బిగ్ బాస్ మాస్టర్ ప్లాన్... హౌజ్‌లోకి స్టార్ క్రికెటర్... ఈసారి డబుల్ ట్రీట్ పక్కా!
తెలుగులో అత్యధిక ప్రేక్షకాదరణ పొందిన రియాలిటీ షోలలో బిగ్ బాస్ ఒకటి. ఇక తెలుగులో సీజన్ 7 త్వరలో ప్రారంభం అవ్వనుంది. ఈ నేపథ్యంలో ఈ షోకు సంబంధించి రోజుకో వార్త ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతన్న సంగతి తెలిసిదే. తాజాగా ఈ ఏడో సీజన్ లో స్టార్ క్రికెటర్ పాల్గొననున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో ఈ సారి ట్రీట్ డబుల్ పక్కా అంటున్నారు. ఇక ఆ వివరాళ్లోకి వెళితే..
మొదటి సీజన్ హిట్టుతో: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వచ్చిన మొదటి సీజన్ బిగ్‌బాస్ సూపర్ హిట్టుగా నిలిచింది. ఆ తర్వాత ఆ తర్వాత నాని రాగా అది కూడా సూపర్ హిట్టుగా నిలిచింది. ఇక రెండు సీజన్స్ సూపర్ హిట్ అవ్వడం వల్ల.. నిర్వాహకులు క్రమం తప్పకుండా ప్రతి ఏడాది ఓ సీజన్ ఉండేలా ప్లాన్ చేస్తూ షోను ముందుకు నడిపిస్తున్నారు. ఇప్పటికే 6 రెగ్యులర్, ఒక ఓటీటీ వెర్షన్ సీజన్లను పూర్తి చేసుకుంది. బిగ్ బాస్ మంచి సక్సెస్‌ను అందుకుంది.

ఆరో సీజన్ పై విమర్శలు: గత సీజన్లతో పోల్చితే.. ఆరో సీజన్ పై విమర్శలు వచ్చాయి. రేటింగ్ విషయంలో కూడా చాలా తగ్గింది. నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన ఈ షో.. పలు విమర్శులు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ సారి పకడ్భందిగా ప్లాన్ చేస్తున్నారు. ఈసారి వచ్చే తెలుగు సీజన్ ను ఎలాగైనా విజయంవంతం చేయాలని మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు. ఈ సారి తెలుగు బిగ్ బాస్ షోలో సెలబ్రెటీలను తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఓ క్రికెటర్ కూడా ఈ షోలో అడుగుపెట్టబోతున్నారని టాక్.

బిగ్ బాస్ లోకి క్రికెటర్: బిగ్ బాస్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఓ స్టార్ క్రికెటర్ హౌజ్ లోకి రానున్నారట. ఆ క్రికెటర్ ఎవరో కాదు.. వేణు గోపాల్ రావు. ఆయన బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన తొలి క్రికెటర్ గా రికార్డ్ క్రియేట్ చేయనున్నాడు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన గోపాలరావును ఈ మెగా షోలకి తీసుకురావాలని స్టార్ మా గట్టిగా ప్రయత్నాలు చేస్తుందట . అందుకే ఆయన అడిగినంత డబ్బులు ఇవ్వడానికి సిద్ధపడింది. అంతేకాదు కచ్చితంగా టాప్ ఫైవ్ లో ఉంచే విధంగా కూడా బిగ్ బాస్ ఆయన కు మాట ఇచ్చిందని సమాచారం.

బిగ్ బాస్ రికార్డు: ఇక ఇప్పటివరకు బిగ్ బాస్ షోలో ఏ సీజన్ లో కూడా క్రికటర్ ఎంట్రీ ఇవ్వలేదు. ఒకవేళ ఇదే నిజమైతే తెలుగు బిగ్ బాస్ సంచలనాన్ని క్రియేట్ చేయనుంది. కాగా భారత మాజీ క్రికెటర్ ఆంధ్ర ఆటగాడు వేణుగోపాలరావు 2019లో ఆటకు గుడ్ బై చెప్పాడు . 2005 జూలైలో తొలి వన్డే ఆడిన అతని కెరియర్ల 10 నెలల వ్యవధిలోనే 16 వన్డేలకు పరిమితమై క్లోజ్ అయింది. ఇప్పడు ఈయన బిగ్ బాస్ లోకి అడుగుపెడితే.. బిగ్ బాస్ మాస్టర్ స్కెచ్ అని చెప్పవచ్చు.

సెప్టెంబరులోనే షో: ఇక ఈసారి బిగ్ బాస్ షోకి హోస్ట్ గా బాలయ్య, రానా పేర్లు వినిపించాయి. ఫైనల్ గా నాగార్జునే చేయనున్నట్లు సమాచారం అందుతోంది. ఇటీవల బిగ్ బాస్ లోగో విడుదల కాగా.. దానిపై విమర్శలు వచ్చాయి. ఏదిఏమైనా.. ఆడియెన్స్‌లో ఇంట్రెస్ట్ పెంచేందుకు షోనిర్వాహకులు.. చాలా జాగ్రత్తగా ప్లాన్చేస్తున్నారని తెలుస్తోంది. చాలా గ్రాండ్ గా నిర్వహించనున్నారట. సెప్టెంబర్ 3 ఆదివారం నుంచి ఈ షో ప్రారంభం కానున్నట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











