Brahmamudi October 14th: అప్పుకు చీర ఇచ్చి అవమానించిన కల్యాణ్...కనకానికి స్వప్న డ్రామా తెలిసిపోనుందా?
ఈరోజు బ్రహ్మముడి ఇక స్వప్న అబార్షన్ డ్రామా వేయగా... కావ్య వచ్చి పట్టుకోవడంతో ఆ ప్లాన్ ఫెయిల్ అవుతుంది. ఇక ఇంట్లో వాళ్లంతా కేర్ లెస్ గా ఉన్నావ్ అంటూ తిడతారు. తల్లైనా ఆనందం ఆమెలో లేదు.. ఓసారి బొప్పాయి తింటుంది.. మరోసారి కిందపడిపోతుంది.. ఇలా సోయి లేకుండా ఉంటారా ఎవరైనా అని రుద్రాణి అంటుంది. ఇక ఇంట్లో వాళ్లంతా డిసైడ్ అయి.. ఓ నర్స్ ను పెట్టాలి అనుకుంటారు. బయటవాళ్లు వస్తే ప్లాన్ తెలిసిపోతుంది అనుకుంటుంది.
ఇక కావ్య ఉంది కదా అని స్వప్న అంటుంది. దానికి ఆమె మన మనిషి కానీ... మర మనిషి కాదు అని ధాన్యలక్ష్మి అంటుంది. ఇప్పటికే ఇంట్లో పని మనిషి మానేసి... ఇంట్లో పనంతా కావ్యనే చూసుకుంటుంది అని చెప్తుంది. ఇక డాక్టర్ తో మాట్లాడి నర్సను పెడతాను అని చెప్తాడు సుభాష్. మరోవైపు అప్పుకు సర్ ప్రైజ్ ఇద్దామని కల్యాణ్, అనామిక వస్తారు. మా ఇద్దరిని కలిపింది నువ్వే కదా.. అందుకే నీకో సర్ ప్రైజ్ అంటూ అనామిక చెప్తుంది. కల్యాణ్ చెప్పాడు.. నువ్వే కదా మా ప్రేమకు హెల్ప్ చేశావ్ అని గిఫ్ట్ ఇవ్వాలని వచ్చామని చెప్తారు.

మా గిఫ్ట్ నువ్వు తీసుకోవాలని కల్యాణ్ చెప్తాడు. ఇక కల్యాణ్ అప్పు కోసం ఓ గిఫ్ట్ ఇస్తాడు. అప్పు తీసుకుంటుంది. తీసి చూడు బ్రో అని చెప్తాడు. ఇంటికి వెళ్లాక చూస్తాను అని చెప్తుంది అప్పు. వద్దు చూడు అని చెప్పగా.. ఓపెన్ చేసి చూస్తుంది. అందులో చీర ఉంటుంది. అది చూసి చీరనా అని అంటుంది అప్పు. ఇక చీర గురించి మాట్లాడుకుంటారు. బ్రోకి చీరలు నచ్చవు.. చీర గురించి, అమ్మాయిల గురించి, వారి ఫీలింగ్స్ గురించి చెబుతుంది అనామిక.
అవన్నీ అప్పుకు సెట్ కావు. తను సున్నితంగా ఉండదు. ఏ కోణంలో అమ్మాయిలా కనిపించదు. తనకు బండరాయికి పెద్దగా తేడా లేదు. ప్రేమ, ఫీలింగ్స్ వంటివి అంటేనే బ్రోకి చిరాకు అంటూ కల్యాణ్ అప్పును అవమానించేలా మాడ్లాడుతాడు. ఇక అప్పుకు ఫోన్ వచ్చినట్లు మాట్లాడుతుంది. ఇక నేను వెళ్తాను అని అప్పు చెప్పగా... చీర ప్యాక్ చేసి అప్పుకు ఇస్తాడు. ఇక అప్పు బాధగా వెళ్లిపోతుంది. ఇక అనామిక గిఫ్ట్ మార్చితే బాగుండు తను ఫీల్ అయింది అని చెప్తగా.. కల్యాణ్ మాబ్రోకి ఫీలింగ్స్ ఉండవు అని చెప్తాడు.
మరోవైపు కష్టంగా నడుస్తున్న కావ్య కింద పడిపోబోతుంటే.. వచ్చి పట్టుకుంటాడు రాజ్. ఏమైందని రాజ్ అడిగితే.. అక్కను పట్టుకోబోతుంటే కాలు బెణికింది అని కావ్య అంటుంది. కాసేపు టామ్ అండ్ జెర్రీలా మాట్లాడుకుంటారు. ఇక కావ్యను పట్టుకుని నడిపించుకుని గదిలోకి తీసుకొస్తాడు. తర్వాత ఆయింట్ మెంట్ తీసుకొచ్చి కావ్య కాలుకు రాస్తానంటాడు.వద్దు పాపం తగులుతుందని కావ్య చెప్తుంది. భర్త అయింట్ మెంట్ రాయకూడదని ఏ గ్రంథంలో రాసి ఉందని... కావ్య కాలు తీసుకుని నొప్పి ఉన్న చోట ఆయింట్ మెంట్ రాస్తాడు రాజ్. అదంతా ఇందిరాదేవి దంపతులు చూసి మురిసిపోతారు.
ఇందిరాదేవి, సీతారామయ్య చూడటాన్ని కావ్య చూస్తుంది. హో ఇదంతా తాతయ్య కోసమా. ఇదంతా నిజం అయితే ఎంత బాగుండేదో అని కావ్య అనుకుంటుంది. తర్వాత కావ్యను లేపి నడిపిస్తాడు రాజ్. అదంతా చూసి మురిసిపోతారు సీతారామయ్య, ఇందిరాదేవి. తర్వాత ఒక్కదానివే నడవగలవా అని కావ్యతో అంటే.. హా అని నడుస్తుంది. రాజ్ చేసిన పనికి కావ్య ఇదంతా నిజమయితే ఎంత బాగుండో అని అనుకుంటుంది.
ఇక కావ్య కృష్ణుని దగ్గరికి వెళ్లి జరిగినదంతా చెప్పుకుని బాధపడుతుంది. భర్త ప్రేమను చూసి సంతోషపడలా... అది నీటి బుడగల ఆయువు లేనిదని బాధపడాలా అని బాధపడుతుంది. ఒక మనిషిని ఇష్టపడితే.. వాళ్లు చేసిన తప్పును కూడా క్షమించేంత మనసు ఉండాలి. నా భర్త విషయంలో ఎంత ఆలోచించినా చివరికి బాధే సమాధానంగా మిగులుతుందని కావ్య.. కృష్ణుడితో చెప్పుకుంటుంది. ఆయన నటిస్తేనే ఇంతా బాగుంది. అదే ప్రేమిస్తే ఇంకెంత బాగుంటుంది. ఆయన నటనను నిజం చేసి ప్రేమ వైపు నడిపించు. ఇక జీవితంలో నిన్ను ఏ కోరిక కోరను అంటూ మొరపెట్టుకుంటుంది. ఇక ఇక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.
ఇక తదుపరి ఎపిసోడ్‌లో దుగ్గిరాల ఇంటికి వచ్చిన కనకం స్వప్నను తీసుకెళ్లడానికి అనుమతి ఇవ్వమని అడుగుతుంది. ఆ పని చేయండి ఎంతకని కాపాలా ఉంటామంటూ రుద్రాణి అంటుంది. స్వప్నకు సీమంతం చేయాలనుకుంటున్నాం. నువ్వే ఇక్కడ ఉండి స్వప్నను చూసుకోవచ్చు కదా అని ఇందిరా దేవి అంటుంది. దీంతో కావ్య, స్వప్న షాక్ అవుతారు. అమ్మకు నిజం చెప్పేయాలని అనుకుంటుంది కావ్య.


Click it and Unblock the Notifications











