»   »  టీవీ హీరోయిన్ సూసైడ్ నోట్‌లో ఏముందంటే...., ఆమెలా ఎందరో!

టీవీ హీరోయిన్ సూసైడ్ నోట్‌లో ఏముందంటే...., ఆమెలా ఎందరో!

Posted By:
Subscribe to Filmibeat Telugu
టీవీ నటి ఆత్మహత్య : సూసైడ్ నోట్ లో షాకింగ్ విషయాలు !

బెంగాళీ టీవీ నటి మౌమితా సాహా రెండు రోజుల క్రితం కోల్‌కతాలోని తన ప్లాట్‌లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆత్మహత్యకు ముందు ఆమె రాసిన సూసైడ్ నోట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో పలు దిగ్భ్రాంతికర విషయాలు వెలుగు చూశాయి. ఆత్మహత్యకు కొన్ని రోజుల ముందు నుండి ఆమె తీవ్రమైన డిప్రెషన్లో ఉన్నట్లు పోలీసులు నిర్దారించారు.

 ఆ కారణం వల్లే బలవన్మరణం

ఆ కారణం వల్లే బలవన్మరణం

మౌమితా సాహా తన సూసైడ్ నోట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.... బెంగాళీ టీవీ ఇండస్ట్రీలో సరైన అవకాశాలు రాక పోవడం, పెద్ద నటి కావాలనే తన కోరిక నెరవేరక పోవడం వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు ఉంది. కేవలం 23 ఏళ్ల వయసులోనే మౌమిత ఇలా చేయడం విచారకరమని, ఆమెకు ఇంకా చాలా వయసు ఉంది, మరికొంతకాలం ప్రయత్నించి ఉండాల్సింది అని అంటున్నారు. మౌమితా సాహా తరహాలోనే గతంలోనూ కొందరు టీవీ నటీమణులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ప్రత్యూష బెనర్జీ

ప్రత్యూష బెనర్జీ

హిందీ టీవీ సీరియల్ బాలిక వధుతో పాపులర్ అయిన ప్రత్యేష బెనర్జీ ముంబైలోని తన ఫ్లాట్‌లో 2016లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అప్పట్లో ఆమె ఆత్మహత్య పెద్ద వివాదానికి కారణమైంది. తన బాయ్ ఫ్రెండ్ రాహుల్ రాజ్ సింగ్ తో సమస్యలే ఆమె ఆత్మహత్యకు కారణమనే వార్తలు వినిపించాయి.

 దిశా గంగూలీ

దిశా గంగూలీ

మరో బెంగాళీ టీవీ నటి దిశా గంగూలీ కూడా 2015 ఏప్రిల్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు ఇప్పటికీ తెలియరాలేదు. ఆవిడ సేమ్ సెక్స్ రిలేషన్ వల్ల సమాజం నుండి ఎదుర్కొన్న ఒత్తిడి వల్లే ఆత్మహత్యకు పాల్పడిందనే ఆరోపణలు అప్పట్లో వినిపంచాయి. దిశా గర్ల్ ఫ్రెండ్ కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా కొందరు ఆమెను సేవ్ చేశారు.

బిడిషా బెజ్బారు

బిడిషా బెజ్బారు

అస్సామీ టీవీ నటి, సింగర్ బిడిషా 2017 జులైలో గురుగ్రామ్‌లోని తన ప్లాట్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆమె మరణంపై అప్పట్లో అనేక ఆరోపణలు వినిపించాయి. తమ కూతురిది ఆత్మహత్య కాదని, హత్య అని బిడిషా తల్లిదండ్రులు ఆరోపించారు.

నఫిసా జోసెఫ్

నఫిసా జోసెఫ్

ఎంటీవీ వీడియో జాకీ నిఫిసా 2004లో తన ఫ్లాట్ లో పెళ్లికి కొన్ని వారాల ముందు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పెళ్లికి సంబంధించిన డిస్ట్రబెన్స్ వల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందనే ఆరోపణలు అప్పట్లో వినిపించాయి.

 కుల్జీత్ రండవా

కుల్జీత్ రండవా

మరో టీవీ నటి కుల్జీత్ రండవా 2008 ఫిబ్రవరిలో ఆత్మహత్యకు పాల్పడింది. కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలోనే ఆమె బలవన్మరణానికి పాల్పడ్డారు. ఒత్తిడి భరించలేకనే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు ఆమె తన సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు.

English summary
Bengali TV actress Moumita Saha was found dead in her flat at Kolkata on Saturday. Moumita is not the only TV actress who ended her life due to depression or other personal reasons. A number of other TV divas had killed themselves in the past. Some of the deaths had stirred much controversy as well.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu