Bigg Boss 6: బిగ్ బాస్‌లోకి మరో ఆర్జీవీ హాట్ బ్యూటీ.. కాళ్లపై పడి ముద్దులు.. అలా ఆఫర్ పట్టేసిందిగా!
బిగ్ బ్రదర్ అనే ఇంగ్లీష్ రియాలిటీ షో ఆధారంగా వచ్చి.. చాలా తక్కువ సమయంలోనే ఇండియాలో టాప్ ప్లేస్‌కు చేరుకుంది బిగ్ బాస్. ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్‌ను చూపిస్తూ సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న ఈ షో.. ఐదేళ్ల క్రితమే తెలుగులోకి కూడా పరిచయమైంది. మరే భాషలో లేని విధంగా ఇక్కడ ఈ కార్యక్రమానికి భారీ స్థాయిలో స్పందన దక్కింది. ఫలితంగా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ ఉత్సాహంతోనే నిర్వహకులు సీజన్లను పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే త్వరలోనే ఆరో దానిని మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సీజన్‌లో పాల్గొనే మరో కంటెస్టెంట్ వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. ఇంతకీ ఆ సెలెబ్రిటీ ఎవరో మీరే చూడండి!

అవన్నీ కంప్లీట్.. త్వరలో ఆరోది
తెలుగులో బిగ్ బాస్ షోకు ఊహించని రీతిలో భారీ స్పందన దక్కుతోంది. అందుకే ఇది మన దగ్గర ఏకంగా ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్‌ను పూర్తి చేసుకుంది. ఇవన్నీ ఒకదానికి మించి ఒకటి అన్నట్లుగా టీఆర్పీ రేటింగ్‌ను రాబట్టాయి. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు సెప్టెంబర్ 4వ తేదీ నుంచి ఆరో దానిని కూడా మొదలు పెట్టబోతున్నారు. దీన్ని కూడా నాగార్జున హోస్ట్ చేస్తున్నాడు.

ప్రోమోలు రిలీజ్... కొత్త కాన్సెప్టు
ఎన్నో అంచనాలతో ప్రారంభం కాబోతున్న ఆరో సీజన్ గురించి చాలా రకాల ప్రచారాలు జరుగుతూ వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే ఈ సీజన్‌కు సంబంధించిన లోగో ప్రోమోను వదిలారు. అలాగే, మూడు రోజుల క్రితమే సీజన్ మెయిన్ ప్రోమోను రిలీజ్ చేశారు. వీటికి భారీ స్పందన కూడా దక్కింది. ఇక, ఈ సీజన్‌లో కొత్త కాన్సెప్టును పరిచయం చేస్తారని తెలుస్తోంది.

ఆరో సీజన్ పనుల ప్రాసెస్ ఇలా
సెప్టెంబర్ 4వ తేదీ నుంచి మొదలు కానున్న బిగ్ బాస్ ఆరో సీజన్ పనులు మొత్తం పూర్తైనట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే షోను నడిపించే హౌస్ సెట్ వర్కును నిర్వహకులు విజయవంతంగా పూర్తి చేశారట. ఇది గతంలో కంటే ఎంతో కలర్‌ఫుల్‌గా కనిపించబోతుందని తెలిసింది. అలాగే, ఈ సీజన్ ప్రీ ప్రొడక్షన్ కూడా కంప్లీట్ అయ్యాయని సమాచారం.

కంటెస్టెంట్ల ఎంపిక.. 15 మంది
ఎంతో గ్రాండ్‌గా లాంచ్ కాబోతున్న బిగ్ బాస్ ఆరో సీజన్ కోసం నిర్వహకులు కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియను ఎప్పుడో ప్రారంభించారు. అంతేకాదు, కొద్ది రోజుల క్రితమే ఈ ప్రాసెస్‌ను పూర్తి చేసి షార్ట్ లిస్టును రెడీ చేశారు. ఇలా మొత్తంగా ఈ సీజన్ కోసం 15 మంది కంటెస్టెంట్లను ఎంపిక చేసుకున్నారని తెలిసింది. ఇందులో ఇద్దరు కామనర్స్ కూడా ఉన్నారని ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

సీక్రెట్‌గా ఉంచినా.. పేర్లు లీక్
బిగ్ బాస్ షో మొత్తంలోనే కంటెస్టెంట్ల ఎంపిక అనేది ఎంతో ముఖ్యమైనది. దీన్ని నిర్వహకులు చాలా సీక్రెట్‌గా ఉంచుతారు. అయినప్పటికీ పేర్లన్నీ లీక్ అవుతూనే ఉంటాయి. ఇక, ఆరో సీజన్ కోసం నిర్వహకులు మరింత జాగ్రత్తలు తీసుకున్నారు. అయినప్పటికీ ఇందులో పాల్గొనే వారి వివరాలు ఒక్కొక్కటిగా లీక్ అవుతున్నాయి. ఇలా ఇప్పటికే పలు పేర్లు కూడా తెరపైకి వచ్చాయి.

బిగ్ బాస్ షోలోకి ఆర్జీవీ బ్యూటీ
బిగ్ బాస్ ఆరో సీజన్‌లో కాంట్రవర్శీ, గ్లామరస్ బ్యూటీలను ఎక్కువగా తీసుకు రాబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఎంతో మంది అమ్మాయిల పేర్లు కూడా బయటకు వచ్చాయి. ఈ క్రమంలోనే మరో బ్యూటీ పేరు లీకైంది. తాజా సమాచారం ప్రకారం.. ఆరో సీజన్‌లో రాంగోపాల్ వర్మ వల్ల ఫేమస్ అయిన హీరోయిన్ ఇనయా సుల్తానా కంటెస్టెంట్‌గా రాబోతుందట.

అలా ఫేమస్.. ఆఫర్ పట్టేసింది
ఇనయా సుల్తానా తెలుగులో పలు చిత్రాలు చేసింది. అలాగే, ప్రస్తుతం 'బుల్లి ఇలారా' అనే సినిమాలో నటిస్తోంది. ఇదంతా పక్కన పెడితే.. ఆ మధ్య ఈ బ్యూటీ ఆర్జీవీతో కలిసి సిగరెట్ కాల్చుతూ రచ్చ చేసింది. దీంతో వర్మ కూడా ఆమెకు ముద్దులు పెట్టేసి.. తర్వాత ఇనయా కాళ్ల మీద కూడా పడ్డాడు. దీంతో ఆమె ఒక్కసారిగా ఫేమస్ అయింది. ఫలితంగా ఈ ఆఫర్ అందుకుందని ప్రచారం జరుగుతోంది.


Click it and Unblock the Notifications











