Brahmamudi September 22nd: విగ్రహాలు మాయం.. కావ్యకు ఇచ్చిన మాట రాజ్ నిలబెట్టుకుంటాడా?
బ్రహ్మముడి సీరియల్ గత వారం నుంచి ట్విస్టుల మీద ట్విస్టుల మీద సాగుతోంది. ఇక ఈరోజు కావ్య ఇంటికి రాజ్ వెళ్తాడు. అక్కడ కావ్యకు ఆలస్యం కావడంతో అక్కడే ఉండిపోతాడు. అది తెలిసి అపర్ణ రగిలిపోతుంది. మరోవైపు కృష్ణమూర్తిని కొట్టి.. రుద్రాణి పంపిన రౌడీలు విగ్రహాలను ఎత్తుకెళ్తారు. విషయం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు... వారిని పట్టుకుంటాడా లేదా అనేది ఈరోజు ఎపిసోడ్ లో తెలుసుకుందాం.
నేటి బ్రహ్మముడి సీరియల్ లో రాజ్ కావ్య ఇంటికి వెళ్తాడు. అక్కడ ఇంకా పెయింటింగ్ వెయాల్సిన విగ్రహాలు ఉండటంతో... ఆలస్యం అవుతుందని చెపుతుంది. దానికి రాజ్... నేను వెయిట్ చేస్తానని చెబుతాడు. కాసేపు అక్కడ సరదా సరదాగా మాట్లాడుకుంటారు. ఇక కావ్య రాజ్ ను ఇక్కడే ఉండండి ఈరోజు అని అడుగుతుంది. ఎందుకు అని రాజ్ అడగ్గా... ఈ కాంట్రాక్టు మీ వల్లే వచ్చింది... ఈరోజు పని పూర్తి అవుతుంది కాబట్టి మీరే గుమ్మడి కాయ కొట్టండి అంటుంది.

దానికి రాజ్.. ఈ కాంట్రాక్టు నా వల్ల రాలేదు.. నీ టాలెంటు వల్ల వచ్చిందని చెబుతాడు రాజ్. ఉండండి ప్లీజ్ అని కావ్య అడగ్గా... సరే ఉంటాను అని చెబుతాడు. మరోవైపు అపర్ణ... సీతారామయ్యతో మాట్లాడుతుంది. కావ్య ఇంకా ఇంటికి రాలేదు.. మీరు ఇచ్చిన అలుసు వల్లేనని అంటుంది. రాజ్ తీసుకురావాడాని వెళ్లాడు వస్తాడు అని చెబుతాడు. అది విన్న అపర్ణ మరింత రగిలిపోతుంది. రాజ్ కు సీతారామాయ్య కాల్ చేస్తాడు. ఇంకా ఎంత సేపు రావడానికి అని అడుగుతాడు. ఇక్కడే ఉందామని అనుకుంటున్న తాతాయ్య అని రాజ్ అంటాడు.

మంచి నిర్ణయం తీసుకున్నావు అని సీతారామయ్య రాజ్ తో అంటాడు. ఇక ఇది విన్న అపర్ణ కోపంతో లోపలికి వెళ్తుంది. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న రుద్రాణి.. రాహుల్ కు ఫోన్ చేసి.. రాజ్ కూడా అక్కడే ఉన్నాడు అని చెబుతుంది. మంచిదే కదా మమ్మీ అని చెబుతాడు రాహుల్. వాడికి కూడా నాలుగు దెబ్బలు పడుతాయని చెప్తాడు. నువ్వు ఏమైనా చేయ్ కానీ... విగ్రహాలు కావ్యకు దొరకకూడదని అంటుంది రుద్రాణి. ఓకే మమ్మీ అంటాడు రాహుల్.

కనకం ఇంట్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇది చూసిన కావ్య... ఏమైంది అమ్మ అని అడుగుతుంది. ఆనందంతో నిద్ర పట్టడంలేదని కాసేపు మాట్లాడుకుంటారు. రాజ్ సహాయంతోనే ఇదంతా జరిగిందని మాట్లాడుకుంటారు. ఇది లోపల ఉన్న రాజ్ వింటూ ఉంటాడు. అంతలో అప్పు వచ్చి క్యాంప్ ఫైర్ వేసుకుందని చెబుతుంది. మరోవైపు కృష్ణ మూర్తి విగ్రహాల దగ్గర కాపలగా తిరుగుతూ ఉంటాడు.

క్యాంప్ ఫైర్ వెలిగించుకుని... అంతా కూర్చొని మాట్లాడుకుంటారు. ఆడపిల్లలే ఎందుకు అత్తింటికి వెళ్లాలి. మగవాళ్లు ఎందుకు రాకూడదు అని కావ్య అంటుంది. ఓ డైలాగ్ కూడా ఉందిగా.. ఆడ పిల్ల అంటే ఆడ పిల్లే కానీ, ఇక్కడ పిల్ల కాదు అని అప్పు చెప్తుంది. ఆ తర్వాత పాటలు పెట్టుకుని డ్యాన్స్ చేస్తారు. ఇదంతా చూసి రాజ్ కిటికిలోంచి చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు. మరోవైపు కృష్ణ మూర్తి విగ్రాహల వద్ద తిరుగుతూ ఉంటాడు. అతను పడుకుంటే... విగ్రహాలు ఎత్తుకెళ్దామని వెయిట్ చేస్తూ ఉంటారు రౌడీలు.
ఇక తదుపరి ఎపిసోడ్ లో కృష్ణమూర్తిని చితకబాది విగ్రహాలను ఎత్తుకెళ్తారు. అన్ని విగ్రహాలను డీసీఎంల్లో ఎక్కించుకుని రౌడీలు ఎత్తుకెళ్లిపోతారు. విషయం తెలుసుకున్న రాజ్, కావ్య.. కృష్ణ మూర్తి దగ్గరకు వచ్చి జరిగింది తెలుసుకుంటారు. ఇక కావ్య నాకు మీరు తప్ప ఎవరూ లేరని రాజ్ తో చెబుతుంది. అప్పుడు రాజ్... మన కారుకు ఎదురుగు వచ్చినా డీసీఎం లోనే విగ్రహాలు ఉండాలని అని గెస్ చేస్తాడు. ఇక వాటిని నేను పట్టుకుంటానని వెళ్తాడు.


Click it and Unblock the Notifications











