Bigg Boss Telugu 6: వర్మతో కాళ్లు పట్టించుకుంది.. కిస్ పెట్టించుకుంది.. బిగ్ బాస్‌లోకి వచ్చేసింది!

తెలుగు బుల్లితెరపై అప్పటి వరకూ పెట్టుకున్న సరిహద్దులను చెరిపేస్తూ.. ఎన్నో ఊహించని, ఆసక్తికరమైన సంఘటనలను చూపిస్తూ.. ప్రేక్షకులకు భారీ స్థాయిలో ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తోన్న ఏకైక రియాలిటీ షో బిగ్ బాస్. దేశంలోని ఎన్నో భాషల్లో ప్రసారం అవుతోన్నా.. తెలుగులో మాత్రమే ఇది అత్యధిక టీఆర్పీ రేటింగ్‌ను సొంతం చేసుకుంటోంది. ఫలితంగా నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది. ఈ ఉత్సాహంతోనే నిర్వహకులు వరుసగా సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆరో దాన్ని మొదలు పెట్టారు. ఎంతో గ్రాండ్‌గా సాగుతోన్న ప్రీమియర్ ఎపిసోడ్‌లో తాజాగా ఓ బోల్డు బ్యూటీ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమెకు సంబంధించిన వివరాలేంటో మీరే చూడండి!

అంచనాలకు తగ్గట్లే ఆరో సీజన్

అంచనాలకు తగ్గట్లే ఆరో సీజన్

ఏమాత్రం అంచనాలు లేకుండానే బిగ్ బాస్ షో తెలుగులోకి పరిచయమైంది. అయినప్పటికీ తెలుగు ప్రేక్షకుల మద్దతుతో ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. ఫలితంగా ఐదు సీజన్లను నిర్వహకులు విజయవంతంగా పూర్తి చేశారు. ఇప్పుడు ఆరో దానిని కూడా నేటి నుంచి మొదలు పెట్టారు. దీనిపై ఉన్న అంచనాలకు అనుగుణంగానే ఇది ప్రేక్షకులను అలరించబోతుంది.

గ్రాండ్‌గా లాంచ్ అయిన సీజన్

గ్రాండ్‌గా లాంచ్ అయిన సీజన్

తెలుగులో బిగ్ బాస్ సీజన్ ఎప్పుడు వచ్చినా దానిని అదిరిపోయే స్పందన వస్తుంది. ఇక, ఆరో సీజన్‌ను తాజాగా ప్రారంభించారు. దీనికి సీనియర్ హీరో అక్కినేని నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తున్నారు. కంటెస్టెంట్ల ఆటపాటలతో ఈరోజు ఎపిసోడ్ అంగరంగ వైభవంగా సాగుతోంది. ఇప్పటికే పలువురు కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించి తెగ సందడి చేస్తున్నారు.

వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ

వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ

తెలుగులోనే బిగ్ బాస్ షో ఊహించిన దానికంటే ఎక్కువగా సక్సెస్ అయింది. అందుకు అనుగుణంగానే ఈ సారి ప్రసారం అవుతున్న సీజన్ కోసం నిర్వహకులు ఫేమస్ అయిన కంటెస్టెంట్లనే సెలెక్ట్ చేశారు. బుల్లితెరపై సందడి చేసే నటీనటులు, యాంకర్లతో పాటు సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన వారికి ప్రాధాన్యత ఇచ్చారు. మొత్తంగా ఆడవాళ్లనే ఎక్కువగా తీసుకున్నారు.

హౌస్‌లో ఎంటరైన బోల్డ్ బ్యూటీ

హౌస్‌లో ఎంటరైన బోల్డ్ బ్యూటీ

ఇప్పటికే పలు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించడంతో పాటు ఆర్జీవీ కాంపౌండ్ గర్ల్‌గా పేరు తెచ్చుకున్న ఇనాయా సుల్తానా బిగ్ బాస్ ఆరో సీజన్‌లో కంటెస్టెంట్‌గా వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె ప్రీమియర్ ఎపిసోడ్‌లో అదిరిపోయే పెర్ఫార్మెన్స్‌తో స్టేజ్ మీద రచ్చ చేసేసింది. ఈ ఫైర్ బ్రాండ్ లేడీ రాకతో బిగ్ బాస్ షో మరింత బోల్డుగా, ఆసక్తికరంగా సాగే అవకాశం ఉందని చెప్పొచ్చు.

ఊ అంటావా.. ఊఊ అంటావా

ఊ అంటావా.. ఊఊ అంటావా


బోల్డు బ్యూటీ ఇనయా సుల్తానా పుష్ప సినిమాలోని 'ఊ అంటావా? ఊఊ అంటావా' అనే సాంగ్‌లో అదిరిపోయే స్టెప్పులతో ఇరగదీసేసింది. ఆమె స్టేజ్ మీదకు వచ్చిన వెంటనే రాంగోపాల్ వర్మతో వైరల్ అయిన వీడియో గురించి నాగార్జున ఆమెను ప్రశ్నించాడు. దీనికామె పాజిటివ్‌గా తీసుకుంది. ఆ తర్వాత తన ఫ్యామిలీ, డాడీ గురించి చెప్పి చాలా ఎమోషనల్ అయిపోయింది.

కాళ్లు పట్టుకుని.. కిస్ పెట్టుకుని

కాళ్లు పట్టుకుని.. కిస్ పెట్టుకుని


ఇనాయా సుల్తానా తాజాగా విడుదలైన 'బుజ్జి ఇలారా'లో నటించింది. ఇక, ఆ మధ్య ఈ బ్యూటీ ఆర్జీవీతో కలిసి సిగరెట్ కాల్చుతూ రచ్చ చేసింది. దీంతో వర్మ కూడా ఆమెకు ముద్దులు పెట్టేశాడు. తర్వాత ఇనయా కాళ్ల మీద కూడా పడ్డాడు. దీంతో ఆమె ఒక్కసారిగా ఫేమస్ అయింది. దీంతో ఆమె పేరు మారుమ్రోగింది. ఈ కారణంగానే ఇప్పుడు బిగ్ బాస్ ఆఫర్ పట్టేసిందట ఈ అమ్మడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X