అభిజీత్‌కు రోహిత్ శర్మ కానుక: ఏకంగా ఆస్ట్రేలియా నుంచి సర్‌ప్రైజ్ గిఫ్ట్ పంపిన టీమిండియా క్రికెటర్!

గతంలో కొన్ని సినిమాల్లో నటించినా అంతగా గుర్తింపును దక్కించుకోలేకపోయాడు యంగ్ హీరో అభిజీత్. అయితే, బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా వెళ్లిన తర్వాత మాత్రం అతడు ఫుల్ ఫేమస్ అయిపోయాడు. షోలోకి అడుగు పెట్టినప్పటి నుంచే తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగిపోతూ.. ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతూ.. సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాడు. ఈ క్రమంలోనే ఈ సీజన్ విన్నర్ కూడా అయ్యాడు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫుల్ బిజీ అయిన అభిజీత్‌కు టీమిండియా క్రికెటర్ సర్‌ప్రైజ్ గిఫ్టును పంపాడు. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

ఎంట్రీ ఇచ్చినా.. అలానే ఫేమస్ అయ్యాడు

ఎంట్రీ ఇచ్చినా.. అలానే ఫేమస్ అయ్యాడు

బిగ్ బాస్ హౌస్‌లోకి సాదాసీదాగా ఎంట్రీ ఇచ్చాడు అభిజీత్. షో ఆరంభంలో అతడు హీరోయిన్ మోనాల్ గజ్జర్‌తో బాగా క్లోజ్ అయ్యాడు. దీంతో వీళ్లిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని అంతా అనుకున్నారు. ఆ తర్వాత ఆమె అతడికి దూరమైపోయింది. అప్పటి నుంచే దేత్తడి హారికకు దగ్గరయ్యాడు అభిజీత్. ఈ ట్రాకుల వల్ల అతడికి లవర్ బాయ్ అన్న పేరొచ్చి ఫేమస్ అయ్యాడు.

టాస్కులు గెలవకున్నా.. ప్రేక్షకులను గెలిచి

టాస్కులు గెలవకున్నా.. ప్రేక్షకులను గెలిచి

సీజన్ ఆరంభం నుంచే ప్రతి దానిని పట్టి పట్టి చూస్తూ.. కండబలంతో కాకుండా బుద్దిబలంతో గెలవాలని చూసేవాడు అభిజీత్. అందుకు అనుగుణంగానే కొన్ని టాస్కుల్లో మైండ్ గేమ్ ఆడి తన జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో హౌస్‌లో బలమైన కంటెస్టెంట్‌గా మారిపోయాడు. ఈ కారణంగానే మిగిలిన హౌస్‌మేట్స్ అంతా అతడిని టార్గెట్ చేయడం మొదలు పెట్టారు.

తుది పోరుకు చేరాడు.. విజేతగా నిలిచాడు

తుది పోరుకు చేరాడు.. విజేతగా నిలిచాడు

బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో టైటిల్ ఫేవరెట్లు దిగిన వారు మధ్యలోనే షో నుంచి బయటకు వెళ్లిపోయారు. అలాంటి సమయంలోనే అభిజీత్ స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా మారాడు. దీంతో ఈ సారి అతడే విజయం సాధిస్తాడని అంతా అనుకున్నారు. దీనికి తోడు ప్రేక్షకులు కూడా అతడికి విపరీతంగా సపోర్ట్ చేశారు. ఈ కారణంగానే అభిజీత్ బిగ్ బాస్ నాలుగో సీజన్ విన్నర్‌గా నిలిచాడు.

ఫుల్ బిజీగా అభిజీత్.. సినిమా అవకాశాలు

ఫుల్ బిజీగా అభిజీత్.. సినిమా అవకాశాలు

బిగ్ బాస్ విన్నర్‌ అయిన తర్వాత అభిజీత్ ఫుల్ బిజీ అయ్యాడు.చాలా రోజుల పాటు తన విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పడంతో పాటు వరుస ఇంటర్వ్యూలతో బిజీ బిజీగా గడిపాడు. అదే సమయంలో అతడికి ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే వెంకీ కుడుములతో మూవీ, F3లో ఛాన్స్ వచ్చిందని జోరుగా ప్రచారం జరిగింది.

అభిజీత్‌కు ఇండియా క్రికెటర్ స్పెషల్ గిఫ్ట్

అభిజీత్‌కు ఇండియా క్రికెటర్ స్పెషల్ గిఫ్ట్

టీమిండియా క్రికెటర్ హనుమ విహారి.. ఆటోగ్రాఫ్‌తో కూడిన రోహిత్ శర్మ జెర్సీని అభిజీత్‌కు పంపించాడు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ బిగ్ బాస్ విన్నర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో 'ఆస్ట్రేలియా నుంచి రోహిత్ శర్మ హలో చెబుతున్నాడు. వండర్‌ఫుల్ గిప్ట్ ఇచ్చినందుకు థ్యాంక్యూ విహారి. నువ్వు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. లాస్ట్ టెస్టులో నీ ఆట అద్భుతం' అంటూ పేర్కొన్నాడు.

అతడి కోసం అన్నీ వదిలేసే వాడిని అంటూ

అతడి కోసం అన్నీ వదిలేసే వాడిని అంటూ

ఇక, ఇదే పోస్టులో రోహిత్ గురించి చెబుతూ.. 'ఏమని చెప్పను. రోహిత్ ఆట చూసేందుకు ఏ పని ఉన్నా పక్కన పెట్టేసేవాడిని. నీది బ్యాటింగ్ మాత్రమే కాదు.. అదో అద్భుతమైన టాలెంట్. థ్యాంక్యూ రోహిత్.. ఇది నాకు ఫ్యాన్ బాయ్ మూమెంట్. నిజానికి చిన్నప్పుడు నాకు క్రికెటర్ అవ్వాలని బాగా ఉండేది. కానీ, అది వేరే వాటి వల్ల కుదరలేదు' అంటూ అందులో చెప్పుకొచ్చాడు అభి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X