సినిమాలో అవకాశమిచ్చి.. ఎడిటింగ్‌లో లేపేశారు.. బిగ్‌బాస్ నటి షాకింగ్ కామెంట్స్

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6 ద్వారా తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్న కంటెస్టెంట్లలో ఇనయా సుల్తానా ఒకరు. షోలో ఆమె స్ట్రాంగ్ పర్సనాలిటీ, స్ట్రెయిట్ ఫార్వర్డ్ మాటలు, గ్లామర్ లుక్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. అయితే బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె జీవితం అంత సాఫీగా సాగలేదని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. బిగ్‌బాస్ తర్వాత అవకాశాలు వెల్లువలా వస్తాయని చాలామంది భావిస్తారు. కానీ ఇనయా విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందని ఆమె చెప్పుకొచ్చింది.

'బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక్క సినిమా అవకాశం కూడా రాలేదు. దాదాపు ఒక సంవత్సరం పాటు ఎదురు చూశాను. ఆ సమయంలో తీవ్రమైన నిరాశకు లోనయ్యాను. ఒక దశలో డిప్రెషన్‌లోకి కూడా వెళ్లిపోయాను'అంటూ ఆమె భావోద్వేగంగా మాట్లాడింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ గ్లామర్ ఫోటోషూట్లు చేస్తూ కనిపించినా, వెనకాతల మాత్రం తీవ్రమైన మానసిక పోరాటం చేశానని ఆమె చెప్పింది.

Inaya Sultana Reveals Shocking Struggles After Bigg Boss Telugu 6

ఇనయా మాట్లాడుతూ... 'డిప్రెషన్ నుంచి బయటపడేందుకు నన్ను నేనే మోటివేట్ చేసుకున్నాను. మళ్లీ కొత్త ప్రొఫైల్ ఫొటోలతో సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగాను. డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లను కలిసిన ప్రతీసారి 'నన్ను బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా కాదు, ఒక కొత్త నటిగా చూడండి' అని రిక్వెస్ట్ చేసేదాన్ని. ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేస్తానని కాన్ఫిడెంట్‌గా చెప్పేదాన్ని'అని వివరించింది. అయితే ఆమె చేసిన ప్రయత్నాలకు పూర్తిగా ఫలితం రాలేదని చెప్పడం గమనార్హం.

'బిగ్‌బాస్ తర్వాత దాదాపు పది నుంచి పన్నెండు సినిమాల్లో నటించాను. కానీ షూటింగ్ పూర్తయ్యాక ఎడిటింగ్ దశలో నా పాత్రలను పూర్తిగా తీసేస్తున్నారు. కొన్ని సినిమాల్లో నా పాత్ర ఉన్నా లేకపోయినా తేడా తెలియని విధంగా చూపిస్తున్నారు. ఇది చాలా బాధగా అనిపిస్తుంది. కష్టపడి నటించినా, చివరికి తెరపై కనిపించకపోవడం చాలా ఫ్రస్ట్రేషన్‌కు గురిచేస్తుంది' అంటూ ఆమె తన వేదనను బయటపెట్టింది.

ఇక తనకు మొదటినుంచే నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేయాలనే కోరిక ఉందని ఇనయా చెప్పింది. 'గ్లామర్ పాత్రలతో పాటు, నటనకు స్కోప్ ఉన్న నెగటివ్ రోల్స్ చేయాలని ఎప్పటినుంచో ఉంది. అలాంటి క్యారెక్టరైజేషన్ ఉన్న ఓ సినిమా త్వరలో రాబోతోంది. అందులో నా పాత్ర చాలా ఓల్డ్‌గా, డిఫరెంట్ షేడ్స్‌తో ఉంటుంది' అని తెలిపింది.

తాజాగా ఆమె నటించిన 'మదం' సినిమా గురించి మాట్లాడుతూ ఇనయా మరిన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 'మదం సినిమాలో నేను చేసే పాత్ర చాలా కీలకం. స్టోరీ మొత్తం నా క్యారెక్టర్ చుట్టూనే తిరుగుతుంది. ఈ క్యారెక్టర్ వల్లే సినిమాలో జరిగే సంఘటనలన్నీ స్టార్ట్ అవుతాయి. నాకు ఇప్పటివరకు ఇలాంటి పాత్ర రాలేదు'అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.

ఈ సినిమాలో ఇంటిమేట్ సీన్స్ ఉన్నాయనే విషయాన్ని కూడా ఆమె ఓపెన్‌గా చెప్పింది. 'యాంకర్ అడిగినప్పుడు ఓపెన్ చెప్పింది. ఈ సినిమాలో మంగళవారం సినిమా తరహాలో ఇంటిమేట్ సీన్స్ ఉంటాయి. ముగ్గురు వ్యక్తులతో కలిసి నటించాల్సిన సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఈ పాత్రను అంగీకరించే ముందు చాలా ఆలోచించాను. కానీ ఇంత స్కోప్ ఉన్న క్యారెక్టర్‌ను వదులుకోవడం కరెక్ట్ కాదనిపించింది. అందుకే ధైర్యంగా ముందడుగు వేసాను" అని తెలిపింది.

ఇనయా మరో విషయం స్పష్టంగా చెప్పింది. 'నేను చేసిన ఇంటిమేట్ సీన్స్ అన్నీ స్టోరీకి అవసరమైనవే. కేవలం సెన్సేషన్ కోసం చేయలేదు. నా నటన, పర్ఫార్మెన్స్‌ను జడ్జ్ చేయాలంటే సినిమా రిలీజ్ తర్వాతే చూడాలి' అంటూ క్లారిటీ ఇచ్చింది. ట్రైలర్‌లో తన పాత్రను కాస్త ఓవర్‌గా చూపించారని, కానీ సినిమాలో మాత్రం నటనకు ప్రాధాన్యం ఉంటుందని ఆమె తెలిపింది. 'మదం' సినిమా కథ గురించి మాట్లాడుతూ... 'ఒక ఆడదాని వల్ల రాజ్యాలు కూలిపోయిన కథలు మనం విన్నాం. అలాగే ఒక ఆడదాని మదం వల్ల ఒక కుటుంబం ఎలా నాశనం అయిందనే కథే ఈ సినిమా'అంటూ స్టోరీ లైన్‌ను షేర్ చేసింది.

ఇనయా తన కెరీర్‌లో ఇప్పటివరకు చేసిన సినిమాల గురించి కూడా ప్రస్తావించింది. సన్నీ డియోల్‌తో 'చాట్', అల్లరి నరేష్‌తో 'బచ్చలమల్లి', మంచు మనోజ్‌తో 'భైరవం', అలాగే తాజాగా '3 డేస్' సినిమాలో నటించినట్లు వెల్లడించింది. ఈ సినిమాలన్నీ తనకు నటిగా అనుభవం ఇచ్చాయని, కానీ ఇంకా తాను ఆశించిన బ్రేక్ రావాల్సి ఉందని చెప్పింది. మొత్తానికి.. ఇనయా సుల్తానా చేసిన ఈ వ్యాఖ్యలు బిగ్‌బాస్ తర్వాత సెలబ్రిటీలకు ఎదురయ్యే వాస్తవ పరిస్థితులను మరోసారి బయటపెట్టాయి. 'మదం' సినిమా ఇనయాకు నిజమైన టర్నింగ్ పాయింట్ అవుతుందా? అనేది వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X