'రోజా' వస్తే నేను ఆ కుర్చీలోంచి లేచి వెళ్ళిపోతా - ఇంద్రజ షాకింగ్ కామెంట్స్

బుల్లితెర మీద జబర్దస్త్ ప్రోగ్రాంకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.. ఈ షో ప్రారంభమైనప్పటి నుంచి జడ్జీలుగా నాగబాబు, రోజా వ్యవహరిస్తూ ఉండేవారు. అయితే వీరిద్దరిలో ఎవరికైనా ఇతర పనులు ఉంటే అప్పటికి అందుబాటులో ఉన్న ఎవరో ఒకరిని తీసుకువచ్చి షో నడిపిస్తూ ఉండేవారు. అయితే మనో వంటి వారు ఎంతమంది వచ్చినా మరో జడ్జిగా ఎక్కువ కాలం పాటు ఉన్నది మాత్రం ఇంద్రజ అని చెప్పక తప్పదు.. రోజా శాస్త్ర చికిత్స చేసుకుని ఇంట్లో ఉండగా ఇంద్రజ రోజా స్థానంలో కూర్చుని షో కొన్నాళ్ల పాటు నడిపారు. ఆ తర్వాత రోజా మంత్రిగా వెళ్ళాక కూడా ఇంద్రజ సందడి చేస్తున్నారు. తాజాగా మంత్రి రోజా గురించి ఇంద్రజ చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. ఆ వివరాల్లోకి వెళితే

 తనదైన వ్యక్తిత్వంతో

తనదైన వ్యక్తిత్వంతో


కొన్నాళ్ళ క్రితం జబర్దస్త్ జడ్జిగా వ్యవహరిస్తున్న రోజా శస్త్ర చికిత్స కోసం చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. అప్పుడు ఆమె స్థానంలో ఇంద్రజ షో కొన్నాళ్లపాటు నడిపారు.. అయితే రోజా వచ్చాక కూడా ఇంద్రజ జడ్జి గా ఉంటేనే బాగుంటుందని కామెంట్లు వచ్చాయి. అప్పుడు ఇంద్రజ కూడా తనదైన వ్యక్తిత్వంతో మెప్పించింది.

 ఇంద్రజ రీ ఎంట్రీ

ఇంద్రజ రీ ఎంట్రీ


అయితే రోజా తిరిగి రావడంతో ఆమెను మళ్లీ జబర్దస్త్ కి తీసుకువచ్చి ఇంద్రజను శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షోకి జడ్జిగా పెట్టారు. ఇప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గంలో రోజాకు స్థానం లభించడంతో తొమ్మిదేళ్లుగా చేస్తున్న బుల్లితెర కామెడీ కార్యక్రమం 'జబర్దస్త్'లో జడ్జి సీటు నుంచి ఆమె తప్పుకోవడంతో రోజా తర్వాత ఆమె స్థానంలో ఇంద్రజ రీ ఎంట్రీ ఇచ్చారు.

 లేచి వెళ్ళిపోతానని

లేచి వెళ్ళిపోతానని


ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే రోజాకు మంత్రిగా అవకాశం రాకూడదని భగవంతుడిని ఇంద్రజ కోరుకున్నారనే విషయాన్ని తాజాగా బయట పెట్టాడు ఆటో రామ్ ప్రసాద్. ఈ విషయాన్ని ప్రస్తావించడంతో ఆమె స్వయంగా ఒప్పుకున్నారు. అవును రోజా వస్తే... 'జబర్దస్త్' జడ్జ్ సీటు నుంచి తాను లేచి వెళ్ళిపోతానని ఇంద్రజ మరోసారి స్పష్టం చేశారు.

 ఇదే మాట చెబుతా

ఇదే మాట చెబుతా


ఆమె ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక గొడవలు ఏమీ లేవని కూడా చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ రోజా గారు తొమ్మిదేళ్లుగా ఒక లెగసీ క్రియేట్ చేశారని అన్నారు. ఆ తర్వాత మంత్రిగా అవకాశం రావడంతో వెళ్లారని పేర్కొన్నారు. ఇప్పుడు మాత్రమే కాదు... ఎప్పుడైనా, ఏ వేదిక మీదనైనా నేను ఇదే మాట చెబుతానాని అంటూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.

రెడీగా ఉంటా రోజా ఎప్పుడు 'జబర్దస్త్'

రెడీగా ఉంటా రోజా ఎప్పుడు 'జబర్దస్త్'

రెడీగా ఉంటా
రోజా ఎప్పుడు 'జబర్దస్త్'కు వచ్చినా... లేదంటే 'ఇంద్రజ, నేను వస్తున్నాను' అని ఇన్ఫర్మేషన్ ఇచ్చినా చాలు...నేను జబర్దస్త్ జడ్జ్ సీటు నుంచి నేను రెడీగా ఉంటాను'' అని 'ఎక్స్ట్రా జబర్దస్త్' షోలో ఇంద్రజ చెప్పుకొచ్చారు. ఇక ప్రస్తుతం ఇంద్రజ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక ఈ వ్యవహారం మీద రోజా ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X