బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కోసం ముందు జాగ్రత్తగా ఇన్సూరెన్స్ కవర్.. ఎంతో తెలుసా?

కరోనా వైరస్ పెరుగుతున్న సమయంలో గతంలో ఎప్పుడు లేని విదంగా జనాల్లో ఇన్సూరెన్స్ పై ఒక అవగాహన అయితే వచ్చింది. ఇక రియాలిటీ షోల కోసం మొదటిసారి సెలబ్రెటీస్ కి కూడా స్పెషల్ గా ఇన్సూరెన్స్ కవర్ అవుతుండడం విశేషం. బిగ్ బాస్ యాజమాన్యం ఇప్పుడు అందుకోసం ఒక ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ముందుజాగ్రత్తగా కంటెస్టెంట్స్ కి భారీ స్థాయిలో ఉచితంగా ఇన్సూరెన్స్ కవర్ చేయిస్తోందని సమాచారం.

 కరోనా రాకుండా స్పెషల్ జాగ్రత్తలు..

కరోనా రాకుండా స్పెషల్ జాగ్రత్తలు..

గత మూడు సీజన్స్ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనుకున్న సమయానికి మొదలైన విషయం తెలిసిందే. అయితే ఈ సారి కరోనా కారణంగా షో చాలా ఆలస్యంగా స్టార్ట్ కానుంది. అదే విధంగా గతంలో లేని కొత్త రూల్స్ తో షోను నడిపించబోతున్నారు. మెయిన్ గా కరోనా వైరస్ గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు అనేది అందరిలో ఆసక్తిని రేవుతోంది.

15రోజుల ముందే..కరోనా టెస్టులు

15రోజుల ముందే..కరోనా టెస్టులు

ఎలాగైనా ఆగస్ట్ చివరి వారంలోనే షోను స్టార్ట్ చేయాలని నిర్వహకులు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. హోస్ట్, కంటెస్టెంట్స్ ఎవరు అనే విషయంలో అనేక రకాల రూమర్స్ వస్తున్నప్పటికీ ఇంకా అఫీషియల్ ఎనౌన్స్మెంట్ అయితే రాలేదు. అయితే షో స్టార్ట్ అయ్యే 15రోజుల ముందే కంటెస్టెంట్స్ కి అలాగే టెక్నీషియన్స్ కి స్పెషల్ గా కరోనా టెస్టులు నిర్వహించనున్నారు.

 ఇన్సూరెన్స్ కవర్

ఇన్సూరెన్స్ కవర్

వారు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు అంటేనే షోలో ఉండేందుకు వీలు కల్పిస్తారు. ఇక షోకి ముందు రోజు కూడా మరోసారి కరోనా పరీక్షలు నిర్వహిస్తారట. అయితే ముందు జాగ్రత్తగా షోలోకి అడుగు పెట్టిన కంటెస్టెంట్స్ కి ఇన్సూరెన్స్ కవర్ చేసేందుకు నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట. ఒకవేళ అనారోగ్యానికి గురైతే వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకునే ప్రణాళికలు కూరచించారట.

ముందు జాగ్రత్తగా..

ముందు జాగ్రత్తగా..

దాదాపు 35లక్షల నుంచి 50లక్షల వరకు ఇన్సూరెన్స్ కవర్ చేయించబోతున్నట్లు టాక్ వస్తోంది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని బిగ్ బాస్ షో నిర్వాహకులు మాత్రం రిస్క్ లేకుండా ఉండడానికి ప్రతి ఒక్క నెగిటివ్ పాయింట్ కి ముందు జాగ్రత్తగా సొల్యూషన్ సెట్ చేసి పెట్టుకుంటున్నట్లు తెలుస్తోంది.

Recommended Video

Jabardasth Comedian నా పెళ్లి జరగకపోతే అందుకు కారణం Sreemukhi, Jhansi నే
భయపడాల్సిన అవసరం లేదు..

భయపడాల్సిన అవసరం లేదు..

ఇక షోలో సోషల్ డిస్టెన్స్ ఏ విధంగా ఉంటుంది అనేది స్టార్ట్ అయ్యేవరకు తెలియదు. అయితే ముందుగానే కరోనా పరీక్షలు చేసి పంపుతారు కాబట్టి సోషల్ డిస్టెన్స్ విషయంలో పెద్దగా భయపడాల్సిన అవసరం ఉండదు. మరి ఈ షో జనాల నుంచి షో ఎలాంటి కామెంట్స్ అందుకుంటుందో చూడాలి. ఇక ఇటీవల తరుణ్ బిగ్ బాస్ షోలో పాల్గొనడం లేదని క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X