Intinti Gruhalakshmi Today Episode: తులసి కోసం అంకిత సాహసం.. లాస్యకు మేటర్ లీక్ చేసిన రంజిత్
తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే
మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. శృతి డబ్బులు తీసుకు రాలేదని గ్రహించిన ప్రేమ్ నిరాశ చెందుతాడు. ఆ సమయంలో అతడిని ఆమె ఓదార్చేలా మాట్లాడుతుంది. అంతేకాదు, తులసి పరిస్థితిని ఊహించుకుని బాధపడుతుంది. బ్యాంక్ లోన్ విషయంలో ఎలా మోసపోయా అన్న దానిపై తులసి పునరాలోచన చేస్తుంది. అప్పుడు మేనేజర్‌ను ఏజెంట్ రంజిత్ గురించి అడుగుతుంది. కానీ, అతడెవరో తమకు తెలీదని అంటాడు. అనంతరం లాస్య.. 20 లక్షలు తీసుకొచ్చి నందూకు ఇస్తుంది. దీంతో ఎక్కడివని అతడు ప్రశ్నించగా.. అబద్ధాలు చెబుతుంది.

భాగ్యను అనుమానించిన లాస్య
తనను మోసం చేసిన రంజిత్ జాడ కోసం తులసి అన్వేషిస్తుంది. ఇందుకోసం అతడు ఎక్కడ ఉంటాడో తెలుసుకుని ఆ ఇంటికి వెళ్తుంది. కానీ, అక్కడ ఎవరూ కనిపించరు. మరోవైపు, లాస్యతో భాగ్య చర్చలు జరుపుతుంది. అప్పుడు భాగ్య ఒకవేళ తులసికి తన డబ్బును కాజేసింది నువ్వే అని తెలిస్తే అప్పుడు ఏం చేస్తావు అని లాస్యను అడుగుతుంది. దీంతో లాస్య 'అసలు తులసికి ఈ విషయం ఎలా తెలుస్తుంది. నేను అయితే చెప్పను.. ఆ రంజిత్ గాడు కూడా చెప్పడు. ఇక చెబితే నువ్వే చెప్పాలి' అంటుంది. దీంతో భాగ్య టెన్షన్ పడుతూ నేను చెప్పను వదిలేయ్ అంటుంది.

తులసిపై కంప్లైంట్ చేసిన లాస్య
భాగ్యతో మాట్లాడిన తర్వాత లాస్య 'ఇప్పుడు చూడు తులసిఎలాంటి షాక్ ఇస్తానో' అంటుంది. ఆ వెంటనే బ్యాంక్ మేనేజర్‌కు ఫోన్ చేస్తుంది. అప్పుడు 'ఈ మధ్య తులసి అనే ఆవిడ మీ బ్యాంక్‌లో లోన్ తీసుకుంది కదా. ఆవిడ ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి లోన్ అప్లై చేసినట్లు మాకు తెలిసింది. మిమ్మల్ని అలర్ట్ చేయాలని చేస్తున్నాను. ఈ ఇన్‌ఫర్‌మేషన్ మీ వరకూ రావాలని ఇప్పుడు చెప్తున్నాను' అని అంటుంది. లాస్య తెలివి చూసి భాగ్య షాక్ అవుతుంది. ఆ తర్వాత 'వామ్మో ఈ లాస్యకు ఎన్ని తెలివితేటలు ఉన్నాయో' అని తన మనసులోనే అనుకుంటుంది.

తులసి క్రైమ్ చేసిందని చెప్పి
లాస్య కంప్లైంట్ చేయడంతో బ్యాంక్ అధికారులు తులసి ఇంటికి వస్తారు. దివ్య అక్కడే ఉంటుంది. తులసి గారి ఇల్లు ఇదేనా అని అడుగుతారు. దీంతో మామ్ ఇంట్లో లేదు అంటుంది. దీంతో మేము బ్యాంక్ నుంచి వచ్చాం అంటారు. అప్పుడామె లోపలికి తీసుకొస్తుంది. తర్వాత ఇంట్లో వాళ్లు మీరు వచ్చిన పని ఏంటి అని అడుగుతారు. దీనికి ఆ అధికారులు 'ఆమె సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేయడానికి వచ్చాం. ఆమె చీట్ చేసి బ్యాంక్ లోన్ తీసుకున్నారు. ఫేక్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి లోన్ తీసుకుంటే దాన్ని క్రైమ్ అంటారు' అని చెబుతారు.

షూరిటీ సైన్ చేసేసిన అంకిత
బ్యాంక్ అధికారులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుండడంతో అంకిత 'మా ఆంటిని ఒక్క మాట అనడానికి కూడా వీలు లేదు. ఆ 20 లక్షలకు నేను షూరిటీ ఇస్తాను' అంటుంది. దీంతో ఇక్కడ సైన్ చేయండి అని అంటారు. వాళ్లు చెప్పిన చోట సంతకం పెడుతుంది. తర్వాత ఇక.. చాలా అని అంటుంది. దీంతో ఆ బ్యాంక్ అధికారులు 'సైన్ చేయగానే సరిపోదు.. రెండు రోజుల్లో మాకు మ్యూజిక్ స్కూల్ చూపించాలి. లేదంటే మా 20 లక్షలు మాకు తిరిగి కట్టాలి. షూరిటీ ఇచ్చినందుకు ఆవిడ కట్టకపోతే మీరే ఆ డబ్బు కట్టాలి' అని చెప్పి అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోతారు.

సంతకం నిజం దాచిన అంకిత
బ్యాంక్ అధికారులు కారులో వెళ్లడం అప్పుడే ఇంటికి వస్తున్న తులసి చూస్తుంది. ఎవరు వచ్చారు అని అంకితను అడుగుతుంది. దీంతో ఆమె 'బ్యాంక్ అధికారులు వచ్చారు. మనం పెట్టింది ఫేక్ డాక్యుమెంట్స్ అని తెలిసింది. రెండు రోజుల్లో మ్యూజిక్ స్కూల్ చూపించాలని చెప్పారు. మీరైతే ఫ్రెష్ అయి రండి.. తర్వాత ఆ విషయాల గురించి మాట్లాడుకుందాం' అని చెప్పి తులసిని ఇంట్లోకి పంపిస్తుంది. తర్వాత 'నేను షూరిటీగా సంతకం పెట్టినట్టు తులసి ఆంటికి ఏమాత్రం తెలియకూడదు' అని అందరికీ చెప్పి అసలు నిజాన్ని తులసి ముందర దాచేస్తోంది.

షూరిటీ గురించి లాస్యకు ఫోన్
లాస్య తీసుకొచ్చిన ఇచ్చిన 20 లక్షలు డబ్బు తీసుకెళ్లి నందూ, లాస్య ఆఫీసు కోసం అడ్వాన్స్ అమౌంట్ ఇస్తారు. అప్పుడు నందూ అగ్రిమెంట్ చేయిద్దామా అని అడుగుతాడు. దీనికి అతడు 'ఇవాళ వద్దు.. ఎల్లుండి బాగుందంట. ఆరోజు చేయిద్దాం' అంటాడు. దీంతో వాళ్లిద్దరూ అక్కడి నుంచి వెళ్తారు. ఇంతలో లాస్యకు రంజిత్ ఫోన్ చేసి 'ఈరోజు బ్యాంక్ వాళ్లు తులసి గారి ఇంటికి వెళ్లారు. అయితే, ఆమె డబ్బులకు అంకిత.. షూరిటీ సంతకం పెట్టింది' అని చెబుతాడు. దీంతో లాస్య వెంటనే ఈ విషయం గాయత్రికి చెప్పాలి అని తన మనసులో అనుకుంటుంది.
Recommended Video


అంకిత ప్రపోజల్‌కు తులసి నో
20 లక్షల గురించే ఆలోచిస్తూ తులసి ధీనంగా కూర్చుని ఉంటుంది. అప్పుడు అంకిత ఆమె దగ్గరకు వెళ్తుంది. అంతేకాదు, ఒక ఇరవై లక్షలు అప్పుగా తీసుకుందామని తులసికి సలహా ఇస్తుంది. కానీ, తులసి మాత్రం ఎవరి దగ్గర తీసుకుందాం అని అడుగుతుంది. దీనికామె ఎవరో కాదు.. నేనే అప్పు ఇస్తాను అని చెబుతుంది. దీంతో తులసి ఒప్పుకోకపోగా.. అంకితను ఆ విషయం నుంచి డైవెర్ట్ చేసేస్తోంది. దీంతో మీరు నా మాట ఎందుకు వినరు అని ప్రశ్నిస్తుంది. అప్పుడు తులసి 'నీ భర్త సంపాదించిన డబ్బు అయితే అది నీది అవుతుంది కానీ.. ఇది కాదు. నాకు ఆ డబ్బు వద్దు. ఆ డబ్బు నేను తీసుకోలేను. నా పరిష్కారం నేను వెతుక్కుంటాను' అంటుంది. దీంతో అంకితకు ఏం చేయాలో అర్థం కాదు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











