ఆమెతో బెడ్ షేర్ చేసుకున్న శ్రీహాన్: బయట పెట్టిన ఇనాయా.. వీడియో చూపించడంతో పరువు గోవిందా!
ఎప్పుడు ఎలాంటి టాస్కులు ఉంటాయో తెలియకుండా.. ఎప్పుడు ఎవరు ఎలిమినేట్ అవుతారో అంచనాలే వేయకుండా.. చిత్ర విచిత్రమైన పరిణామాలతో ఆసక్తికరంగా సాగుతూ ప్రేక్షకులకు మజాను పంచుతోన్న ఏకైక రియాలిటీ షో బిగ్ బాస్. మిగిలిన భాషలతో పోలిస్తే తెలుగులో వచ్చే దానికి మాత్రమే భారీ స్పందన దక్కుతోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆరో సీజన్ కూడా ఆసక్తికరంగా సాగుతోంది. ఇక, ఈ సీజన్‌లో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో ఇనాయా సుల్తానా.. మరో ఇద్దరు కంటెస్టెంట్లు ఒకే బెడ్‌పై పడుకుంటున్నారని కామెంట్స్ చేసింది. ఆ వివరాలు మీకోసం!

వాటి కంటే చాలా తక్కువ రేటింగ్
అసలు అంచనాలు లేకుండానే వచ్చినా బిగ్ బాస్ షో తెలుగులో చాలా సీజన్లను క్రమం తప్పకుండా పూర్తి చేసుకోగలిగింది. దీంతో నిర్వహకులు ఇటీవలే ఆరో దాన్ని కూడా మొదలు పెట్టారు. ఇందులో గతంలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త కంటెంట్‌ను చూపిస్తున్నారు. ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు. కానీ, ఈ సీజన్‌కు మాత్రం ప్రేక్షకుల నుంచి సరైన రేటింగ్ మాత్రం రావట్లేదు.

లవ్ ట్రాక్‌లు బాగా.. ఫుల్ పాపులర్
దేశ వ్యాప్తంగా బిగ్ బాస్ షో సక్సెస్ అయిందంటే దానికి కారణం అందులో కనిపించే చిత్ర విచిత్రమైన సన్నివేశాలే అని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ఈ షోలో కంటెస్టెంట్ల మధ్య కనిపించే లవ్ ట్రాకులు మరింత ఎలివేట్ అవుతుంటాయి. వీటికి ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ భారీగా వస్తోంది. ఫలితంగా ఈ షో వల్ల ఎంతో మంది జంటలుగా మారి తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ పాపులర్ అయ్యారు.

ఆరో సీజన్‌లో అతడు.. ఇనాయా
బిగ్ బాస్ ఆరో సీజన్‌లో కూడా కొన్ని జంటలు బాగా హైలైట్ అయ్యాయి. అందులో ముందుగా ఆర్జే సూర్య - ఆరోహి జోడీగా మారి తెగ హల్‌చల్ చేసింది. ఆమె వెళ్లిపోయిన తర్వాత అతడు ఇనాయా సుల్తానాతో ఓ రేంజ్‌లో రొమాన్స్‌ను పండించాడు. మరోవైపు, ఆర్జున్ కల్యాణ్ కూడా శ్రీ సత్య కోసం తెగ ప్రయత్నాలు సాగించాడు. ఇలా వీళ్లంతా జంటలుగా సందడి చేసేశారు.

మిషన్ టాస్క్.. పర్సనల్ మేటర్లు
గత వారం కెప్టెన్సీ కంటెండర్లను ఎంపిక చేసేందుకు 'మిషన్ ఇంపాజిబుల్' అనే టాస్కును నిర్వహించిన విషయం తెలిసిందే. ఇది గతంలో కంటే ఎక్కువ ఫిజికల్ అయిపోయింది. మరీ ముఖ్యంగా రెడ్ టీమ్ సభ్యులు ఇనాయా సుల్తానా క్యారెక్టర్‌పై విమర్శలు చేశారు. ఆమె కూడా కొందరి పర్సనల్ మేటర్లను తీసుకొచ్చింది. దీంతో ఇదంతా ఎంతో రచ్చ రచ్చగా సాగిపోయింది.

వాళ్లకు క్లాస్ పీకిన కింగ్ నాగార్జున
బిగ్ బాస్ షోలో సాధారణంగా శని, ఆదివారాలు హోస్ట్ అక్కినేని నాగార్జున సందడి చేస్తుంటాడు. ఇందులో భాగంగానే శనివారం రాత్రి జరిగిన ఎపిసోడ్‌లో ఆయన గత వారం జరిగిన 'మిషన్ ఇంపాజిబుల్' టాస్కులో పొరపాట్లు చేసిన కంటెస్టెంట్లపై నాగార్జున ఓ రేంజ్‌లో సీరియస్ అయ్యాడు. ఈ క్రమంలోనే కొందరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఊహించని విధంగా క్లాస్‌లు పీకాడు.

ఒకే బెడ్‌పై శ్రీహాన్, శ్రీ సత్య అని
శనివారం జరిగిన ఎపిసోడ్‌లో ఇనాయా మాట్లాడిన కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలను నాగార్జున ప్రస్తావించాడు. ఈ సమయంలోనే శ్రీ సత్య మాట్లాడుతూ.. 'శ్రీహాన్‌కు ఏసీ పడడం లేదని రెండు రోజులు నా బెడ్ మీద పడుకున్నాడు. దాన్ని ఇనాయా వేరే రకంగా మాట్లాడింది' అని చెప్పింది. దీంతో నాగార్జున ఆమెను ఎందుకలా అన్నావని ప్రశ్నించాడు. దీనికామె ఏదేదో చెప్పుకొచ్చింది.

ఇనాయా చెప్పింది.. వీడియోలో
నాగార్జున అడగ్గానే ఇనాయా సుల్తానా 'నేను ఉద్దేశపూర్వకంగా అనలేదు సార్' అని చెప్పింది. దీంతో ఆయన వీడియో చూపించాడు. అందులో శ్రీహాన్ 'నీకు కంటెంట్ ఇవ్వడమే తెలీదు' అన్నాడు. దీనికి ఇనాయా 'నువ్వు ఎక్కడ పడుకుంటున్నావో చూస్తున్నాం' అని అంది. దీంతో ఆమె కావాలనే అన్నట్లు అర్థమైంది. అప్పుడు నాగ్ ఆమె పరువు పోయేలా క్లాస్ తీసుకున్నాడు.


Click it and Unblock the Notifications











