం.. అంటూ కావ్య చెప్తుంది. నా అక్క విషయంలో అబద్దం నేనే బయటపెడితే.. ఆమె కాపురాన్ని నేనే చెడగొట్టినట్లు అవుతుందని వెనకంజ వేశాను అంటూ కావ్య చెప్పుకువస్తుంది. అబద్ధం చెప్పడం.. నిజం దాచిపెట్టడం రెండు నా దృష్టిలో నేరాలే అంటూ రాజ్ చెప్తాడు.

మరి ఆ నేరం మీరు కూడా చేశారు కదా.. తాతాయ్య గారి కోసం.. మీరు నాతో ప్రేమగా ఉన్నట్లు నటించలేదా.. ఆ విషయంలో నాకు, ఆయనకు అబద్ధాలు చెప్పలేదా... అందరి ముందు నిజం దాచిపెట్టి.. నాటాకాలు బుటకాలు మొదలు పెట్టలేదా.. నాకు అంతా తెలుసు... మీరు ఆడుతుంది నాటకం.. మీరు అంతా తాతాయ్య గారి కోసం కాదా... మీ ప్రేమ అబద్ధం కాదా.. మీరు పెట్టినా గడువు అబద్ధం కాదా... అంటూ కావ్య అంటుంది. మా అక్క మోసం చేసింది.. నాకు తెలిసినా నోరు మెదపలేదని మీ ఆరోపణ అని కావ్య.. అంటే రాజ్ అవును అంటాడు.

in November 3rd 2023 Episode number 243 in Brahmamudi Telugu Serial

మరి రాహుల్ మా అక్కను పెళ్లి పీటల నుంచి స్వప్నకు మాయమాటలు చెప్పి లేవదీసుకుపోవడం నేరం కాదా.. మీతోనే ఉంటు మీ పక్కనే ఉంటూ ఏమి తెలియనట్టు అమాయకంగా నటించడం నేరం కాదా... రాహుల్ ను మేము మోసం చేశామని మీరు ఆరోపిస్తున్నారు... అంటూ కావ్య అంటుంది. లేదు నేను ఏ తప్పు చేయలేదు... అంటూ కావ్య అంటుంది. నాకు నిజం తెలిసే సరికి అప్పటికే రాహుల్ స్వప్న మెడలో తాళి కట్టాడు... అంటూ కావ్య చెప్తుంది.

నేను ఎన్నో సార్లు చెప్పాలనుకున్నాను.. కానీ చెప్పలేకపోయాను... దాని స్వర్థం కోసం... నన్ను నా కపురాన్ని కూడా బలిపీటం ఎక్కించింది.. అంటూ కావ్య ఏడుస్తుంది. దానికి రాజ్.. నిజ స్వరూపం బయటపడ్డకా కూడా ఇంత అద్భతుంగా కథ అల్లుతావని నాకు తెలుసు.. అంటూ నవ్వుతాడు. ఇక .. మీరు లెక్కలు వేసుకుని మనిషిని శిక్షించాలో, రక్షించాలో అనుకుంటారు... అంటూ కావ్య అంటుంది.

మీరంతా అద్దాల మేడలు కట్టే వాళ్లు.. ఒక చిన్న రాయి లాంటి నిజం చాలు మీరు కట్టుకున్న అద్దాల ఇల్లు కూలిపోవడానికి... ఆ చిన్న రాయి ఈరోజే పడింది.. ఇంకేప్పటికీ నీకు అవకాశం ఇవ్వను అంటూ రాజ్ చెప్తాడు. అందరూ నన్ను నువ్వు మారావ్ రాజ్ అన్నారు.. నువ్వు కూడా అన్నావ్... నిజమే నేను తాతాయ్య కోసం ఆడిన నాటకంలో నిజంగానే మారొచ్చు. మారిన రాజ్ ను... పాత స్వరాజ్ లా మార్చింది నువ్వే... అంటూ చెప్పి వెళ్లిపోతాడు.

ఇక కావ్య తనతో రాజ్ మెలిగిన తీరును గుర్తు తెచ్చుకుని బాధపడుతూ ఉంటుంది. మరోవైపు అపర్ణ.. కావ్య ఎలాంటిదో ఇప్పటికైనా అర్ధం అయిందా అంటూ సుభాష్ తో అంటుంది. ఆకుటుంబం మొత్తం అంతే అంటూ ఫైర్ అవుతుంది. కావ్య చేసింది నాకు తప్పుగా అనిపించడం లేదని సుభాష్ అంటాడు. కళ్ల ముందు మోసం కనిపిస్తున్నా.. ఇంకా మీకు న్యాయం కనిపిస్తుందా అని అపర్ణ అంటుంది. అక్క కోసం.. ఏ చెల్లి అయినా అలాగే చేస్తుంది అని సుభాష్ అంటాడు.

కావ్య తప్పు చేసినా... ఇంకా నన్నే తప్పుపడుతున్నావా అంటూ అపర్ణ అంటుంది. రాహుల్ స్వప్నను మోసం చేశాడు. అక్క జీవితం కాపాడేందుకు అలా చేసిందేమో.. అంటాడు సుభాష్. అయితే పెళ్లి తర్వాత అయినా చెప్పాలి కదా... కనీసం రాజ్ కు అయినా చెప్పాలి కదా.. అంటుంది అపర్ణ. ఇక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది. తదుపరి ఎపిసోడ్ లో అపర్ణ కోసం కావ్య టీ తీసుకువస్తే.. అది పగులగొడుతుంది. ఇన్నాళ్లు నా కొడుక్కి మాయమాటలు చెప్పి తప్పించుకున్నాువ్. నా కొడుకు కూడా నువ్వు ఇంట్లో నుంచి పోవాలని కోరుకుంటున్నాడు. మీ అక్కను తీసుకుని నీ అంతట నువ్వే ఈ ఇంటి నుంచి వెళ్లిపోతే చాలా మంచిదంటూ వార్నింగ్ ఇస్తుంది. ఇక కావ్య కృష్ణుడి వద్దకు వచ్చి విలపిస్తూ ఉంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X