For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Indian Idol 12 Shanmukhapriya: షణ్ముఖప్రియుకు ఊహించని ఆఫర్లు.. ఓడిపోయినా ఆ రికార్డు సొంతం

  |

  బుల్లితెరపై ఎన్నో రకాల షోలు వచ్చినా.. పాటల పోటీలతో సాగే కార్యక్రమాలకు ప్రత్యేకమైన గుర్తింపు, ఆదరణ దక్కుతూ ఉంటుంది. అందుకే ప్రతి భాషలోనూ ఇలాంటి ప్రోగ్రామ్‌‌లు సూపర్ సక్సెస్ అవుతుంటాయి. ఇక, దేశం మొత్తం మెచ్చే సింగింగ్ కాంపిటీషన్‌లలో 'ఇండియన్ ఐడల్' మొదటి స్థానంలో ఉంటుంది. దీనికి ఇండియాలోనే కాదు.. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. అందుకే సీజన్ల మీద సీజన్లను జరుపుకుంటూ ఇప్పటికే పదకొండు పూర్తి చేసుకుంది. ఇక, ఇప్పుడు పన్నెండో సీజన్ కూడా ముగిసింది. ఆరుగురు అభ్యర్ధులతో ఫినాలే ఎపిసోడ్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం జరిగింది. ఇక, ఈ షో ద్వారా షణ్ముఖప్రియ అప్పుడే అదిరిపోయే ఆఫర్లను అందుకున్నట్లు ఓ న్యూస్ విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ వివరాలు మీకోసం!

  అంగరంగ వైభవంగా జరిగిన ఫినాలే ఎపిసోడ్

  అంగరంగ వైభవంగా జరిగిన ఫినాలే ఎపిసోడ్

  దాదాపు తొమ్మిది నెలల పాటు సాగిన ఇండియన్ ఐడల్ 12వ సీజన్‌లో గ్రాండ్ ఫినాలే స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం జరిగింది. మధ్యాహ్నం 12 గంటలకు మొదలైన ఈ ఎపిసోడ్.. అర్ధారాత్రి 12 గంటలకు ముగిసింది. ఎంతో గ్రాండ్‌గా సాగిన ఈ కార్యక్రమానికి ఆదిత్య నారాయణ్‌ హోస్ట్‌గా వ్యవహరించగా.. హిమేశ్‌ రేష్మియా, అను మాలిక్‌, సోను కక్కర్‌ జడ్డిలుగా ఉన్నారు. ఇక, గ్రాండ్ ఫైనల్ ఎపిసోడ్‌కి బాలీవుడ్ ప్రముఖులు సిద్ధార్థ్‌ మల్హోత్రా, కియారా అడ్వాణీ, ఉదిత్‌ నారాయణ్‌, అల్కా యజ్ఞిక్‌ అతిథులుగా విచ్చేశారు. దీంతో ఇది అంగరంగ వైభవంగా జరిగింది.

  Bheemla Nayak First Glimpse: పవన్ కల్యాణ్ ఊరమాస్ అవతారం.. భీమ్లా నాయక్ టీజర్‌ హైలైట్స్ ఇవే

  తొలిసారి ఆరుగురు.. అదిరిపోయే ప్రదర్శనతో

  తొలిసారి ఆరుగురు.. అదిరిపోయే ప్రదర్శనతో

  ఆరంభం నుంచే ఎంతో ఆసక్తికరంగా సాగిన ఇండియన్ ఐడల్ 12వ సీజన్‌లో కంటెస్టెంట్లు అందరూ పోటీపోటీగా ప్రదర్శనలు ఇచ్చారు. అయితే, ఉత్తరఖండ్‌కు చెందిన పవన్‌దీప్ రాజన్, తెలుగమ్మాయి షణ్ముఖ ప్రియ, కోల్‌కత్తాకు చెందిన అరుణిత, మంగళూరుకు చెందిన నిహల్, మహారాష్ట్రకు చెందిన సెల్లీ కంబ్లే, ఢిల్లీకి చెందిన మహ్మద్ దనీష్ మాత్రమే ఈ సీజన్‌లో ఫినాలేకు చేరుకున్నారు. వాస్తవానికి ప్రతి ఏడాది ఐదుగురు కంటెస్టెంట్లను మాత్రమే తుదిపోరులో ఉంచేవారు. కానీ, ఈ సారి ఆరుగురిని తీసుకొచ్చారు. వీళ్లంతా అదిరిపోయే ప్రదర్శనలు ఇచ్చారు.

  అనుకున్నట్లుగానే విజేతగా నిలిచిన పవన్

  అనుకున్నట్లుగానే విజేతగా నిలిచిన పవన్

  ఇండియన్ ఐడల్ 12వ సీజన్‌లో ఆరంభం నుంచీ టైటిల్ ఫేవరెట్‌గా ఉన్న వారిలో పవన్‌దీప్ రాజన్ ఒకడు. తుదిపోరులోనూ తనదైన శైలి గాత్రంతో ఆకట్టుకుని ఇండియన్ ఐడల్ 12వ సీజన్‌లో విజేతగా నిలిచాడు. అతడికి రూ. 25 లక్షలు ఫ్రైజ్‌మనీతో పాటు ట్రోఫీని అందజేశారు. అలాగే, ఓ కారును కూడా బహుమతిగా అందించారు. ఇందులో అరుణిత ఫస్ట్ రన్నరప్‌గా, సయాలీ సెకండ్ రన్నరప్‌గా నిలిచారు. అలాగే, దనీష్ నాలుగో స్థానంలో, నిహల్ ఐదో స్థానంతో సరిపెట్టుకున్నారు. వీరిలో మొదటి, రెండో రన్నరప్‌లకు చెరో ఐదు లక్షల రూపాయల ఫ్రైజ్ మనీ దక్కింది. అలాగే, నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచిన కంటెస్టెంట్లకు చెరో మూడు లక్షల రూపాయలను అందించారు నిర్వహకులు.

  ప్రియుడి కోసం హద్దు దాటిన నయనతార: ఆ పని చేసి అడ్డంగా దొరకడంతో దారుణంగా!

  తెలుగమ్మాయి షణ్ముఖప్రియుకు బిగ్ షాక్

  తెలుగమ్మాయి షణ్ముఖప్రియుకు బిగ్ షాక్

  ఇండియన్ ఐడల్ 12వ సీజన్‌లో ఏమాత్రం అంచనాలు లేకుండా ఎంట్రీ ఇచ్చి.. ఏకంగా గ్రాండ్ ఫినాలేలో అడుగు పెట్టింది తెలుగు అమ్మాయి షణ్ముఖప్రియ. తనదైన శైలి గాత్రంతో పాటు ప్రయోగాలతో జడ్జ్‌లతో పాటు ప్రేక్షకులను ఫిదా చేసిన ఈ అమ్మాయి.. దేశ వ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంది. అంతేకాదు, ఆమె టాలెంట్‌ చూసిన బాలీవుడ్ ప్రముఖులే బిత్తరపోయారు. ఏకంగా ఆమెను పొగడ్తలతో ముంచెత్తారు. అయితే, తుదిపోరులో మాత్రం షణ్ముఖప్రియ నిరాశ పరిచింది. ఫలితంగా తెలుగమ్మాయి ఆరో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

  తెలుగు రాష్ట్రాలకు తొలి అమ్మాయిగా నిలిచి

  తెలుగు రాష్ట్రాలకు తొలి అమ్మాయిగా నిలిచి


  జాతీయ స్థాయి షో పేరొందిన ఇండియన్ ఐడల్‌లో ఇప్పటి వరకూ ఇద్దరు తెలుగు సింగర్స్ ఈ ట్రోఫీని సొంతం చేసుకున్నారు. ఐదో సీజన్‌లో శ్రీరామ్‌ చంద్ర, తొమ్మిదవ సీజన్‌లో రేవంత్ విజేతలుగా నిలిచారు. ఇక, ఇండియన్ ఐడల్‌ రెండో సీజన్‌లో తెలుగు సింగర్ కారుణ్య రన్నరప్‌గా నిలిచాడు. అయితే తాజా సీజన్‌లో ఫైనల్‌కు చేరిన షణ్ముఖ ప్రియ.. ఆరో స్థానంలో నిలిచింది. తద్వారా తెలుగు రాష్ట్రాల నుంచి ఇండియన్ ఐడల్ ఫినాలేకు చేరుకున్న మొట్టమొదటి ఫీమేల్ సింగర్‌గా షణ్ముఖప్రియ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.

  ఘాటు ఫొటోతో హీటు పెంచేసిన రాయ్ లక్ష్మీ: స్విమ్‌సూట్‌లో అందాలు మొత్తం కనిపించేలా!

   షోలో గెలవకపోయినా.. అదిరిపోయే ఆఫర్

  షోలో గెలవకపోయినా.. అదిరిపోయే ఆఫర్

  షణ్ముఖప్రియ ఆరంభంలోనే అదిరిపోయే ప్రదర్శనలతో ఆకట్టుకోవడంతో ఇండియన్ ఐడల్ 12వ సీజన్‌లో ఆమెను టైటిల్ ఫేవరెట్లుగా భావించారు. కానీ, ఆ తర్వాత పవన్‌దీప్, అరుణిత నుంచి ఈమెకు భారీ స్థాయిలో పోటీ వచ్చింది. ఒకానొక దశలో షణ్ముఖప్రియ వెనుకబడిపోయిందని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా ఫినాలేకు చేరుకుని ఆశలు రేపింది. ఇక, షణ్ముఖప్రియకు విజయ్ దేవరకొండ తన సినిమాలో పాడే అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. ఆమె ఈ షోలో గెలవకున్నా.. తెలుగు సినిమాలో పాడే అద్భుతమైన ఆఫర్ పట్టేసింది.

  Greatest Indian Classics - Episode 1 | Sagara Sangamam, కమల్ నట విశ్వరూపం || Filmibeat Telugu
   బాలీవుడ్‌లోనూ ఆఫర్లు.. పేరు ట్రెండింగ్‌లో

  బాలీవుడ్‌లోనూ ఆఫర్లు.. పేరు ట్రెండింగ్‌లో

  విశాఖపట్నంకు చెందిన షణ్ముఖప్రియ చిన్న వయసులోనే ఎన్నో పాటల పోటీల కార్యక్రమాల్లో పాల్గొంది. అప్పుడే తన హస్కీ వాయిస్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత పెద్దగా కనిపించని ఈ అమ్మాయి.. ఇప్పుడు ఏకంగా ఇండియన్ ఐడల్ 12వ సీజన్‌లో పాల్గొని ఫినాలేకు కూడా చేరుకుంది. దీంతో ఇటు తెలుగు ప్రేక్షకులతో పాటు దేశ వ్యాప్తంగా ఫాలోయింగ్‌ను పెంచుకుంది. ఇక, షణ్ముఖప్రియకు బాలీవుడ్ నుంచి కూడా ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమెను పలువురు మ్యూజిక్ డైరెక్టర్లు సంప్రదించారని అంటున్నారు. దీంతో ఈమె పేరు మారుమ్రోగుతోంది.

  English summary
  Indian Idol 12 Finalist Shanmukhapriya Got Sixth Place in The Show. But She Already Got Vijay Devarakonda Movie Offer. Now She Selected for Few Bollywood Movies.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X