కర్ణన్ టు సినిమాబండి, ఈ వారంలో ఇంట్రెస్టింగ్ ఓటీటీ రిలీజ్ లు ఇవే!
కరోనా కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో భారత దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు.. ఈ నేపథ్యంలో థియేటర్లు ఇప్పట్లో ఓపెన్ అయ్యే అవకాశం అయితే కనిపించడం లేదు.. లాక్ డౌన్ కారణంగా జనం అంతా ఇళ్లకే పరిమితమయ్యారు.. ఇప్పుడు వరుసగా చాలా సినిమాలు ఓటిటిలో రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే కొన్ని ఆసక్తికర సినిమాల విషయానికి వస్తే దాదాపుగా ఈ వారం ఐదు సినిమాలు ఓటీటీ వేదికగా రిలీజ్ అవుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే

మినారి - అమెజాన్ ప్రైమ్ వీడియో
కొరియన్ భాషలో నిర్మించిన ఒక అమెరికన్ డ్రామా మూవీ మినారి. లీ ఇస్సాక్ చుంగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆస్కార్ అవార్డులలో ఉత్తమ మూవీ కేటగిరీలో నామినేట్ అయింది. ఈ చిత్రంలో నటనకు యున్ యుహ్-జంగ్ ఉత్తమ సహాయ నటి విభాగంలో ఆస్కార్ అవార్డును గెలుచుకున్నారు. మినారి ఈ రోజు నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కానుంది.

రాధే - జీ ప్లెక్స్
ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమాలో దిశాపటాని హీరోయిన్గా నటించింది. ఈ సినిమా థియేటర్ ల తో పాటు జీ ఫ్లెక్స్ యాప్ లో కూడా రిలీజ్ కాబోతోంది. ఈ మోడల్ లో రిలీజ్ అవుతున్న మొట్టమొదటి భారతీయ సినిమాగా ఈ సినిమా రికార్డులకెక్కింది. ఈ సినిమాను రంజాన్ సందర్భంగా మే 13 నుండి థియేటర్లలో అలాగే జీ ప్లెక్స్ లో ప్రసారం కానుంది.

సినిమాబండి - నెట్‌ఫ్లిక్స్
బాలీవుడ్ దర్శకులు రాజ్, డికెల నిర్మాణంలో ఈ ఇండిపెండెంట్ ఫిలిం రూపొందింది.. ఓ పల్లెటూరి ఆటో డ్రైవర్ కు ఒక కెమెరా దొరికితే దానితో ఎలా సినిమా చేయాలి అని ఆటో డ్రైవర్ తన స్నేహితులతో కలిసి చేసిన ప్రయత్నాలతో నే ఈ సినిమా రూపొందింది. ఈ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రం మే 14 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది.

కర్ణన్ - అమెజాన్ ప్రైమ్ వీడియో
తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ యాక్షన్ మూవీకి మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. కర్ణన్ గత నెలలో థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా మొదటి ఆట నుంచే విమర్శకుల నుండి మరియు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన తెచ్చుకుంది. ఇప్పుడు, మే 14 న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ కానుంది.
Recommended Video

ఫెర్రీ - నెట్‌ఫ్లిక్స్
ఫెర్రీ అనేది డచ్ చిత్రం, ఇది నెదర్లాండ్స్‌లోని డ్రగ్ కార్టెల్ నేపథ్యంలో రూపొందించారు. ఈ సినిమా ట్రైలర్‌కు సైతం ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. ఇది మే 14 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది.


Click it and Unblock the Notifications











