జబర్దస్త్‌లో బాడీ షేమింగ్.. నటి ఇంద్రజ షాకింగ్ కామెంట్స్..

జబర్దస్త్‌పై వస్తున్న నెగటివ్ ప్రచారంపై ప్రముఖ నటి, ఆ షో జడ్జీ ఇంద్రజ స్పందించారు. అడల్ట్ కంటెంట్, బాడీ షేవింగ్ వ్యాఖ్యలపై నటి ఇంద్రజ క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఇంద్రజ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని, టెలివిజన్‌లో సంచలనంగా మారిన జబర్దస్త్ షోపై వస్తున్న మిక్స్‌డ్ కామెంట్స్‌కు సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా యాంకర్, 'జబర్దస్త్ షోలో ఈమధ్య అడల్ట్ కంటెంట్ ఎక్కువైంది, డబుల్ మీనింగ్ డైలాగ్స్, బాడీ షేవింగ్ కామెంట్స్ పెరిగాయి అని కొంతమంది విమర్శిస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి?' అని ప్రశ్నించగా, ఇంద్రజ చాలా క్లారిటీతో తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

ముందుగా జబర్దస్త్ రేటింగ్, ప్రాముఖ్యత గురించి మాట్లాడిన ఇంద్రజ... '2013లో ప్రారంభమైన జబర్దస్త్, టెలివిజన్ చరిత్రలోనే ఒక అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది. ఇన్ని సంవత్సరాలు నిరంతరంగా కొనసాగుతున్న షో మరొకటి లేదు. అదనంగా 'ఎక్స్‌ట్రా జబర్దస్త్' కూడా కొనసాగుతూ, రెండు ప్రోగ్రామ్‌లకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. టీఆర్పీ రేటింగ్‌లను పక్కన పెడితే, ఇంతకాలం ప్రేక్షకులను కట్టిపడేసేలా నడవడం చాలా పెద్ద విషయం' అని అన్నారు.

Indraja Responds to Jabardasth Controversy Clarifies Adult Content and Body Shaming Claims

ఇన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న షోకు రేటింగ్ విషయంలో అప్ అండ్ డౌన్స్ రావడం సహజమేనని ఇంద్రజ స్పష్టం చేశారు. 'ప్రేక్షకులు ఎప్పటికప్పుడు కొత్తదనం కోరుకుంటారు. ఆ అవసరాలకు అనుగుణంగా జబర్దస్త్ కూడా మారుతోంది. కేవలం రేటింగ్‌లతో కాకుండా, ఒక షో ఎంత బలంగా నిలబడుతోందో, ఎంతమందికి అవకాశాలు ఇస్తుందో చూసి అంచనా వేయాలి. ఎంతోమంది నటులకు తమ టాలెంట్ చూపించుకునే వేదికగా జబర్దస్త్ నిలిచింది. అక్కడి నుంచి సినిమాల వరకూ వెళ్లినవారు చాలామందే' అని తెలిపారు.

అంతేకాదు, జబర్దస్త్‌ను ఇతర కామెడీ షోలకు 'తల్లి లాంటి షో'గా అభివర్ణించారు. 'జబర్దస్త్ ఆధారంగానే చాలా కామెడీ ప్రోగ్రామ్‌లు డిజైన్ అయ్యాయి. అలాంటి షోకు ఆదరణ తగ్గుతోంది అనడం కరెక్ట్ కాదు. కొత్త ప్రేక్షకులు కూడా ఎప్పటికప్పుడు షోను ఆదరిస్తూనే ఉన్నారు. కొంతమంది కావాలని నెగటివ్ ప్రచారం చేస్తున్నారు అంతే' అని అన్నారు. తాను జడ్జ్‌గా వచ్చిన తర్వాత రేటింగ్ పెరిగిందన్న ప్రశ్నకు ఇంద్రజ స్పందిస్తూ, 'అది నిజం కాదు. స్కిట్ బాగుంటే, జడ్జ్ ప్లేస్‌లో ఎవరు ఉన్నా రెస్పాన్స్ వస్తుంది. జడ్జ్ అనేది ప్రేక్షకులకు, పర్ఫామెన్స్ ఇచ్చేవారికి మధ్య ఒక వారధి మాత్రమే'అని తేల్చిచెప్పారు.

ఇక అడల్ట్ కంటెంట్, బాడీ షేవింగ్ కామెంట్స్ విషయానికి వస్తే, ఇంద్రజ చాలా స్పష్టమైన సమాధానం ఇచ్చారు. 'జబర్దస్త్‌లో పార్టిసిపేట్ చేసే వాళ్లందరూ అడల్ట్స్. కానీ ప్రతి విషయం ఒక గీత దాటకుండా ఉండాలి. కొన్ని సందర్భాల్లో అటు ఇటు పోవచ్చు, కానీ దాన్ని సరిదిద్దడానికి మేనేజ్‌మెంట్, ఛానల్ ఉంది. అన్ని దశల్ని దాటుకున్న తర్వాతే కంటెంట్ ప్రేక్షకుల ముందుకు వస్తుంది' అన్నారు.

బాడీ షేవింగ్ పంచ్‌లపై స్పందిస్తూ 'ఎవరి మీద పంచ్ వేస్తారో వారికి ముందుగానే తెలుస్తుంది. చాలామంది తమ ఫేమ్ కోసమే అలాంటి పంచ్‌లకు ఒప్పుకుంటారు. రిహార్సల్స్ తర్వాతే స్కిట్లు స్టేజ్‌పైకి వస్తాయి. ఇది కామెడీ షో అని, ఎంటర్‌టైన్‌మెంట్ కోసమే అన్న క్లారిటీ అందరికీ ఉంటుంది. ఎవ్వరినీ నొప్పించడానికి లేదా అవమానించడానికి డైలాగులు ఉండవు. అభ్యంతరం ఉంటే రిహార్సల్ టైమ్‌లోనే చెప్పే అవకాశం ఉంటుంది' అని ఇంద్రజ స్పష్టం చేశారు. ఇలా జబర్దస్త్‌పై వస్తున్న విమర్శలకు గట్టి కౌంటర్ ఇస్తూ, ఇది తప్పుడు ప్రచారమేనని, షోకు తనదైన ప్రేక్షకాదరణ ఎప్పటికీ ఉంటుందని నటి ఇంద్రజ ధీమా వ్యక్తం చేశారు.

More from Filmibeat

Read more about: indraja jabardasth hyper adhi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X