‘అలాంటివి నాకు నచ్చవ్.. అందుకే ఆదితో గొడవపడతా!' ఇంద్రజ క్లారిటీ ..
హైపర్ ఆది (Hyper Aadi) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ షోతో విపరీతమైన పాపులారిటీ సంపాదించిన ఆయన, తనదైన రైటింగ్ స్టైల్ , పవర్‌ఫుల్ పంచ్ డైలాగ్స్‌తో ప్రేక్షకులను నవ్వించడంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం టీవీ షోలు, సినిమాలతో బిజీగా ఉన్నారు ఆది. అయితే అదే సమయంలో ఆయన కామెడీ శైలిపై విమర్శలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా బాడీ షేమింగ్, ట్రోలింగ్ కామెడీ, అవతలి వారిని తక్కువ చేసే పంచులపై సోషల్ మీడియాలో తరచూ చర్చ జరుగుతుండటం గమనార్హం. ఈ విషయంపై నటి ఇంద్రజ తాజాగా కామెడీ స్టార్ హైపర్ ఆది (Hyper Aadi) గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఇంతకీ ఏమన్నారంటే?
జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి పాపులర్ షోలతో ప్రేక్షకులకు మరింత దగ్గరైన ఇంద్రజ... తాజాగా ఫిల్మీ బీట్ తెలుగు ( Fimlibeat Telugu) తో మాట్లాడారు. ఈ సమయంలో శ్రీదేవి డ్రామా కంపెనీ సెట్స్‌లో ఆర్టిస్టులతో ఎలా ఉంటుందో, హైపర్ ఆది టాలెంట్ ఏంటి? ఏ విషయంలో తనకు అభ్యంతరం ఉందో చాలా ఓపెన్‌గా వివరించింది. ముందుగా హైపర్ ఆది గురించి మాట్లాడుతూ ఇంద్రజ తన స్వభావాన్ని క్లియర్ చేసింది.

'మీరు స్క్రీన్‌పై చూస్తున్నట్లే... నా బాండింగ్స్ కూడా చాలా న్యాచురల్‌గా ఉంటాయి. సిద్దుతో నా బాండింగ్ అమ్మ-కొడుకు రిలేషన్‌లా ఉంటుంది. అది ఆఫ్ స్క్రీన్ అయినా, ఆన్ స్క్రీన్ అయినా అలాగే ఉంటుంది. అలాగే ఆది గారితో కూడా... అవసరమైతే కసురుకుంటాను, అవసరమైనప్పుడు ప్రశంసిస్తాను. నేను ఎవరివద్దైనా నటించను. నా మనసులో నుంచి వచ్చే భావాలే నేరుగా మాటలుగా వస్తాయి' అని చెప్పుకొచ్చింది. కంటెస్టెంట్స్‌తోనూ, ఆర్టిస్టులతోనూ ఫ్రెండ్లీగా ఉండటం తన నేచర్ అని స్పష్టం చేసింది.
ఇక జబర్దస్త్ షోపై వస్తున్న ట్రోలింగ్ గురించి కూడా ఇంద్రజ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'జబర్దస్త్ స్క్రిప్టెడ్ షో అని చాలామంది ట్రోలింగ్ చేస్తుంటారు. నిజమే... ఇది స్క్రిప్టెడ్ షో. ప్రతి స్కిట్‌కి ముందు హాసన్ చేసిన తర్వాతే స్టేజ్ మీదకు వస్తారు. కానీ, ఆ విషయం తెలియక చాలామంది నెగటివ్ కామెంట్స్ చేస్తారు. అలాంటి కామెంట్స్ చూసినప్పుడు మాలో మేమే నవ్వుకుంటాం. వాళ్ల మీద జాలి కూడా వేస్తుంది. ఏమీ తెలియకుండా మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. అందుకే వాటిని సీరియస్‌గా తీసుకోను. అలాంటి వాళ్లకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ అంతే' అంటూ ట్రోల్స్‌ను లైట్‌గా తీసుకుంటానని చెప్పింది.
సెట్స్‌లోని వాతావరణం గురించి మాట్లాడిన ఇంద్రజ, జబర్దస్త్ కానీ, శ్రీదేవి డ్రామా కంపెనీ కానీ... అక్కడ పని చేసే ఆర్టిస్టులందరినీ తాను కుటుంబంలా భావిస్తానని తెలిపింది. 'సెట్స్‌లో ఒక్కరు మిస్ అయినా వెంటనే ఆ వెలితి కనిపిస్తుంది. అందరూ ఉండాలి. ఒక ఫ్యామిలీలో ఒక్కరు లేకపోయినా మిస్సింగ్ ఫీలింగ్ వస్తుంది కదా... అలాగే ఇక్కడ కూడా. అందుకే నాతో పని చేసే వారందరితో చాలా క్లోజ్‌గా ఉంటాను' అని చెప్పింది.
ఇక అసలు హాట్ టాపిక్ అయిన హైపర్ ఆది టాలెంట్ గురించి ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. 'నేను చూసిన వాళ్లలో హైపర్ ఆది చాలా చాలా టాలెంటెడ్. అప్పటికప్పుడు స్క్రిప్ట్ అక్కడే ప్రిపేర్ చేసుకుని, ఐదు లేదా పది నిమిషాల్లోనే పర్ఫామెన్స్ ఇచ్చే కెపాసిటీ అతనికి ఉంది. మీరు ఏ కంటెంట్ ఇచ్చినా సరే, ఒక లైన్ చెప్పినా సరే... వెంటనే దాన్ని డెవలప్ చేసి స్కిట్‌గా మార్చగలడు. ఇది అన్ఇమాజిన్ టాలెంట్' అంటూ ఆది ప్రతిభను తెగ పొగిడింది.
అయితే అదే సమయంలో, తనకు నచ్చని విషయం ఏంటో కూడా చాలా క్లియర్‌గా చెప్పింది ఇంద్రజ. 'హైపర్ ఆదితో నాకు విభేదాలు వచ్చే ఒకే ఒక విషయం ఉంది. అది ఆడవాళ్ల మీద, అమ్మాయిల మీద వేసే జోకులు, సెటైర్లు. ఆ విషయంలో నేను అస్సలు ఒప్పుకోను. ఎప్పుడూ ఆ విషయంలో మా మధ్య గొడవలు జరుగుతూనే ఉంటాయి. అలాంటి జోకులను నేను ఖండిస్తూనే ఉంటాను' అంటూ స్పష్టంగా చెప్పింది. మహిళలపై డబుల్ మీనింగ్ లేదా అవమానకరమైన కామెంట్స్ తనకు అస్సలు నచ్చవని మరోసారి స్ట్రాంగ్‌గా క్లారిటీ ఇచ్చింది.
అయితే ఈ విభేదాలు ఉన్నప్పటికీ, ఒక వ్యక్తిగా మాత్రం హైపర్ ఆదిని చాలా ఇష్టపడతానని ఇంద్రజ చెప్పడం గమనార్హం. "పర్సనల్‌గా ఆది చాలా మంచి మనిషి. టాలెంట్ విషయంలో అతనికి నేను పెద్ద ఫ్యాన్‌నే. నేను చూసిన కొన్ని స్కిట్స్ అయితే... ముందుగా ప్రాక్టీస్ చేసినవే కాదు. అప్పటికప్పుడు ఐదు పది నిమిషాల్లో రెడీ చేసుకుని స్టేజ్ మీద చేసేశాడు. అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి' అంటూ గుర్తు చేసుకున్నారు.


Click it and Unblock the Notifications











