బిగ్‌బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఈ వారమే! అంతా ఆశ్చర్యపోయేలా..
Recommended Video
బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3 గ్రాండ్‌గా రన్ అవుతోంది. నాగార్జున హోస్ట్ చేస్తున్న ఈ షో ప్రతీ రోజూ ఆసక్తికర టాస్క్‌లతో హుషారుగా సాగిపోతోంది. హౌస్‌మేట్స్ మధ్య గొడవలు, ఏడుపులు ఈ షోలో హైలైట్ అవుతూ వస్తున్నాయి. ఇప్పటికే వరుసగా హేమ, జాఫర్, తమన్నా, రోహిణి, అషు రెడ్డి వరుసగా ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎవరు ఎంట్రీ ఇవ్వబోతున్నారు? అనే దానిపై ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి.

గతంలో అలా వచ్చి ఇలా వెళ్లిన తమన్నా
బిగ్ బాస్ సీజన్ 3 లో ఇప్పటికే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్ లోకి ప్రవేశించిన ట్రాన్స్‌జెండర్ తమన్నా ఎక్కువ రోజులు హౌస్ లో నిలవలేకపోయింది. ఇటీవలే ఆమె కూడా ఎలిమినేట్ అయింది. దీంతో ఈ సారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చే వారు ఎవరు అనే దానిపై జనాల్లో ఉత్కంఠ నెలకొంది.

హీరోయిన్ల గ్లామర్ యాడ్ చేయాలని..
బిగ్ బాస్ హౌస్‌ని మరింత కలర్‌ఫుల్‌గా మార్చేయాలనే కోణంలో ఈ సారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఓ హీరోయిన్‌ని రంగంలోకి దించాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ లిస్టులో ప్రముఖంగా శ్రద్దా దాస్, ఈషా రెబ్బా పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. వీరితో బిగ్ బాస్ నిర్వాహకులు సంప్రదింపులు కూడా జరుపుతున్నట్టుగా సమాచారం.

ఈ వారమే.. అందరూ ఆశ్చర్యపోయేలా
ఈ సారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చే హౌస్‌మెట్‌ని అందరూ ఆశ్చర్యపోయేలా హౌస్ లోకి ఎంట్రీ ఇప్పించాలని ప్లాన్ చేస్తున్నారట. తమన్నా సింహాద్రి ఎంట్రీ చాలా నార్మల్ గానే జరిగింది కాబట్టి ఈసారి మాత్రం ఆసక్తి రేకెత్తించే రీతిలో వైల్డ్ కార్డ్ ఎంట్రీపై సన్నాహాలు జరుగుతున్నట్లుగా సమాచారం. పైగా ఈ ఎంట్రీ ఈ వారమే ఉంటుందనేది కొసమెరుపు.

గ్లామర్ బ్యూటీలతో కళ కళ
ఇప్పటికే శ్రీముఖి, శివజ్యోతి, వితిక లాంటి గ్లామర్ బ్యూటీలతో కళకళలాడుతున్న బిగ్ బాస్ హౌస్‌కి మరింత గ్లామర్ తీసుకురావాలనే కోణంలో హాట్ బ్యూటీలను దించాలనేది నిర్వాహకుల ప్లాన్ అని తెలుస్తోంది. చూడాలి మరి చివరకు ఎవరు ఎంట్రీ ఇస్తారో.. ఎలా ఇస్తారో!


Click it and Unblock the Notifications











