సుడిగాలి సుధీర్‌తో అలాంటి రిలేషన్‌..అందుకే కన్నీళ్లు.. ఓపెన్‌ అయిన ఇంద్రజ

ఒకప్పుడు జబర్దస్త్ లో చక్రం తిప్పిన సుడిగాలి సుధీర్ అలాగే గెటప్ శ్రీను జబర్దస్త్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. జబర్దస్త్ నుంచి తప్పుకున్న సుడిగాలి సుదీర్ స్టార్ మాలో ప్రసారమవుతున్న ఒక షోకి యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. సుధీర్ వెళ్లినప్పటి నుంచి అతని గురించి ప్రస్తావిస్తూ కొన్ని ఎపిసోడ్స్ ప్లాన్ చేస్తోంది మల్లెమాల సంస్థ. మరీ ముఖ్యంగా కొన్ని స్కిట్స్ సుధీర్ కేంద్రంగా చేయిస్తూ రావడం ఆసక్తికరంగా మారింది. గతంలో అలాంటి ఒక స్కిట్ చేస్తున్న సమయంలో జడ్జిగా ఉన్న ఇంద్రజ కన్నీళ్లు పెట్టుకోవడం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఈ విషయం మీద ఇంద్రజ స్పందించారు. ఆ వివరాల్లోకి వెళితే

రీ ఎంట్రీ

రీ ఎంట్రీ


కొన్నాళ్ళ క్రితం హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్‌ని షేక్‌ చేసిన ఇంద్రజ వివాహం తరువాత సినిమాలకు దూరమయ్యారు. ఇక శతమానం భవతి సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చిన ఆమె వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటున్నారు. ఆమె ఓ వైపు సినిమాల్లో నటిస్తూ, మరోవైపు టీవీ షోస్‌లోనూ అడపా దడపా మెరుస్తుంది. ప్రస్తుతం ఆమె జబర్దస్త్ షోకి జడ్జ్ గా ఉన్నారు. రోజా సీట్లో ఆమె జడ్జ్ గా చేస్తున్నారు.

సుడిగాలి సుధీర్ బై

సుడిగాలి సుధీర్ బై

మరోవైపు సుడిగాలి సుధీర్‌ యాంకర్‌గా చేసే శ్రీదేవి డ్రామా కంపెనీకి ఆమె జడ్జ్ గా ఉండేవారు కానీ తప్పుకున్నారు. ఇదిలా ఉండగా యాంకర్‌గా, నటుడిగా పేరు తెచ్చుకున్న సుడిగాలి సుధీర్‌ జబర్దస్త్ లో బాగా పాపులర్‌ కావడంతో ఆయనకు హీరోగా వరుస అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం వాంటెడ్‌ పండుగాడ్‌, గాలోడు సినిమాలతో పాటు మరో సినిమాలో కూడా హీరోగా నటిస్తున్నారు.

చెప్పనంటూ

చెప్పనంటూ

సినిమాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో అటు జబర్దస్త్ని, ఇటు శ్రీదేవి డ్రామా కంపెనీని మ్యానేజ్ చేయలేక తప్పుకున్నాడు. అయితే ఆయన తప్పుకోవడంపై తాజాగా ఇంద్రజ స్పందించింది. ఒక యూట్యూబ్‌ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకుంది ఇంద్రజ. అసలు సుడిగాలి సుధీర్‌ ఎందుకు జబర్దస్త్ ని వదిలేశాడనే ప్రశ్నకి ఆమె షాకింగ్ గా సమాధానం ఇస్తూ ఎవరి వ్యక్తిగత విషయాలను తాను మాట్లాడనని, తన గురించి తప్ప మరెవ్వరి పర్సనల్‌ విషయాలను తాను చెప్పలేనని చెప్పుకొచ్చింది.

చాలా బాధగా

చాలా బాధగా

మీరు అడిగిన విషయం నాకు తెలిసినా చెప్పనని ఆమె పేర్కొంది. అయితే సుడిగాలి సుధీర్‌ షోని వదిలేస్తున్న సందర్భంగా మీరు ఎలా ఫీలవుతున్నారనే ప్రశ్నకి చాలా బాధగా అనిపిస్తుందని చెప్పుకొచ్చింది. జబర్దస్త్ షో నుంచి సుడిగాలి సుధీర్ వెళ్లిపోవడంపై కెవ్వు కార్తీక్ ఓ స్కిట్ చేశాడని, కార్తీక్ సుధీర్‌లా కళ్ల అద్దాలు పెట్టుకునేటప్పుడు నాకు సుధీర్‌ గుర్తొచ్చి ఒక్కసారిగా ఏడ్చేశానని, ప్రయత్నించినా కన్నీళ్లు ఆపుకోలేకపోయానని ఆమె అన్నారు.

ఏజ్‌ గ్యాప్‌ తక్కువగానే

ఏజ్‌ గ్యాప్‌ తక్కువగానే

సుధీర్‌ను సిద్దూ అని పిలుస్తా, నన్ను ప్రేమగా రాజీ అని సధీర్ పిలుస్తాడని అలాగే అతను అమ్మ అని పిలవడం చాలా ఇష్టంగా ఉంటుందని ఆమె వెల్లడించారు. సుధీర్ కాకుండా పటాస్ ప్రవీణ్ కూడా నాకు దేవుడు ఇచ్చిన కొడుకని, చాలా మంచి అబ్బాయని అన్నారు. సుధీర్‌కి తనకు ఏజ్‌ గ్యాప్‌ తక్కువగానే ఉన్నా ఇద్దరి మధ్య తల్లి కొడుకు అనుబంధం ఉంటుందన్న ఇంద్రజ అతనితో తన బాండింగ్‌ చాలా స్పెషల్‌ అని, అందుకే ఎమోషనల్‌ అయ్యానని చెప్పుకొచ్చింది ఇంద్రజ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X