బిగ్‌బాస్ హౌస్‌లో ముగ్గురు మొనగాళ్లకు చుక్కలు కనిపిస్తున్నాయి.. రసం పిండుతున్నారు!

Recommended Video

బిగ్‌బాస్ హౌస్‌లో ముగ్గురు మొనగాళ్లకు చుక్కలు కనిపిస్తున్నాయి

బిగ్ బాస్ 2 వినోదభరితంగా సాగుతోంది. హౌస్ సభ్యులు బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ చేయాడానికి పోటీ పడుతున్నారు. ఇటీవలే మూవీ మేకింగ్ టాస్క్ పూర్తయిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ హౌస్ లోకి తాజగా ప్రముఖ యాంకర్ ప్రదీప్ ప్రవేశించడంతో మరింత జోష్ పెరిగింది. ఇదిలా ఉండగా ఈ వారం కెప్టెన్ పదవి కోసం బిగ్ బాస్ ముగ్గురు సభ్యులని ఎంపిక చేశారు. వారిలో ఒకరిని కెప్టెన్ గా నియమించబోతున్నారు. దీనికోసం బిగ్ బాస్ ఆ ముగ్గురికి ఆదేశించిన టాస్క్ చాలా ఆసక్తికరంగా ఉంది. దానికి సంబందించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ఎపిసోడ్ నేడు ప్రసారం కానుంది.

ముగ్గురు మొనగాళ్లు వీళ్ళే

ముగ్గురు మొనగాళ్లు వీళ్ళే

ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో పోటీ పడబోయేది బాబు గోగినేని, తనీష్, అమిత్. వీరు ముగ్గురూ బిగ్ బాస్ ఆదేశాల ప్రకారం ఆసక్తి కరమైన టాస్క్ లో పాల్గొంటున్నారు. ఈ టాస్క్ లో విజయం సాధించిన వారిని కెప్టెన్ గా నియమిస్తారు.

చుక్కలు కనిపించేలా

చుక్కలు కనిపించేలా

కెప్టెన్సీ టాస్క్ అంత సులువైనది కాదు. ఈ ముగ్గురికి మూడు బకెట్స్ లో టమాటోలో కేటాయిస్తారు. బకెట్ లోకి ఎక్కి టమాటోలని తొక్కుతూ రసం తీయాలి. ఎవరు ఎక్కువ రసం తీయగలిగితే వారే కెప్టెన్ అవుతారు.

పెద్దన్నగా బాబు గోగినేని

పెద్దన్నగా బాబు గోగినేని

బిగ్ బాస్ హౌస్ లో బాబు గోగినేని పెద్దన్న పాత్ర పోషిస్తున్నాడనే అభిప్రయం ఆడియన్స్ లో ఉంది. ఆయన ఇంతవరకు కెప్టెన్ కాలేదు. సామ్రాట్, కౌశల్, గీత మాధురి ఇప్పటివరకు కెప్టెన్ లుగా ఉన్నారు. బాబు గోగినేని కెప్టెన్ అయితే ఎలా ఉంటుందనే ఆసక్తి ఆడియన్స్ లో ఉంది.

అగ్రసివ్‌గా తనీష్

అగ్రసివ్‌గా తనీష్

తనీష్ కూడా ఇంతవరకు కెప్టెన్సీ చేయలేదు. కానీ హౌస్ లో ప్రతి వ్యవహారంలోనూ తనీష్ అగ్రెసివ్ గా కనిపిస్తున్నాడు. కొన్ని గొడవల్లో కూడా తాని ప్రమేయం ఉంది. ఈ నేపథ్యంలో తనీష్ కెప్టెన్ అయితే హౌస్ ని ఎలా హ్యాండిల్ చేస్తాడు అనే ఉత్కంఠ నెలకొంది. ఇక అమిత్ అన్ని వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొంటున్నా పెద్దగా హైలైట్ కావడం లేదు. అదృష్టం బావుంటే అతడే కెప్టెన్ కావొచ్చేమో!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X