For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఇంటింటి గృహలక్ష్మి 'లహరి' అరెస్ట్.. కారుతో ఢీకొట్టడంతో వ్యక్తికి తీవ్ర గాయాలు.. తాగి నడిపిందంటూ?

  |

  తాగి వాహనం నడపడం అనే విషయం చాలా కామన్ అయిపోయింది. పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ అరికట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా సరే నలుగురికి మంచి చెప్పాల్సిన సెలబ్రిటీలు కూడా తాగి వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదానికి కారణం అవుతున్నారు. తాజాగా ఒక సీరియల్ నటి తాగి వాహనం నడిపి రోడ్డు ప్రమాదానికి గురైనట్టు ప్రచారం జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే

  Photos Courtesy: Star MAA and Disney+Hotstar

  ఇంటింటి గృహలక్ష్మి

  ఇంటింటి గృహలక్ష్మి

  ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్ లో నటించిన నటి లహరి బుల్లితెర ప్రేక్షకులందరికీ సుపరిచితమే. సంప్రదాయబద్ధంగా కనిపించే లహరి తనదైన నటనతో తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలను సొంతం చేసుకుంది. చైల్డ్ ఆరిస్ట్ గా ఆమె 'అర్జున్‌' సినిమాలో కూడా కనిపించింది లహరి. ఆ తర్వాత 'చక్రవాకం'తో సీరియల్‌ ప్రేక్షకులకు సైతం ఆమె చేరువయ్యారు. ప్రస్తుతం 'ఋతుగీతం' టెలీ సీరియల్‌తో పాటు 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ సహా ఇంకా కొన్ని సీరియల్స్ లో నటిస్తున్న ఆమె సీరియల్స్ చేస్తూనే సొంతంగా యూట్యూబ్ ఛానల్‌ కూడా పెట్టుకుంది.

  కారు ఢీకొట్టి

  కారు ఢీకొట్టి

  అయితే తాజాగా ఆమె నటన కాకుండా మరో విషయంలో వార్తల్లో నిలిచింది. ఆమె అడుగుతున్న కారు ఒక బైకును ఢీకొన్న ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. మద్యం మత్తులోనే ఆమె ఈ పని చేసిందని ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ శివారు శంషాబాద్ ప్రాంతంలో ఆమె యాక్సిడెంట్ చేసింది. ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రైవేటు పెట్రోలింగ్ వాహనం నడిపే వ్యక్తి డ్యూటీ ముగించుకుని శంషాబాద్ వైపు బైక్‌పై వస్తుండగా వెనకాల నుంచి లహరికి చెందిన మారుతి సియాజ్(TS 07 FA 9534) కారు ఢీకొట్టింది. దీంతో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి కిందపడి గాయపడ్డాడు.

   భయంతో

  భయంతో

  స్వయంగా కారు నడుపుతున్న లహరి... పై వెళుతున్న ఓ వ్యక్తిని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయని తెలుస్తోంది. వెంటనే అక్కడ ఉన్న స్థానికులు అంబులెన్స్ కు ఫోన్ చేసి, అతన్ని ఆసుపత్రికి తరలించారు. యాక్సిడెంట్ ఘటనతో తీవ్ర భయాందోళనకు గురైన లహరి గుమికూడిన జనాలను చూసి భయంతో కారు కూడా దిగలేదని అంటున్నారు.

   బ్రీత్ అనలైజర్ తో

  బ్రీత్ అనలైజర్ తో

  ఇక చాలా సేపు అలాగే ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో, పోలీసులు ఆమెను కారుతో సహా పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. ఆమె మద్యం సేవించిందేమో అనే అనుమానాలు వ్యక్తం చేయడంతో బ్రీత్ అనలైజర్ తో పరీక్ష కూడా చేశారు. అందులో ఆమె మద్యం సేవించలేదని తేలింది. దీంతో ఆమెను పోలీసులు వ్యక్తిగత పూచీకత్తు మీద విడుదల చేసినట్లు సమాచారం.

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
   ఆగ్రహానికి గురి చేసినట్లు

  ఆగ్రహానికి గురి చేసినట్లు

  మరోవైపు గాయపడ్డ వ్యక్తి తరపున ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో లహరిని ఇంటికి పంపించేశారని అంటున్నారు. కారుతో బైకును గుద్దిన తర్వాత చిన్న పాటి షాక్ కు గురైన అందుకే ఆమె కిందికి దిగలేకపోయారని, ఈ చర్య స్థానికులను మరింత ఆగ్రహానికి గురి చేసినట్లు చెబుతున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

  English summary
  intinti gruhalakshmi actress lahari was arrested by accident.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X