Bigg Boss Telugu 8: బిగ్‌బాస్ లోకి యంగ్ పొలిటీషియన్.. జనసేన నేతకు బంపర్ ఆఫర్!

ఐపీఎల్, ఎన్నికల సీజన్, టీ20 ప్రపంచకప్‌లు ముగియడంతో ప్రజలు వినోదం కోసం తహతహలాడిపోతున్నారు. టీవీ ఛానెల్స్, యూట్యూబ్, ఓటీటీలలో రకరకాల షోలు ఉన్నప్పటికీ ఇంకా కావాల్సినంత స్పేస్ ఉంది. ఇందుకోసం క్రియేటివ్ హెడ్‌లు తమ బుర్రలకు పనిచెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రేక్షకులను అలరించేందుకు బిగ్‌బాస్‌ రెడీ అవుతున్నారు. ఎన్ని రియాలిటీ షోలు ఉన్నా వాటన్నింటినీ అధిగమించి క్రేజ్ తెచ్చుకున్న గ్రాండ్ రియాలిటీ షో బిగ్‌బాస్. పశ్చిమ దేశాలలో స్టార్ట్ అయినా ఇండియాలోనూ ఈ షోకు జనం బ్రహ్మారథం పడుతున్నారు.

హిందీలో 12 సీజన్లు పూర్తవ్వగా.. ప్రతి ఏడాది షోపై విపరీతంగా హైప్ ఉంటోంది. హిందీ మార్కెట్‌లో సక్సెస్ కావడంతో భారతదేశంలోని ప్రాంతీయ భాషల్లోనూ బిగ్‌బాస్‌ను దించారు. తెలుగు , తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, మరాఠీ భాషల్లో బిగ్‌బాస్ దుమ్మురేపుతోంది. కానీ మన తెలుగులో వచ్చిన రెస్పాన్స్ మాత్రం ఏ భాషలోనూ లేదు. ఇండియాలోనే హయ్యెస్ట్ రేటింగ్స్‌ తెలుగు బిగ్‌బాస్‌కు దక్కాయి. ఇప్పటికీ 7 సీజన్లను కంప్లీట్ చేసుకున్న తెలుగు బిగ్‌బాస్.. 8వ సీజన్‌కు సిద్ధమవుతోంది.

indian cricketer janasena leader ambati rayudu into bigg boss telugu season 8

ఇందుకోసం నిర్వాహకులు ఇప్పటికే బిగ్‌బాస్ సెట్ పనులు పూర్తి చేసినట్లుగా ఫిలింనగర్‌ టాక్. జూలై చివరికి వచ్చేస్తూ ఉండటంతో .. ఈసారి ఎవరెవరు కంటెస్టెంట్స్‌గా పార్టిసిపేట్ చేయబోతున్నారు, వారి రెమ్యూనరేషన్ ఎంత, ప్రేమ పక్షులు ఉంటారా..? ఇలాంటి అంశాలపై ప్రజల్లో విపరీతంగా డిస్కషన్ నడుస్తోంది. నిజానికి షో క్లిక్ అవ్వాలంటే బలమైన కంటెస్టెంట్స్ చాలా ముఖ్యం. అన్ని రకాల ఎమోషన్స్ ఉంటేనే ప్రేక్షకులు చూడటానికి ఇష్టపడతారు. బిగ్‌బాస్ తెలుగు 7లో కంటెస్టెంట్స్ ఎవరన్నది చివరి వరకు బయటపెట్టకుండా చాలా గోప్యంగా ఉంచారు నిర్వాహకులు. సెలబ్రిటీలు, సామాన్యులు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లతో నిండిపోయిన ఓ సీజన్ జనానికి మంచి కిక్ ఇచ్చింది.

సీజన్ 8కి సంబంధించి కంటెస్టెంట్స్ ఎవరనేది ఎక్కడా బయటపడకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకుంటున్నా కొందరు యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు అత్యుత్సాహంతో ఎవరెవరు పాల్గొంటున్నారో బయటపెట్టేస్తున్నారు. అలా కొందరి పేర్లు లీకై సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఊహించని పేరు ఒకటి తెరపైకి వచ్చింది. ఆయన ఎవరో కాదు .. టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు. ఇంటర్నేషనల్ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన తర్వాత రాజకీయాల్లోకి చేరిన ఆయన వైసీపీలో చేరారు. అక్కడ పట్టుమని పది రోజులు కూడా ఉండకుండానే ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి.. పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. ఎన్నికల్లో ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా విస్తృతంగా ప్రచారం చేసిన రాయుడు.. కూటమి అభ్యర్ధుల విజయానికి తన వంతు కృషి చేశారు.

indian cricketer janasena leader ambati rayudu into bigg boss telugu season 8

అయితే అంబటి రాయుడులో దూకుడు స్వభావం ఎక్కువ. పలుమార్లు క్రికెటర్లు, అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. సెలక్షన్ ప్రాసెస్ బాలేదంటూ టీమ్ మేనేజ్‌మెంట్‌పైనా ఆగ్రహం వ్యక్తం చేశాడు. బిగ్‌బాస్‌కు కావాల్సింది ఇలాంటి కాంట్రవర్సీ క్యారెక్టరే కాబట్టి రాయుడును ఎలాగైనా షోలో పార్టిసిపేట్ చేయించేందుకు నిర్వాహకులు తీవ్రంగా శ్రమిస్తున్నారట. ఇందుకోసం భారీ రెమ్యూనరేషన్‌ను సైతం ఆఫర్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. మరి నిజంగా అంబటి రాయుడు పేరు కంటెస్టెంట్స్ లిస్టులో ఉందా.. లేక ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఓ గాలివార్తల్లో ఒకటా అనేది మరికొద్దిరోజుల్లోనే తేలిపోనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X