Intinti Gruhalakshmi Weekly Roundup: సామ్రాట్ ఇంట్లో తులసికి అవమానం.. ఆ సీన్ చూసి నందూ‌లో అనుమానం

మిగిలిన భాషలతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెరపై చాలా రకాల సీరియళ్లు వస్తున్నాయి. అయితే, అందులో సుదీర్ఘ కాలం పాటు సత్తా చాటే సీరియళ్లు తక్కువగానే ఉంటున్నాయి. అందులోనూ కొన్ని మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటూ దూసుకుపోతోన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఒకటి. తమిళ నటి కస్తూరి ప్రధాన పాత్రలో ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజురోజుకూ ఎన్నో మలుపులు తిరుగుతూ రసవత్తరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని అంతకంతకూ పెంచేస్తోంది. ఫలితంగా దీనికి ఆదరణ కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే ఆగస్టు 1 నుంచి 6వ తేదీ వరకు ఈ 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎలా సాగిందో చూడండి!

1వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

1వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

1వ తేదీ సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. తులసికి ప్లాన్‌ను వివరించేందుకు వచ్చిన నందూ.. ఆమె మ్యూజిక్ స్కూల్‌తో పాటు మల్టీఫ్లెక్స్‌ను నిర్మించాలని అనుకుంటున్నట్లు చెబుతాడు. దీనికి తులసి ఒప్పుకోదు. దీంతో నందూ ఈ విషయాన్ని సామ్రాట్‌కు చెబుతానని అంటాడు. అప్పుడు తులసి కూడా చెప్పుకోమని అంటుంది. ఆ తర్వాత ఆఫీస్‌లో ఇదే విషయాన్ని నందూ, సామ్రాట్‌కు చెప్తాడు. అప్పుడు తులసి సంగీతం విలువను ఆయనకు అర్థం అయ్యేలా చెబుతుంది. దీంతో సామ్రాట్ ఆమె మాటలకు ఫిదా అయిపోయి తులసికి సపోర్ట్ చేస్తాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

2వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

2వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో


2వ తేదీ మంగళవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. ఒంటరిగా కూర్చున్న హనీ బాధ పడుతూ ఉంటుంది. అది చూసిన సామ్రాట్ ఏమైందని అడగ్గా.. ఇంట్లో ఒంటరిగా ఉండడం తట్టుకోలేకపోతున్నానని చెప్తుంది. దీంతో ఈ విషయాన్ని సామ్రాట్ తన బాబాయితో పంచుకుంటాడు. అప్పుడు ఆయన తులసికి ఫోన్ చేసి ఇంట్లో పార్టీ చేస్తున్నాం అందరూ రండి అని చెప్తాడు. దీనికి తులసి ఓకే అంటుంది. కానీ, దీనికి నందూ రానని అంటాడు. దీంతో లాస్య.. తులసిని బ్రతిమలాడు అని చెప్తుంది. దీంతో సామ్రాట్.. తులసి దగ్గరకు వెళ్లి మన విషయం చెప్పొద్దు అని అడుగుతాడు.

 3వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

3వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

3వ తేదీ బుధవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. గతం గురించి సామ్రాట్‌కు చెప్పొద్దని తులసిని బ్రతిమాలేందుకు నందూ వస్తాడు. అందుకు అనుగుణంగానే తులసితో తన మనసులోని మాటను చెబుతాడు. దీనికామె ఆయన అడిగితే చెప్తాను.. అడగకపోతే చెప్పను అని బదులిస్తుంది. దీంతో నందూ ఊపిరి పీల్చుకుని తిరిగి వెళ్లిపోతాడు. ఆ తర్వాత సామ్రాట్ ఇంటికి తులసి ఫ్యామిలీ మొత్తం వెళ్తుంది. ఆ తర్వాత నందూ, లాస్య కూడా అక్కడకు వస్తారు. ఆ సమయంలో సామ్రాట్, నందూ మధ్యన వంటల పోటీ పెడతారు. ఇందుకోసం రెండు టీమ్‌లుగా విడిపోతారు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

 4వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

4వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

4వ తేదీ గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. నందూ, సామ్రాట్ మధ్యన వంటల పోటీ జరుగుతుంది. అప్పుడు నందూకు లాస్య, సామ్రాట్‌కు తులసి సహాయం చేస్తారు. ఆ తర్వాత జడ్జ్‌గా తులసి వద్దని నందూ అడ్డు పడతాడు. కానీ, దీనికి తులసి ఒప్పుకోదు. పైగా నందూకు ఓ రేంజ్‌లో క్లాస్ పీకుతుంది. ఆ తర్వాత పరందామయ్య, అనసూయ ఆ వంటలు రుచి చూసి సామ్రాట్ గెలిచినట్లు ప్రకటిస్తారు. అనంతరం దివ్యతో సామ్రాట్ చెస్ ఆడి గెలుస్తాడు. ఇదంతా చూసిన నందూకు కోపం వచ్చి వెళ్లిపోవాలనుకుంటాడు. కానీ, అతడిని తీసుకొచ్చి సామ్రాట్‌తో మరో పోటీ పెడతారు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

5వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

5వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో


5వ తేదీ శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. నందూ, సామ్రాట్ మధ్యన ఆర్మ్ రెజ్లింగ్ పోటీ జరుగుతుంది. అప్పుడు తులసి ఇద్దరిలో ఎవరు గెలుస్తారా అని టెన్షన్ పడుతూ ఉంటుంది. అది చూసిన సామ్రాట్ ఏమైందని సైగల ద్వారా అడుగుతాడు. దీంతో తులసి అతడిని ఓడిపోమని చెప్తుంది. దీంతో సామ్రాట్ ఓడిపోతాడు. ఆ తర్వాత ఎందుకు ఓడిపోమన్నదో తులసి వివరిస్తుంది. ఆ సమయంలోనే అతడు గులాబీ పువ్వును ఇస్తాడు. అది చూసి నందూ కోపంత రగిలిపోతాడు. అనంతరం సామ్రాట్.. తులసి కోసం ఓ వీణను గిప్టుగా ఇస్తాడు. దీనితో తులసి పాట పాడుతుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

6వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

6వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో


6వ తేదీ శనివారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. తులసి పాడిన పాటకు ఫిదా అయిన సామ్రాట్.. ఇంత టాలెంట్‌ను ఎందుకు దాచుకున్నారని అడుగుతాడు. దీంతో ఆమె తన గతాన్ని గుర్తు చేసుకుంటుంది. అందులో నందూ.. తులసి టాలెంట్‌ను తొక్కేసినట్లు చూపిస్తారు. ఆ తర్వాత అనసూయ కూడా తులసి ఎదగకపోడానికి తానే కారణం అంటుంది. ఆ సమయంలో చిన్న డిస్కర్షన్ జరుగుతుంది. ఇక, సామ్రాట్ వాళ్ల బాబాయి తులసిని ‘నీ భర్త నిన్ను ఎందుకు వదిలేశాడు' అని అడుగుతాడు. దీంతో తులసికి కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

ఈ వారంలో హైలైట్ అయింది ఇదే

ఈ వారంలో హైలైట్ అయింది ఇదే


ఆగస్టు 1 నుంచి 6వ తేదీ వరకు సాగిన ‘ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ కొన్ని మలుపులతో జనరంజకంగానే సాగింది. ఈ వారం మొత్తంలో తులసి.. సామ్రాట్ ఫ్యామిలీకి మరింత దగ్గరైపోయింది. అంతేకాదు, ఆమె ఫ్యామిలీని సామ్రాట్ తన ఇంటికి పిలిచాడు. ఆ సమయంలో నందూకు సామ్రాట్‌కు మధ్య కొన్ని పోటీలు కూడా పెట్టారు. అవన్నీ అయిపోయిన తర్వాత తులసికి సామ్రాట్ ఓ గిఫ్ట్ ఇచ్చాడు. అలాగే, తులసికి సామ్రాట్ గులాబీ ఇచ్చిన సన్నివేశం చూసి నందూ షాక్ అయ్యాడు. ఇలా ఈ వారం సామ్రాట్, తులసి మరింత దగ్గర అయిపోయారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X