twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘ఇండియన్ ఐడల్ 10’ విజేతగా నిలిచిన పేద సింగర్, ఆ డబ్బుతో.....

    |

    ప్రఖ్యాత సింగింగ్ రియాల్టీ షో 'ఇండియన్ ఐడల్ 10' టైటిల్ ఒక పేద సింగర్‌కు దక్కింది. హర్యానా రాష్ట్రంలోని మేవత్ ప్రాంతానికి చెందిన సల్మాన్ అలీ ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలెలో విజేతగా నిలిచాడు. దీంతో అతడు ట్రోఫీతో పాటు రూ. 25 లక్షల నగదు బహుమతి, ఒక డట్సన్ కారు గెలుచుకున్నాడు.

    ఈ షో ద్వారా తన అద్భుతమైన సింగింగ్ పెర్ఫార్మెన్స్‌తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న సల్మాన్ అలీ 'ఇండియన్ ఐడల్ 10' టైటిల్ దక్కించుకోవడంతో సెలబ్రిటీ స్టేటస్ సొంతం చేసుకున్నాడు.

    సల్మాన్ అలీ గ్రామంలో సంబరాలు

    సల్మాన్ అలీ గ్రామంలో సంబరాలు

    టైటిల్ గెలిచిన అనంతరం సల్మాన్ అలీ మాట్లాడుతూ... నన్ను విజేతగా ఎంపిక చేసిన ప్రేక్షకులకు, జడ్జిలకు థాంక్స్. మా గ్రామానికి చెందిన వారంతా చాలా సంతోషంగా ఉన్నారు. వారి నుంచి ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. టపాసులు పేల్చి స్వీట్లు పంచుకున్నారని వెల్లడించారు.

    రన్నరప్స్

    రన్నరప్స్

    కాగా... ఇండియన్ ఐడల్ 10 ఫస్ట్ రన్నరప్‌గా నిలిచిన అంకుష్ భరద్వాజ్, సెకండ్ రన్నరప్ నీలాంజనా రే రూ. 5 లక్షల చెక్ అందుకున్నారు. ఇతర ఫైనలిస్టులు నితిన్ కుమార్, విభోర్ పరాశర్ చెరొక రూ. 3 లక్షల నగదు బహుబతి సొంతం చేసుకున్నారు.

    ఒక వేళ ఓడిపోయినా...

    ఒక వేళ ఓడిపోయినా...

    ‘రియాల్టీ షోలో పాల్గొన్నంత కాలం మేమంతా ఒక ఫ్యామిలీలా ఉన్నాం. జోక్స్ వేసుకున్నాం, ఒకరికొకరం సహాయం చేసుకున్నాం, చాలా ఎంజాయ్ చేశాం. మా మధ్య పోటీ లేదు. అయితే ఇక్కడికి ప్రతి ఒక్కరూ విజేతగా నిలవాలనే వస్తారు. నేను విజయం సాధించలేక పోయినా కనీసం ప్రేక్షకుల ప్రేమ, అభిమానాలు సంపాదించుకోవాలనుకున్నాను' అని సల్మాన్ అలీ వెల్లడించారు.

    ఇల్లు బాగుచేయాలి, అప్పులు ఉన్నాయి

    ఇల్లు బాగుచేయాలి, అప్పులు ఉన్నాయి

    ఈ షో ద్వారా గెలుచుకున్న డబ్బును ఎలా ఉపయోగించబోతున్నారనే ప్రశ్నకు 20 ఏళ్ల సల్మాన్ స్పందిస్తూ... నేను చాలా పేద కుటుంబం నుంచి వచ్చాను. మా ఇల్లు కూడా సరైన స్థితిలో లేదు. ముందు మా ఇంటి పైకప్పును బాగు చేయించాలి. మాకు కొన్ని అప్పులు కూడా ఉన్నాయి. ఈ డబ్బును వాటి కోసం ఉపయోగిస్తాను. మిగిలిన డబ్బుతో జీవితంలో మరింత ఎదిగే ప్రయత్నం చేస్తాను. అవకాశం ఉంటే తనలాంటి పేద వారికి సహాయం చేస్తానని తెలిపారు.

    7 ఏళ్ల వయసు నుంచే

    7 ఏళ్ల వయసు నుంచే

    అయితే కంటెస్టెంటుగా సల్మాన్ అలీకి ఇదే తొలి షో కాదు. గతంలోనూ పలు రియాల్టీ షోలలో పాల్గొనప్నారు. చిన్నతనంలోనే అతడి సంగీత ప్రయాణం మొదలైంది. ‘నేను 10వ తరగతి మాత్రమే చదువుకున్నాను. మా కుటుంబం పాటలు పాడుతూ జీవనం సాగిస్తుంది. నాకు ఏడేళ్ల వయసులోనే నేను సంపాదించడం మొదలు పెట్టాను' అని సల్మాన్ అలీ తెలిపారు.

    లక్ష్యం బాలీవుడ్

    లక్ష్యం బాలీవుడ్

    బాలీవుడ్ సినిమాల్లో పాటులు పాడాలనేది నా డ్రీమ్. ఈ షోకు చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు వచ్చారు. ఎవరైనా నాకు అవకాశం ఇస్తారని భావిస్తున్నాను. నేను జీవితంలో సాధించాల్సింది ఇంకా చాలా ఉంది అని సల్మాన్ అలీ తెలిపారు.

    English summary
    Indian Idol 10 winner is Salman Ali, who comes from Mewat, Haryana won the trophy, Rs 25 lakh cash prize and a Datsun car. “I would like to thank the audience and the judges for making me the winner. People from my village are very happy. I am getting lots of calls. They are distributing sweets there and bursting crackers,” Salman said after his victory in the singing reality show.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X