Intinti Gruhalakshmi Weekly Roundup: నిజం చెప్పి దొరికిపోయిన సామ్రాట్.. తులసి ఇంట్లో ఊహించని ఘటన

ఇండియాలోని మిగిలిన భాషల కంటే తెలుగు బుల్లితెరపై సరికొత్త కంటెంట్‌తో చాలా రకాల సీరియళ్లు వస్తున్నాయి. అయితే, అందులో సుదీర్ఘ కాలం పాటు సత్తా చాటే సీరియళ్లు తక్కువగానే ఉంటున్నాయి. అందులోనూ కొన్ని మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఒకటి. తమిళ నటి కస్తూరి ప్రధాన పాత్రలో ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజురోజుకూ ఎన్నో మలుపులు తిరుగుతూ రసవత్తరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని అంతకంతకూ పెంచేస్తోంది. ఫలితంగా దీనికి ఆదరణ కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే ఆగస్టు 15 నుంచి 20వ తేదీ వరకు ఈ 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎలా సాగిందో చూద్దాం పదండి!

 15వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

15వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

15వ తేదీ సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. తులసి వాళ్లు ప్రయాణిస్తోన్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తుతుంది. దీంతో ఎయిర్ హోస్టెస్ మీద నందూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. దీంతో తులసి అతడిపై విరుచుకుపడుతుంది. అంతేకాదు, అతడికి క్లాస్ పీకిన తర్వాత ప్రయాణికులందరికీ ధైర్యం చెప్తుంది. ఆ తర్వాత అంతా సర్ధుకోవడంతో ప్రయాణికులు చప్పట్లు కొడతారు. ఇక, శృతి విషయంలో ప్రేమ్ చేసేది నచ్చని అంకిత.. అతడికి కొన్ని విలువైన సలహాలను ఇస్తుంది. ఇక, క్లయింట్లతో మీటింగ్ వాయిదా పడడంతో సామ్రాట్ వాళ్లు హోటల్ రూమ్‌కే పరిమితం అవుతారు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

16వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

16వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో


16వ తేదీ మంగళవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. శృతి కోసం కౌశల్య ఇంటి దగ్గర ప్రేమ్ వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే వాళ్లిద్దరూ అక్కడు వస్తారు. అప్పుడు కౌశల్య.. ప్రేమ్‌ను ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. దీంతో ప్రేమ్‌కు కోపం వచ్చి ఆమె మీద అరిచేస్తాడు. అప్పుడు శృతి.. ప్రేమ్‌ను తిడుతుంది. దీంతో అతడికి కోపం వచ్చి ఇకపై ఎప్పుడూ కలవను అనుకుంటూ వెళ్లిపోతాడు. మరోవైపు, హోటల్ రూమ్‌లో సామ్రాట్, తులసి ఏం చేస్తున్నారో చూడ్డానికి నందూ వస్తాడు. అప్పుడు తాను వేరే రూమ్‌లో ఉంటున్నట్లు సామ్రాట్ చెప్పడంతో అతడు ఊపిరి పీల్చుకుంటాడు.

17వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

17వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో


17వ తేదీ బుధవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. రూమ్‌లో ఒంటరిగా ఉన్న తులసిని సామ్రాట్ బయటకు తీసుకెళ్తానని అంటాడు. ఆ వెంటనే ఆటో బుక్ చేసి మరీ ఆమెను వైజాగ్ అంతా తిప్పుతాడు. చివరకు బీచ్ దగ్గరకు తీసుకు వచ్చి ఆమెను సర్‌ప్రైజ్ చేస్తాడు. దీంతో తులసి ఎంతగానో సంతోషిస్తుంది. ఇక, శృతి కోసం వెళ్లిన ప్రేమ్ ఒంటరిగా రావడంతో అంకిత షాక్ అవుతుంది. అప్పుడు ఏమైందని అడగ్గా.. తాను శృతితో కలిసి బతికేది లేదని చెబుతాడు. ఇక, సముద్రం దగ్గర తులసి కనిపించకుండా పోతుంది. దీంతో సామ్రాట్ ఏడుస్తూ ఆమెను వెతుకుతూ ఉంటాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

18వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

18వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో


18వ తేదీ గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. సముద్రం దగ్గర తులసి కనిపించకుండా పోతుంది. దీంతో సామ్రాట్ ఏడుస్తూ ఆమెను వెతుకుతూ ఉంటాడు. అంతలో ఆమె చేతిలో రెండు మొక్కజొన్న కంకులు తీసుకుని వస్తుంది. దీంతో ఆమెపై సామ్రాట్ ఓ రేంజ్‌లో ఫైర్ అవుతాడు. ఆ తర్వాత కూల్ అయిన అతడు సారీ అంటాడు. మరోవైపు, అంకిత.. ప్రేమ్, శృతి గురించి ఆలోచిస్తుంటుంది. అంతలో ఆమెకు ఆదిలాబాద్‌లో డ్యూటీ వేస్తారు. ఇక, తులసి, సామ్రాట్‌ను బీచ్‌లో చూసిన లాస్య వెటకారంగా మాట్లాడుతుంది. చివర్లో శృతికి కౌశల్య కొన్ని విలువైన సలహాలను ఇస్తుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

19వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

19వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో


19వ తేదీ శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. రెస్టారెంట్‌లో సామ్రాట్, తులసిని చూసిన నందూ రగిలిపోతూ ఉంటాడు. ఆ తర్వాత సామ్రాట్ పక్కకు వెళ్లగానే తులసి దగ్గరకు వెళ్లిన అతడు.. ఎన్నో రకాలుగా మాట్లాడి ఇబ్బంది పెడతాడు. ఆ తర్వాత తన గురించి సామ్రాట్‌కు చెప్పొద్దని తులసికి రిక్వెస్ట్ చేస్తాడు. అనంతరం సామ్రాట్, నందూ కొట్టుకున్నట్లు లాస్య ఊహించుకుని షాక్ అవుతుంది. ఇక, చివర్లో సామ్రాట్, నందూ ఫుల్లుగా మందు తాగి స్టేజ్ మీదకు వెళ్లి డ్యాన్స్ చేసి నవ్వులపాలు అవుతారు. అనంతరం వాళ్లను లాస్య, తులసి హోటల్‌కు తీసుకుని వస్తారు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

20వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

20వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో


20వ తేదీ శనివారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. హోటల్‌కు చేరుకున్న తర్వాత నందూ, సామ్రాట్ తాగిన మైకంలో చాలా ఓవర్ యాక్షన్ చేస్తారు. దీంతో తులసి పెరుగు కోసం, లాస్య రూమ్ తాళం కోసం కిందకు వెళ్తారు. ఆ సమయంలో అన్నా తమ్ముడు అంటూ నందూ సామ్రాట్ మాట్లాడుకుంటారు. అప్పుడు సామ్రాట్‌ తనకు తులసి అంటే ఇష్టమని చెప్తాడు. దీంతో నందూ తనను పెళ్లి చేసుకోవద్దని, ఆమె తన మాజీ భార్య అని చెప్తాడు. కానీ, సామ్రాట్ మాత్రం తెగిన గాలిపటం అంటూ ఏదేదో మాట్లాడతాడు. క్లయింట్లతో మీటింగ్‌కు తులసి వెళ్లి రావడంతో నందూ, లాస్య ఆమెపై ఫైర్ అవుతారు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

ఈ వారంలో హైలైట్ అయింది ఇదే

ఈ వారంలో హైలైట్ అయింది ఇదే


ఆగస్టు 15 నుంచి 20వ తేదీ వరకు సాగిన ‘ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎన్నో మలుపులతో చాలా ఆసక్తికరంగా సాగింది. ఈ వారం మొత్తంలో తులసి.. సామ్రాట్‌తో కలిసి వైజాగ్‌లో తెగ ఎంజాయ్ చేస్తుంది. అదే సమయంలో ఆమెకు ప్రమాదం జరిగిందని సామ్రాట్ భయపడిపోతాడు. ఇక, తాగిన మత్తులో సామ్రాట్ తులసిపై ప్రేమను బయటపెట్టగా.. నందూ కూడా అతడిని సరదాగానే హెచ్చరిస్తాడు. దీంతో తులసి, సామ్రాట్‌ మధ్య బంధం ఏ విధంగా సాగబోతుందో చూపించినట్లైంది. ఇక, పరందామయ్యకు హార్ట్ ఎటాక్ రావడంతో ఈ వారం సస్పెన్స్‌గా ముగిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X