Television ఇండియాలో చరిత్ర సృష్టించిన టీవీ సీరియల్ ఏమిటో తెలుసా? గేమ్ ఆఫ్ థ్రోన్ వెనక్కి నెట్టి..!
భారతీయ సీరియల్స్ కి సినిమాల కంటే ఎక్కువగా ప్రేక్షకులు ఉంటారు అనటంలో ఎలాంటి సందేహం లేదు. 2000 సంవత్సరానికి ముందు భారత్ లో సీరియల్స్ కి ఎంతో క్రేజ్ ఉండేది. నేటి ఆధునిక కాలంలో కూడా వీటికి ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. అంతేకాదు.. సినిమాలను తలదన్నే రీతిలో సీరియల్స్ ఉంటున్నాయి. ఇండియాలో సుదీర్ఘకాలం సాగిన సీరియల్ ఏది? ఆ సీరియల్స్ జాబితా ఏమిటనే విషయాల్లోకి వెళితే..
ఇండియన్ టెలివిజన్ చరిత్రలో రికార్డు సృష్టించిన మెగా టీవీ సీరియల్ రామాయణం. 23 ఏళ్ల క్రితం టీవీ సీరియల్‌కు చాలా మంది ప్రేక్షకులు ఉండేవారు. ప్రస్తుత కాలంలో ఉన్నన్ని ఛానళ్లు అప్పట్లో ఉండేవి కావు. అందుకే ఉన్న 1,2 ఛానళ్లలో వచ్చే ప్రతి సీరియల్‌ను ప్రేక్షకులు ఆదరించేవారు అని సినీ వర్గాలు వెల్లడిస్తున్నారు.

అందుకే అప్పట్లో ప్రసారమయ్యే ప్రతి సీరియల్ 5 పాయింట్స్ రేటింగ్ సంపాదించేది. ప్రస్తుత కాలంలో ఎంత మంచి సీరియల్ అయినా అంతటి రేటింగ్ ని అందుకోలేకపోతున్నాయి. అప్పట్లో సీరియల్స్ కి పలు దేశాల్లో 20 నుంచి 30 మిలియన్ల వ్యూస్ వస్తే.. మన దేశంలోని షో లకు మాత్రం అత్యధిక రేటింగ్, వ్యూస్‌తో టాప్‌లో ఉండేవి. ఎంతలా అంటే 'గేమ్ ఆఫ్ థ్రోన్' అనే షో ని కూడా వెనక్కి నెట్టేలా మన సీరియల్స్, షోలు ఉండేవి అని బుల్లితెర ప్రేక్షకుల చెబుతున్నారు.
అయితే మన దేశంలో అత్యధిక మంది ప్రేక్షకులు వీక్షించిన సీరియల్ గా రామాయణం నిలిచింది.1988లో వచ్చిన ఈ సీరియల్ కి లక్ష్మణుడు, మేఘనాధుడు మధ్య జరిగిన యుద్ధ సన్నివేశాలను అత్యధికంగా 77 మిలియన్ల మంది ప్రేక్షకులు వీక్షించారు. ఇప్పటివరకు వచ్చిన సీరియల్స్ అన్నింటి కంటే ఇదే అత్యధిక వ్యూయర్ షిప్ సాధించింది. అలాగే 1988లో రామాయణానికి సీక్వెల్ గా వచ్చిన 'లవకుశ' సీరియల్ 67 మిలియన్ వ్యూస్ తో రెండో స్థానంలో నిలిచింది.

కొన్ని నివేదికల ప్రకారం రామాయణం సీరియల్ ని భారత్ లో 99% ఇళ్లలో చూసేవారట. అంతలా ఇది ప్రేక్షకులకు దగ్గరైంది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ ధారావాహిక ను ఇప్పటి వరకు అధిగమించే సీరియల్ రాలేదు. అందుకు కారణం టీవీ ఛానెల్స్ ఎక్కువ కావడం, వందల సంఖ్యలో సీరియల్స్ రావడమేనని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











