Intinti Gruhalakshmi Weekly Roundup: లాస్యతో చేతులు కలిపిన అభి.. తులసి భూమి పూజ ఆగిపోయినట్లేనా!

చాలా భాషల కంటే తెలుగు బుల్లితెరపై సరికొత్త కంటెంట్‌తో చాలా రకాల సీరియళ్లు వస్తున్నాయి. అయితే, అందులో సుదీర్ఘ కాలం పాటు సత్తా చాటే సీరియళ్లు తక్కువగానే ఉంటున్నాయి. అందులోనూ కొన్ని మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఒకటి. తమిళ నటి కస్తూరి ప్రధాన పాత్రలో ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజురోజుకూ ఎన్నో మలుపులు తిరుగుతూ రసవత్తరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని అంతకంతకూ పెంచేస్తోంది. ఫలితంగా దీనికి ఆదరణ కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే ఆగస్టు 22 నుంచి 27వ తేదీ వరకు ఈ 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎలా సాగిందో మీరే చూడండి!

22వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

22వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

22వ తేదీ సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. తులసి మీటింగ్‌కు అటెంట్ అయి వచ్చిన తర్వాత సామ్రాట్‌కు ఫోన్ చేసిన క్లయింట్.. ప్రాజెక్టు ఓకే అయిందని చెప్తాడు. దీంతో అంతకు ముందే తులసిని అపార్థం చేసుకున్న సామ్రాట్‌తో పాటు నందూ, లాస్య కూడా ఆమెకు సారీ చెప్తారు. దీంతో ఆమె అందరికీ క్లాస్ పీకుతుంది. ఆ తర్వాత పరందామయ్యకు గుండెపోటు వస్తుంది. ఈ విషయాన్ని ప్రేమ్.. తులసికి ఫోన్ చేసి చెప్తాడు. దీంతో ఆమె సామ్రాట్ వాళ్లకు ఈ విషయం చెప్తుంది. అప్పుడు నందూ, లాస్య, సామ్రాట్ కూడా తులసి పాటే ఇంటికి తిరిగి వచ్చేస్తారు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

23వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

23వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

23వ తేదీ మంగళవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. పరందామయ్యను చూడ్డానికి వచ్చిన నందూ, లాస్యలు అనసూయను పక్కకు పిలిచి కొన్ని ఫొటోలను చూపిస్తారు. అందులో సామ్రాట్, తులసి సన్నిహితంగా ఉన్నది కనిపిస్తుంది. అప్పుడు అనసూయను నందూ భయపెట్టేలా మాట్లాడతాడు. దీంతో అనసూయ ఆలోచనలో పడుతుంది. మరోవైపు, హనీ పని వాళ్ల మీద నీళ్లు చల్లుతూ ఉంటుంది. అది చూసిన సామ్రాట్ హనీ మీద కోప్పడకుండా పాపతో కలిసి ఆడుకుంటాడు. ఇక, శృతి తిరిగి రావడంతో అందరూ సంతోషంగా ఉంటారు. కానీ వాళ్లు ఎవరికి వారులా ఉంటారు.

24వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

24వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

24వ తేదీ బుధవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. తులసి, సామ్రాట్ గురించి ఆర్టికల్ రావడంపై అభి, ప్రేమ్ గొడవ పడుతూ ఉంటారు. అప్పుడు ఇంట్లో వాళ్లంతా తులసికి సపోర్ట్ చేయగా.. అభి, అనసూయ మాత్రం తేడాగా మాట్లాడతారు. ఆ సమయంలోనే తులసి వస్తుంది. ఆ వెంటనే సామ్రాట్ కూడా వచ్చి ఆర్టికల్ గురించి తులసికి చెప్తాడు. కానీ, ఆమె మాత్రం లైట్ తీసుకుంటుంది. దీంతో ఇంట్లో వాళ్లందరూ షాక్ అయిపోతారు. కానీ, సామ్రాట్ మాత్రం ఆమె ప్రవర్తనకు ఫిదా అయిపోతాడు. ఆ తర్వాత తన బాబాయితో సామ్రాట్ తులసిపై ఉన్న అభిమానాన్ని బయట పెట్టుకున్నాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

25వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

25వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

25వ తేదీ గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. తులసి మీద అనుమానం వచ్చిన విషయాన్ని అనసూయ.. పరందామయ్యకు చెప్తుంది. దీంతో అతడు ఆమెకు విలువైన సలహాలు చెప్పి సర్ధి చెబుతాడు. ఆ తర్వాత పరందామయ్య సామ్రాట్ ఇంటికి వెళ్లి తులసిని అర్జెంటుగా రమ్మని ఫోన్ చేస్తాడు. దీంతో తులసి కంగారుగా అక్కడకు చేరుకుంటుంది. అక్కడ ఆమెకు మ్యూజిక్ స్కూలుకు సంబంధించిన ఇన్విటేషన్ కార్డును చూపించి సర్‌ప్రైజ్ చేస్తారు. అది చూసి తులసి తెగ సంతోషిస్తుంది. మరోవైపు, శృతి, ప్రేమ్ ఒకే రూములో ఉన్నా గొడవ పడి వేరు వేరుగా పడుకుంటారు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

26వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

26వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

26వ తేదీ శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. సామ్రాట్‌తో కలిసి స్వీట్ చేసిన తర్వాత తులసి ఇంటికి వెళ్లిపోతుంది. అప్పటికే అక్కడ నందూ, లాస్య ఉంటారు. అప్పుడు సామ్రాట్ ఇంటికి ఎందుకు వెళ్లావని తులసిని వాళ్లు ప్రశ్నిస్తారు. దీంతో పరందామయ్య నేనే తీసుకెళ్లానని అంటుంది. ఆ తర్వాత తులసి ఇన్విటేషన్ కార్డును అందరికీ చూపిస్తుంది. అప్పుడు అనసూయ శుభాకాంక్షలు చెప్పగా.. అభి మాత్రం కోపంతో ఊగిపోతాడు. సామ్రాట్ పేరు పక్కన తులసి పేరు ఉండడంతో కార్డును చించి పడేస్తాడు. ఇక, సామ్రాట్‌ను మళ్లీ పెళ్లి చేసుకోవాలని వాళ్ల బాబాయి ఒప్పిస్తాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

27వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

27వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

27వ తేదీ శనివారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. ఇంట్లో గొడవ జరిగిన తర్వాత ప్రేమ్, శృతి మధ్య రొమాంటిక్‌గా సంభాషణ జరుగుతుంది. ఆ సమయంలో శృతి వెళ్లిపోతానని అనగానే ప్రేమ్ ఆమెకు సారీ చెప్తాడు. అనంతరం అభికి ఫోన్ చేసిన లాస్య అతడిని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. అంతేకాదు, ఈ పూజను ఆపేందుకు ఓ ప్లాన్ కూడా అతడికి చెప్తుంది. హనీ, సామ్రాట్ రెడీ అవుతారు. ఇక, వాళ్లు భూమి పూజ జరిగే ప్రదేశానికి వస్తారు. కానీ, తులసి మాత్రం ఆలస్యంగా వస్తుంది. ఆ సమయంలో లాస్య.. తులసి, సామ్రాట్ మధ్య సంబంధం ఉన్నట్లు మాట్లాడుతుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

ఈ వారంలో హైలైట్ అయింది ఇదే

ఈ వారంలో హైలైట్ అయింది ఇదే

ఆగస్టు 22 నుంచి 27వ తేదీ వరకు సాగిన ‘ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలతో రసవత్తరంగా సాగింది. మొదట్లో లాస్య, నందూ కలిసి అనసూయకు తులసిపై అనుమానం కలిగేలా చేస్తారు. కానీ, పరందామయ్య మాటలతో ఆమె శాంతిస్తుంది. అనంతరం భూమి పూజకు ముహూర్తం ఫిక్స్ చేసి ఇన్విటేషన్ కార్డును సామ్రాట్ తులసికి ఇస్తాడు. అది చూసిన అభి.. సామ్రాట్ పేరు కింద నీ పేరు ఎందుకు ఉందని గొడవ చేస్తాడు. అంతేకాదు, ఆ కార్డును చించి పడేస్తాడు. ఆ తర్వాత లాస్యతో కలిసి అభి కన్నింగ్ ప్లాన్ వేస్తాడు. దీంతో భూమి పూజ జరుగుతుందా? లేదా? అన్నది వచ్చే వారానికి సస్పెన్స్‌గా ఉంచారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X