Kasthuri Shankar: ఇంటింటి గృహలక్ష్మి ఫేమ్ కస్తూరికి షాకింగ్ రెమ్యునరేషన్.. ఒక్క రోజు పారితోషికం ఎంతో తెలుసా?

Kasthuri Shankar: నటి కస్తూరి శంకర్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. స్టార్‌ మాలో ప్రసారమైనా ఇంటింటి గృహాలక్ష్మి సీరియల్‌ ద్వారా తులసిగా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఓ మహిళ ఎదుర్కునే కష్టాలు, భర్త నుంచి విడిపోతే... సమాజం నుంచి ఎలా ఎదురుదెబ్బలు ఎదరైతాయో తన నటన ద్వారా కండ్లకు కట్టినట్టు చూపింది. దీంతో తులసిగా కస్తూరి బుల్లితెరపై ఎనలేని ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఇదిలా ఉంటే..ఆలనాటి నటి, గ్లామర్ హీరోయిన్ కసూర్తి శంకర్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుందో ఓ లూక్కేయండి.

సీనియర్ నటి కస్తూరి శంకర్ అసలు పేరు సుమతి శంకర్. ఈమె లా చదువుకుంది. కానీ, ఫ్యాషన్ రంగంపై ఇంట్రెస్ట్ తో మోడలింగ్ అడుగుపెట్టింది. ఇలా 1991 లో మిస్ చెన్నైగా గెలుపొందారు. ఆ తర్వాత ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో ఫైనలిస్ట్‌గా సెలక్ట్ అయ్యారు కస్తూరి. ఈ ఫేమ్ తో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. అలా.. 1991లో ఆతా ఉన్ కోయిలే అనే తమిళ సినిమా ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. తన కెరీర్ లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వందకు పైగా చిత్రాల్లో నటించారు.

Intinti Grilahkshmi serial fame Kasthuri Shankar remuneration full details here

తెలుగులో కూడా.. నిప్పు రవ్వ, గాడ్ ఫాదర్, సొగ్గాడి పెళ్లాం, మెరుపు, చిలక్కొట్టుడు, మా ఆయన బంగారం, ఆకాశ వీధిలో, డాన్ శీను, అన్నమయ్య, శమంతకమణి, సింబా వంటి సినిమాలతో నటించి మెప్పించారు. ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుంది. పెళ్లి తరవాత కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్నారు. అనంతరం సెకండ్ ఇన్సింగ్స్ ప్రారంభించారు. ఈ తరుణంలో్ అమ్మ,అక్క, వదిన వంటి పాత్రల్లో నటిస్తూ..క్యారెటర్ ఆర్టిస్టుగా బిజీ అయ్యారు.

ఈ తరుణంలోనే బుల్లితెరపైనా ఎంట్రీ ఇచ్చి దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ సీరియల్స్,షోలు చేశారు. 2019 లో తమిళ బిగ్ బాస్ 3 లో కంటెస్టెంట్‌గా ఉన్నారు. అలాగే.. స్టార్ మాలో ప్రసారమైన ఇంటింటి గృహలక్ష్మీ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. తన నటనతో ఆ సీరియల్‌ని టాప్‌లో నిలబెట్టారు.ఈ సీరియల్ ద్వారా ఎంతో క్రేజ్ సంపాదించుకుంది. సోషల్ మీడియాతో నిత్యం యాక్టివ్ గా ఉంటూ రాజకీయంగా, వ్యక్తిగతంగా తనదైన అభిప్రాయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఈ అమ్మడు ఎక్కడుంటే.. అక్కడ కాంట్రవర్సీలు ఉంటాయనే పేరు కూడా ఉంది.

ఇంటింటి గృహలక్ష్మి సీరియల్‌లో లీడ్ రోల్ తులసిగా నటించింది కస్తూరి శంకర్.. ఈ పాత్ర క్రేజ్‌‌కి తగ్గట్టుగానే రెమ్యూనరేషన్ తీసుకుందట. కస్తూరి ఒక్కరోజు రూ.25 నుంచి 30 వేల వరకు పారిదోషకంగా తీసుకుంటారంట. ఇక వెబ్ సిరీస్, సినిమా షూటింగ్స్ అయితే దీనికి రెట్టింపు రెమ్యూనరేషన్ తీసుకుందట. అంటే.. ఒక్క రోజుకు యాభై వేలకు పైగానే డిమాండ్ చేస్తుందట నటి కస్తూరి శంకర్. ఇది బట్టి చూస్తే.. భారీ మొత్తంలోనే సంపాదిస్తుందన్న మాట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X