బిగ్ బాస్2 : నామినేషన్ కోసం కొత్త టెక్నిక్.. వాళ్లలో వాళ్ళకే గొడవ పెట్టేసిన బిగ్ బాస్.. తనీష్, అమిత్
బిగ్ బాస్ హౌస్ లో ఇక నుంచి రణరంగంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. ఇంటి సభ్యులంతా టైటిల్ వేట మొదలు పెట్టారు. విజేతగా నిలిచేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ప్రస్తుతం హౌస్ లో ఉన్న సభ్యులంతా బాగా పెర్ఫామ్ చేస్తున్నవారే. దీనితో నామినేషన్ ప్రక్రియ కోసం బిగ్ బాస్ టాస్క్ లని కఠినతరం చేస్తున్నారు. సోమవారం ప్రదర్శించే ఎపిసోడ్ కి సంబందించిన ప్రోమో విడుదుల చేశారు. నామినేషన్ కోసం బిగ్ బాస్ కొత్త పద్ధతి అవలంభించబోతున్నట్లు ఈ ప్రోమో ద్వారా అర్థం అవుతోంది.

ఇద్దరిద్దరుగా విడిపోయి
ఈ వారం నామినేషన్ కోసం బిగ్ బాస్ ఇంటి సభ్యులని ఇద్దరిద్దరుగా విడగొట్టారు. వారిలో ఎవరు నామినేట్ కాకూడదు కారణాలతో సహా వాళ్లే వివరించాలి. నామినేట్ కావాల్సిన సభ్యుల పేర్లు కూడా వారే చెప్పాలి.

గొడవలు
ఈ కొత్త టాస్క్ వలన ప్రతి సభ్యుడు నామినేషన్ కోసం ఒకరి పేరు చెప్పవలసి ఉంటుంది. దీనివలన ఇంటిసభ్యుల మధ్యే వివాదాలు చెలరేగడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రతి ఒక ఇంటిసభ్యుడు సీరియస్ గా వివరణ ఇచ్చుకుంటున్నారు.

తనీష్, అమిత్ ఇద్దరూ
ఈ టాస్క్ లో ఇంటి కెప్టెన్ తనీష్ కు మినహాయింపు లభించినట్లు ప్రోమో ద్వారా కనిపిస్తోంది. అమిత్ కూడా ఈ టాస్క్ లో పాల్గొనడం లేదు. అది ఎందుకో నేటి ఎపిసోడ్ లో చూడాల్సిందే. మిగిలిన ఇంటి సభ్యులంతా వారి వివరణని తనీష్, అమిత్ కు వెల్లడించాలి.

రెండు నెలలు
బిగ్ బాస్ 2 తెలుగు ప్రారంభమై రెండు నెలలు గడచిపోయింది. ఇక నెలన్నర మాత్రమే ఉంది. ఈ నెలన్నరలో బిగ్ హోస్ హౌస్ లో చివరి వరకు ఎవరు కొనసాగుతారు.. విజేతగా ఎవరు నిలుస్తారు.. రాబోవు వారాల్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే ఉత్కంఠ ఆడియన్స్ లో నెలకొని ఉంది.

ఇకపై ఎలా
ఇన్నిరోజులు బిగ్ బాస్ హౌస్ లో జరిగింది ఒక ఎత్తైతే ఇక జరగబోయేది మరో ఎత్తు అని చెప్పొచ్చు. ఇక అందరి గురి విజేతగా నిలవడం పైనే ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు.


Click it and Unblock the Notifications











