Intinti Gruhalakshmi Weekly Roundup: వైజాగ్‌లో తులసి, సామ్రాట్.. వీళ్ల మధ్య ఊహించనిది జరగబోతుందా!

దాదాపు రెండు మూడు దశాబ్దాలుగా తెలుగు బుల్లితెరపై సరికొత్త కంటెంట్‌తో చాలా రకాల సీరియళ్లు వస్తున్నాయి. అయితే, అందులో సుదీర్ఘ కాలం పాటు సత్తా చాటే సీరియళ్లు తక్కువగానే ఉంటున్నాయి. అందులోనూ కొన్ని మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఒకటి. తమిళ నటి కస్తూరి ప్రధాన పాత్రలో ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజురోజుకూ ఎన్నో మలుపులు తిరుగుతూ రసవత్తరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని అంతకంతకూ పెంచేస్తోంది. ఫలితంగా దీనికి ఆదరణ కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే ఆగస్టు 8 నుంచి 13వ తేదీ వరకు ఈ 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎలా సాగిందో చూడండి!

 8వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

8వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

8వ తేదీ సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. సామ్రాట్ మీద హ్యాండ్ రైజింగ్ పోటీలో తాను తులసి వల్లే గెలిచానన్న నిజాన్ని లాస్యకు చెబుతాడు నందూ. అంతేకాదు, ఉద్యోగం మానేస్తానని అంటున్న అతడికి కొన్ని సలహాలు ఇస్తుంది. ఆ తర్వాత సామ్రాట్.. తులసి వాళ్ల ఇంటికి వస్తాడు. ఆ సమయంలో తన బాబాయిని మందలించి యాక్టింగ్ చేస్తాడు. దీంతో తులసి తనకేమీ కోపం లేదని చెబుతుంది. ఆ తర్వాత సామ్రాట్ ఒక వీణను తీసుకొచ్చి ఆమెకు గిఫ్టుగా ఇస్తాడు. ఆ తర్వాత ఆఫీస్‌కు లేటుగా వచ్చిందని తులసిని నందూ నిందించగా.. సామ్రాట్ ఆమెకు సారీ చెప్పిస్తాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

9వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

9వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో


9వ తేదీ మంగళవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. సామ్రాట్.. తులసిని వైజాగ్ తీసుకెళ్తానని అన్నప్పటి నుంచి నందూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఆమెను ఎలాగైనా ఆపాలని ఈ విషయాన్ని అనసూయకు ఫోన్ చేసి చెప్తాడు. అంతలో తులసి కూడా ఈ విషయాన్ని ఇంట్లో వాళ్లకు చెప్పాలనుకుంటుంది. అప్పుడు అనసూయ వచ్చి ఇది చెప్పడంతో పాటు వైజాగ్ వెళ్లేందుకు అందరినీ ఒప్పిస్తుంది. ఇక, హనీ.. తల్లి ప్రేమ గురించి మాట్లాడుతూ.. తులసిని అమ్మా అని పిలవాలని ఉన్నట్లు సామ్రాట్‌కు చెప్తుంది. ఆ తర్వాత అతడికి తులసి కలలోకి వచ్చి ఓ పాట పాడుతుంది.

10వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

10వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

10వ తేదీ బుధవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. సామ్రాట్‌తో కలిసి తులసి వైజాగ్ వెళ్లాలని నిర్ణయించుకోవడంతో నందూ రగిలిపోతూ ఉంటాడు. అప్పుడు లాస్య.. తులసి ఇలా మారడానికి నువ్వే కారణం అంటూ అతడిని నిందిస్తుంది. ఆ సమయంలో తులసి రాసుకున్న కోరికల చిట్టా గురించి నందూ గతం గుర్తు చేసుకుంటాడు. అనంతరం తులసి ఇంట్లో వాళ్లు వైజాగ్ టూర్ గురించి ఆమెకు ధైర్యం చెబుతారు. అప్పుడు సామ్రాట్ ఫోన్ చేసి ఫ్లైట్ టైం సహా కొన్ని వివరాలు చెప్తాడు. దీంతో తులసి అదే ఊహించుకుంటూ పడుకుని.. చెడ్డ కల కని బెడ్ మీద నుంచి కింద పడిపోతుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

11వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

11వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో


11వ తేదీ గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. తులసిని ఇంట్లో వాళ్లు అందరూ కలిసి ఎన్నో జాగ్రత్తలు చెప్పి వైజాగ్‌కు పంపిస్తారు. అప్పుడామెను ఎయిర్‌పోర్టుకు చేరుకునేందుకు ఓ ఆటో ఎక్కిస్తారు. మరోవైపు, సామ్రాట్ తన కారులో ఎయిర్‌పోర్టుకు వెళ్తుంటాడు. కొంచెం దూరం వెళ్లిన తర్వాత ఆ కారుకు బ్రేకులు ఫెయిల్ అవుతాయి. దీంతో సామ్రాట్ నడుచుకుంటూ వెళ్తుంటాడు. అప్పుడు తులసి అతడిని చూసి ఆటో ఎక్కించుకుంటుంది. మరోవైపు నందూ, లాస్యలు పక్కింటి వాళ్లను తులసి ఇంటికి తీసుకొస్తారు. అప్పుడు వాళ్లంతా తులసిపై దారుణంగా కామెంట్లు చేస్తారు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

12వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

12వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో


12వ తేదీ శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. ప్లయిట్ ఆలస్యం కావడంతో సామ్రాట్, తులసి ఎయిర్‌పోర్టులో వేచి చూస్తుంటారు. ఆ సమయంలో తులసి తెచ్చుకున్న పులిహోరను సామ్రాట్ మొత్తం తినేస్తాడు. అనంతరం నందూను ఒప్పించి లాస్య కూడా వైజాగ్ వెళ్లేందుకు ఎయిర్‌పోర్టుకు వస్తుంది. దీంతో భార్యను వెంట పెట్టుకుని వచ్చిన నందూను సామ్రాట్ ప్రశంసిస్తాడు. ఇక, ప్లయిట్ ఎక్కగానే బత్తాయి బాలరాజు ఎంట్రీ ఇచ్చి నందూకు చిరాకు తెప్పిస్తాడు. మరోవైపు, తులసితో అభి ప్రవర్తించిన తీరుపై అంకిత కోపంగా ఉంటుంది. దీంతో అతడికి ఓ రేంజ్‌లో క్లాస్ పీకుతుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

13వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

13వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో


13వ తేదీ శనివారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. ప్లైట్‌లో తులసి ఫొటోలు దిగాలని అనుకుంటుంది. దీనికి సామ్రాట్ సహాయం చేసి కొన్ని పిక్స్ తీస్తాడు. అవి తులసి తన ఇంట్లో వాళ్లకు పంపుతుంది. ఆ తర్వాత పక్క సీటులో ఉన్న బాలరాజు తులసి, సామ్రాట్‌ను భార్య భర్తలని, లాస్య, నందూను సెటప్‌లు అని అంటాడు. దీంతో నందూకు కోపం వస్తుంది. మరోవైపు, అభి గొడవ పడి తినడం మానేయడంతో అంకిత వంట చేయకూడదని అనుకుంటుంది. ఇక, శృతిని ఎలాగైనా తీసుకుని రమ్మని ప్రేమ్‌కు అంకిత కొన్ని విలువైన సలహాలను ఇస్తుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

 ఈ వారంలో హైలైట్ అయింది ఇదే

ఈ వారంలో హైలైట్ అయింది ఇదే


ఆగస్టు 8 నుంచి 13వ తేదీ వరకు సాగిన ‘ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ కొన్ని మలుపులతో చాలా ఆసక్తికరంగా సాగింది. ఈ వారం మొత్తంలో తులసి.. సామ్రాట్‌తో కలిసి వైజాగ్ వెళ్లేందుకు ప్రయాణం అయింది. అదే సమయంలో తన మొదటి విమాన ప్రయాణం గురించి ఆమె ఎంతో ఆనంద పడింది. దీన్ని క్యాష్ చేసుకుని నందూ, లాస్య.. తులసిని తిరుగుబోతు, బజారుది అని పక్కింటి వాళ్లతో అనిపిస్తారు. ఇక, అభి కూడా తన తండ్రికి సపోర్ట్ చేస్తుంటాడు. మరోవైపు, ప్రేమ్ మాత్రం శృతిని ఎలాగైనా ఇంటికి తీసుకు రావాలని అనుకుంటూ ఉంటాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X