బిగ్ బాస్2: సునైనా, తనీష్ మధ్య వైఫై కనెక్షన్.. వారి వ్యవహారం గురించి అందరూ!

Recommended Video

Bigg Boss 2 Telugu 68 Day Highlights : Kaushal Team Won Call Center Task

బిగ్ బాస్2 చాలా వినోదాత్మకంగా సాగుతోంది. ఆకట్టుకునే టాస్క్ లలో ఇంటి సభ్యులంతా బాగా పెర్ఫామ్ చేస్తున్నారు.నేచురల్ స్టార్ నాని ఈ వీకెండ్ లో పేల్చబోయే ఎలిమినేషన్ బాంబు ఎవరిపై అనే ఉత్కంఠ నెలకొని ఉంది. తాజగా హౌస్ లో టెలిఫోన్ టాస్క్ జరిగింది. ఈ టాస్క్ లో కౌశల్ టీం సభ్యులు విజేతలుగా నిలిచారు. ఈ టాస్క్ చిన్న చిన్న వివాదాలు చోటుచేసుకున్నాయి. ఈ టాస్క్ లో ఇరు టీం సభ్యులు కాల్ సెంటర్ ఉద్యోగులుగా, పబ్లిక్ కాలర్స్ గా చేసారు.

 దీప్తి సెటైర్లు

దీప్తి సెటైర్లు

కాల్ సెంటర్ టాస్క్ లో భాగంగా నిన్న జరిగిన ఎపిసోడ్ లో తనీష్ అండ్ టీం కాల్ సెంటర్ ఉద్యోగులుగా పాల్గొన్నారు. సునైనాకు పబ్లిక్ బూత్ నుంచి దీప్తి ఫోన్ చేసింది. వీరి మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. సునైనపై దీప్తి వేసిన సెటైర్లు ఆకట్టుకున్నాయి.

వైఫై కనెక్షన్

వైఫై కనెక్షన్

పబ్లిక్ బూత్ నుంచి సునైనతో మాట్లాడుతూ దీప్తి సరదా ప్రశ్నలు అడిగింది. మన జాతీయ జెండా రూపొందిన వ్యక్తి ఎవరు అని ప్రశ్న అడిగింది. ఆ ప్రశ్నకు సంధానం తెలియకపోవడంతో సునైనా పక్కనే ఉన్న తనీష్ ని అడిగింది. సమాధానం వేంటనే రాకపోవడంతో దీప్తి మాట్లాడుతూ ఏంటి వైఫై కనెక్షన్ స్లో అయినట్లు ఉంది అంటూ సెటైర్లు పేల్చింది.

ఇంటి సభ్యులందరూ

ఇంటి సభ్యులందరూ

బిగ్ బాస్ 2 లో ఎదో ఒక సందర్భంలో చాలామంది ఇంటి సభ్యులు సునైనా, తనీష్ మధ్య వ్యవహారం గురించి ప్రస్తావిస్తూనే ఉన్నారు. దీప్తి వైఫై కనెక్షన్ అంటూ వేసిన సెటైర్ కూడా వీరిద్దరి గురించే. కౌశల్ కూడా ఈ విషయం గురించి తనీష్ తో ఫోన్ లో మాట్లాడాడు.

సమంతలాగా

సమంతలాగా

సునైనతో దీప్తి మాట్లాడుతూ మీరు సమంతలాగా ఉంటారట కదా అని అడిగింది. ఏమో తెలియదు. కానీ అలా అంటే మాత్రం నాకు సిగ్గేస్తుంది అని చమత్కరించింది. ఇక కాల్ సెంటర్ టాస్క్ విషయంలో గీత, కౌశల్ మధ్య స్వల్ప వివాదం చోటు చేసుకుంది.

అబద్దం

అబద్దం

తాను ఫోన్లో మాటాడుతున్న సమయంలో కాల్ లో అంతరాయం కలిగిందని కావాలనే అబద్దం చెప్పారు. అందుకే తాము కూడా కాల్ కట్ చేసినట్లు అబద్దం చెప్పమని గీత కౌశల్ తో వాదించింది. ఈ విషయంలో కాసేపు వారికి మధ్య వివాదం చోటు చేసుకుంది.

విజేతగా

విజేతగా

ఇక కాల్ సెంటర్ టాస్క్ లో కౌశల్ అండ్ టీం విజేతగా నిలిచినట్లు బిగ్ బాస్ ప్రకటించారు. ఇంటి కెప్టెన్ తనీష్ ని బిగ్ బాస్ పిలిచి సీక్రెట్ గా మాట్లాడారు. బిగ్ బాస్ ఆదేశించే రూల్స్ తప్పని సరిగా అందరూ పాటించాలని బిగ్ బాస్ కెప్టెన్ గా తనకు చెప్పాడని తనీష్ ఇంటి సభ్యులకు వివరించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X