Brahmamudi August 30th: అపర్ణ బాధ్యతలు కావ్యకు అప్పగించిన ఇందిరాదేవి... రాజ్‌కు సన్మానం
బ్రహ్మముడి ధారావాహికలో ఈరోజు కూడా మంచి ట్విస్టులతో సాగింది. ఇక కావ్యతో ఎవరూ మాట్లాడకూడదని అపర్ణ పెట్టిన కండిషన్ ను ఇందిరాదేవి బట్టబయలు చేస్తోంది. అపర్ణ నిర్ణయాన్ని సుభాష్, సీతారామయ్య ఇద్దరూ తప్పుబడతారు. ఇక మరోవైపు స్వప్నను తీసుకుని రాహుల్, రుద్రాణి ఆసుపత్రికి తీసుకువెళ్తారు. అక్కడ స్వప్న ప్రెగ్నన్సీ అబద్ధం అని బయటపడిందా అనేది ఈరోజు ఎపిసోడ్ పూర్తి స్టోరీలో తెలుసుకుందాం.
స్వప్న తన పొట్టను పెంచుకునేందుకు బండేడు బిర్యానీ తింటుంది. దీంతో ఆమెను ఆసుపత్రిలో చూపించాలని ఇందిరాదేవి... రాహుల్, రుద్రాణిలకు చెబుతుంది. ఇక తనకు కడుపు లేదనే విషయం బయటపడుతుందేమోనని స్వప్న కంగారు పడుతుంది. దీంతో తన స్నేహితురాలికి కాల్ చేసి.. హెల్ప్ చేయమని స్వప్న బతిమిలాడుతుంది. నేను ఆసుపత్రికి రావడంలేదని చెప్పి ఆమె ఫోన్ పెట్టేస్తుంది.

మరోవైపు దుగ్గిరాల ఫ్యామిలీ మెంబర్స్ కోసం టిఫిన్ రెడీ చేస్తుంది కావ్య. కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ తనతో మాట్లాడకపోవడంతో వారిని ఎలా డైనింగ్ టేబుల్ వద్దకు పిలవాలో తెలియక ఆలోచనలో పడుతుంది కావ్య. పూజ చేయడానికి ఉపయోగించే గంట కొడుతుంది. డైనింగ్ టేబుల్‌పై టిఫిన్స్‌కు సంబంధించిన పేర్లు ఉండటంతో సుభాష్ ఆశ్చర్యపోతాడు. ఏం టిఫిన్ చేసావో చెబితే సరిపోతుంది కదా... ఈ బోర్డులు ఏంటి అని అడుగుతాడు. కానీ కావ్య మాత్రం సమాధానం చెప్పదు.
మౌనవ్రతమా అని సుభాష్ అడగ్గా... అత్త వ్రతం అని సుభాష్‌తో అంటుంది ఇందిరాదేవి. నోర్లు మూయించే వ్రతం...ఇంట్లో అందరూ ఒక్కటై బయటి నుంచి వచ్చిన అమాయకురాలిని ఒంటరిని చేసే వ్రతం అంటూ సీరియస్ గా మాట్లాడుతుంది. ఇందిరాదేవి మాటల్ని మధ్యలోనే అపర్ణ అడ్డుకుంటుంది. ఎందుకు మాట మారుస్తావు..నువ్వు చేసిన నిర్వాకం గురించి చెప్పనివ్వు అని అంటుంది. మట్టితొక్కి కావ్య ఇంటి పరువు తీసిందని అపర్ణ ఫైర్ అవుతుంది. అందరూ ఆ మట్టిని వదలిస్తే నువ్వు మాత్రం దోసిళ్లలో ఇంకా పట్టుకొని తిరుగుతున్నావని అపర్ణకు గట్టిగా బదులిస్తుంది ఇందిరాదేవి.

ఈ ఇంటిని ఇంట్లో వాళ్లను రూల్ చేయాలని నీ భార్య చూస్తుందని సుభాష్‌తో అంటుంది ఇందిరాదేవి. మేము ఏం చేయాలో నిర్ణయించి మాకే ఆంక్షలు విధిస్తుందని అపర్ణపై సీరియస్ అవుతుంది. ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. మమ్మీని ఇబ్బంది పెట్టొద్దని తల్లికి సపోర్ట్‌గా మాట్లాడుతాడు రాజ్. కట్టుకున్న పెళ్లాన్ని చీకట్లో, వర్షంలో నిలబెట్టావు...నువ్వేం తక్కువ కాదని అంటూ రాజ్‌కు క్లాస్ ఇస్తుంది ఇందిరాదేవి. ఇంట్లో జరిగేవి చూస్తూ ఉండలేమని, కాశీకో, రామేశ్వరానికో వెళ్లిపోతామని కొడుకుతో కోపంగా అంటుంది ఇందిరాదేవి. ఇంట్లో వాళ్లు ఎవరూ కావ్యతో మాట్లాడటానికి వీలు లేదని అపర్ణ పెట్టిన కండీషన్‌ను బయటపెడుతుంది ఇందిరాదేవి.
నన్ను, నా మాటను నమ్మి కావ్యను అత్తింట్లో ఉంచడానికి ఆమె తల్లిదండ్రులు అంగీకరిస్తే నువ్వు చేసింది ఇదా అపర్ణకు క్లాస్ ఇస్తాడు సుభాష్. ఏ విషయంలో అంత గొడవ జరిగిందో తెలిసి కూడా కావ్య మళ్లీ పుట్టింటికి వెళ్లిందంటే నా మీద గెలుపు సాధించాలన్న పంతం కాదా అని భర్తతో అంటుంది అపర్ణ.పెళ్లి చేసుకొని అత్తింట్లో అడుగుపెట్టిన తర్వాత పుట్టింటికి కష్టాలు వస్తే పట్టనట్లుగా ఉండకూడదని చేతనైనా సాయం చేయాలని చాటిచెప్పి కావ్య ఆడపిల్లలందరిని ఆదర్శంగా నిలబడింది సపోర్ట్‌గా మాట్లాడుతాడు సీతారామయ్య. నేను బతికి ఉన్నంత వరకు నా నిర్ణయం మార్చుకోను. ఎప్పుడైతే ఈ మహాతల్లి ఇంట్లో అడుగుపెట్టిందో నాకు మీ అందరికి మధ్య భేదాభిప్రాయాలు మొదలయ్యాయని అంటూ టిఫిన్ తినకుండానే వెళ్లిపోతుంది.

కావ్య కోసం ఇంటి దగ్గర ఎదురుచూస్తుంటాడు కృష్ణమూర్తి. ఆమె వచ్చిన తర్వాతే షాప్‌కు వెళ్లాలని అనుకుంటాడు. అప్పుడే కావ్య ఫోన్ చేసి రాజ్ ఆఫీస్‌లో కొన్ని పనులు ఉన్నాయని...ఈ రోజుషాప్‌కు రావడం లేదని తండ్రితో అంటుంది. మరోవైపు స్వప్నను తీసుకొని రాహుల్, రుద్రాణి హాస్పిటల్‌కు వస్తారు. తాను ప్రెగ్నెంట్ కాదనే నిజం ఎక్కడ బయటపడుతుందో అని స్వప్న భయపడుతుంది. అప్పుడే అక్కడకు వచ్చిన అసిస్టెంట్...డాక్టర్ రావడానికి చాలా సమయం పడుతుందని వచ్చే వరకు వెయిట్ చేయమని అంటుంది. ఇదే అదనుగా మీకు మర్యాద ఇవ్వని హాస్పిటల్ వద్దు, ఇక్కడి నుంచి వెళ్లిపోదామని ఓవర్ యాక్షన్ చేస్తుంది. కానీ రాహుల్, రుద్రాణి మాత్రం ఇక్కడే వెయిట్ చేద్ధామని అంటారు.

కావ్య, రాజ్‌ల కోసం సబల అనే స్త్రీ సంక్షేమ సంఘం వారు వస్తారు. దుగ్గిరాల ఫ్యామిలీ కోడలికి చాలా స్వేచ్ఛ ఇచ్చారని తెలిసి వచ్చామని సీతారామయ్యతో చెబుతారు. స్వేచ్ఛ అదేమిటి అంటూ సీతారామయ్య అంటాడు. నాకు తెలియదు మా కోడలి దగ్గరే నేర్చుకోవాలి అంటూ అపర్ణపై సెటైర్ వేస్తుంది ఇందిరాదేవి. మీరు తప్పుడు అడ్రెస్‌కు వచ్చారని ధాన్యలక్ష్మి కూడా ఫన్నీగా అంటుంది. స్వరాజ్ గ్రూప్ ఎండీ రాజ్...భార్యకు ఇస్తోన్న సపోర్ట్‌ను గురించి అభినందించడమే కాకుండా ఆయనకు సన్మానం చేయడానికి వచ్చామని స్త్రీ సంక్షేమ సంఘం వారు చెబుతారు. భార్యకు ఒక వ్యక్తిత్వం ఉంటుందని, ఆమెకు అత్మాభిమానం ఉండాలని భర్త తనకు ఇచ్చే ప్రోత్సాహాన్ని గుర్తించి సన్మానం చేయాలనుకోవడం మంచి విషయం అని కావ్య అంటుంది. నాకు ఈ సన్మానాలు వద్దు అని రాజ్ అంటాడు.

Brahmamudi: కావ్యతో మాట్లాడొద్దని అపర్ణ ఇంట్లో వాళ్లకి కండిషన్.. రాజ్ ఏం చేయనున్నాడు?
కొడుకు...కొడలికి సపోర్ట్ చేయడం చాలా మంది అత్తయ్యలకు నచ్చదు. కానీ మీ అత్తగారు అందుకు భిన్నంగా కనిపిస్తున్నారని స్త్రీ సంక్షేమ సంఘం అపర్ణపై ప్రశంసలు కురిపిస్తారు. రాజ్‌కు మంచితనం వాళ్ల అమ్మగారి నుంచే వచ్చిందని అంటారు. మీరు చెప్పింది చాలా నిజం..ఇంట్లో అందరం అత్తయ్య మాటను చాలా గౌరవిస్తామని కావ్య అంటుంది. అవును ఇప్పుడే జరిగేది అదే అంటూ ధాన్య లక్ష్మి మరో సెటైర్ వేస్తుంది. రాజ్, కావ్యలకు స్త్రీ సంక్షేమ సంఘం వారు సన్మానం చేస్తారు. దుగ్గిరాల ఫ్యామిలీలో ప్రతి ఏడాది వరలక్ష్మి వ్రతం బాధ్యతల్ని అపర్ణ చేపట్టేది. ఈ ఏడాది మాత్రం ఆ బాధ్యతల్ని కావ్యకు అప్పగిస్తున్నట్లు ఇందిరాదేవి ప్రకటిస్తుంది. ఆమె ప్రకటనతో అపర్ణ షాక్ అవుతుంది. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ముగుస్తుంది. ఇక తదుపరి ఎపిసోడ్ లో వరలక్ష్మి వ్రతం చేయాలని ఇందిరాదేవి చెబుతుంది. అయితే ప్రతి సంవత్సరం నా పెద్ద కోడలు అపర్ణ ఈ వ్రతం చేస్తూ వస్తుంది. మరి ఈ సారి అపర్ణ కోడలు కావ్య చేస్తుందని చెబుతుంది. అపర్ణ ఇది విని షాక్ అవుతుంది.


Click it and Unblock the Notifications











