Intinti Gruhalakshmi Today Episode: నందూ ముందే షాకింగ్ సీన్.. తులసిని పట్టుకున్న సామ్రాట్
ఇండియన్ టెలివిజన్ హిస్టరీలోనే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేద్దాం మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే
మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తులసి కోరిక మేరకు ఇంటికి తిరిగి వచ్చిన అభి.. అంకితను కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తాడు. ఆ తర్వాత ప్రేమ్ కూడా అక్కడకు చేరుకుంటాడు. అప్పుడతను శృతి గురించి వాళ్లకు అబద్ధం చెప్తాడు. ఇక, సంగీతం నేర్చుకునేందుకు వచ్చిన హనీ.. తనకు కృష్ణుడి వేషం వేయమని తులసికి రిక్వెస్ట్ చేస్తుంది. మరోవైపు, శృతి.. ప్రేమ్ కోసం ఇంటికి వెళ్లగా అతడు కనిపించడు. అప్పుడు వాళ్ల అత్త వచ్చి ఆమె మనసు మార్చి తీసుకెళ్తుంది. ఇక, హనీకి వేషం వేసేందుకు తులసి.. సామ్రాట్ ఇంటికి రాగా.. అక్కడ లాస్య, నందూ ఉంటారు.

తులసిని ఒప్పించేసిన సామ్రాట్
పిల్లల వేషధారణ పోటీల్లో హనీకి సహాయం చేసేందుకు వచ్చిన తులసిని డ్యాన్స్ కూడా నేర్పించమని సామ్రాట్ కోరుకుంటాడు. దీనికి తులసి తనకు డ్యాన్స్ చేయడం అస్సలు రాదని అంటుంది. అయినప్పటికీ సామ్రాట్ అడుగుతూనే ఉంటాడు. అప్పుడు వాళ్ల బాబాయ్ 'మా సామ్రాట్‌కు కూడా డ్యాన్స్ తెలుసమ్మా. నువ్వు హనీకి నేర్పించు. నీకు మావాడు సహాయం చేస్తాడు. ఒప్పుకోవమ్మా' అని అడుగుతాడు. దీంతో తులసి తప్పక ఒప్పుకుంటుంది. ఆ సమయంలో అక్కడే ఉన్న లాస్య.. లేనిపోని మాటలతో నందూకు కోపం తెప్పించే ప్రయత్నం చేస్తుంది.

అంకిత ప్రవర్తన చూసి షాకైన అభి
తులసి ఇంటికి వచ్చిన అభి.. అంకితను తనతో తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తాడు. ఇందులో భాగంగానే ఆమె మనసును మార్చే ప్రయత్నం చేస్తాడు. ఆ సమయంలో 'నీ మీద ప్రేమను చంపులేకనే నీకోసం ఇక్కడకు వచ్చేశా. నువ్వు నాకు మాత్రం దూరంగా ఉంటున్నావు. ఎప్పుడూ మా మామ్ వెనకే తిరుగుతున్నావు. నా మీద నమ్మకం కలగట్లేదా' అని అడుగుతాడు. దీనికి అంకిత 'నిన్ను నమ్మకపోతే అందరినీ వదిలేసి వచ్చేదానినా. కానీ ఇప్పుడు నీలో నాకు మార్పు కనిపించడం లేదు. అది వచ్చినట్లు నాకు అనిపిస్తే నీతోనే ఉంటాను' అంటుంది.

అభికి సలహాలు ఇచ్చిన తమ్ముడు
అంకితతో మాట్లాడి వస్తున్న అభికి ప్రేమ్ కొన్ని సూచనలు ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. 'ఒక్కసారి ఆడవాళ్ల ప్రేమను దూరం చేసుకుంటే ఇలాగే ఉంటుంది అన్నయ్యా' అంటాడు. అప్పుడు అభి 'బంగారం బురదలో పడితే వదులుకుంటారా? కడిగి తీసుకుని దాచుకోరా? పొరపాటు జరిగిందని దాన్నే మనసులో పెట్టుకుని భర్త ప్రేమను వదులుకుంటారా? దాన్నే నువ్వు సమర్థిస్తున్నావా? ఎక్కడైనా చదివింది చెబుతున్నావా? లేక అనుభవించింది చెబుతున్నావా?' అని వెళ్లిపోతాడు. ఆ తర్వాత ప్రేమ్ అనుభవం మీదే చెబుతున్నాను అన్నయ్యా అంటాడు.

అనుకోకుండా పట్టుకున్న సామ్రాట్
హనీకి తులసి భజరే నందగోపాల హరే పాటకు డాన్స్ నేర్పిస్తుంది. ఆ సమయంలో లాస్య.. తులసిని, సామ్రాట్‌ను కలుపుతూ కామెంట్లు చేస్తుంది. దీంతో నందూ వెళ్తాను అని అంటాడు. అప్పుడు సామ్రాట్ మా హనీ డాన్స్ చూడకుండా వెళ్లిపోతారా? కాసేపు ఉండండి అంటాడు. దీనికి లాస్య లేదు లేదు సార్ ఇక్కడ ఇంత డ్రామా జరుగుతుంటే మేము ఎలా వెళ్తాము అంటుంది. ఆ తర్వాత తులసి డాన్స్ చేస్తుండగా వెళ్లి సామ్రాట్‌కు తగిలి పడిపోబోతుంది. దీంతో వెంటనే అతడు పట్టుకుంటాడు. అప్పుడు లాస్య.. నందూను చూస్తూ ఇదంతా అనుకోకుండా జరిగిందా అంటుంది.

లాస్య డబుల్ మీనింగ్ డైలాగులు
డ్యాన్స్ నేర్పించిన తర్వాత సామ్రాట్ 'పాపకు మీరు ఈరోజు చాలా హెల్ప్ చేశారు. అందుకే రేపు మీరు కూడా రండి' అని తులసిని రిక్వెస్ట్ చేస్తాడు. దీనికామె రాను అని అంటుంది. అప్పుడు సామ్రాట్ 'చూడు హనీ ఈరోజు మీకోసం తులసి ఆంటీ వచ్చింది కదా.. రేపు చాలా ఇంపార్టెంట్ పని ఉండి ఉంటుంది. అందుకే రాను అంటుంది' అని చెప్తాడు. అప్పుడు లాస్య 'ఈరోజు వచ్చినందుకు చాలా గిట్టుబాటు అయినట్టుంది. తను ఎక్కడ ఉన్నా తన మనసంతా ఇక్కడే ఉంటుంది' అని డబల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుతుంది. కానీ తులసి మౌనంగానే ఉంటుంది.

నందూను రెచ్చగొట్టేందుకు లాస్య
ఆ తర్వాత సామ్రాట్ వాళ్ళ బాబాయ్ హనీకి వాళ్ళ అమ్మ లేదు కదా అనుకోకుండా మీకు దగ్గర అయింది అంటాడు. అప్పుడు లాస్య 'చూశావా ఇంట్లో వాళ్ళందరూ ఏకమై తులసిని ఇంటికి దగ్గర చేయాలి అని అనుకుంటారు' అని నందూ పక్కన చేరి గుసగుసలాడుతూ ఉంటుంది. అప్పుడు తులసి మాత్రం 'ఈ ఇంటికి ఎంత దూరం అవ్వాలని నేను ఆలోచిస్తుంటే దగ్గర చేస్తున్నాడు ఆ దేవుడు' అని మనసులో అనుకుంటుంది. ఆ తర్వాత సరే అని అంటుంది. దీంతో లాస్య 'పక్కనున్న నీ భార్య కంటే వదిలేసిన నీ మాజీ భార్య మీద నీకు ప్రేమ ఎక్కువగా ఉంది' అంటుంది.

లక్కీని చూసి షాకైపోయిన తులసి
తర్వాతి రోజే అందరూ కాంపిటీషన్‌కు వెళ్తారు. అప్పుడు అందరూ వాళ్ళ స్టూడెంట్స్‌ను తీసుకుని వస్తారు. అలాగే లాస్య, నందూ కలిసి లక్కీని తీసుకుని వస్తుండగా.. అక్కడ తులసిని చూసి షాక్ అవుతారు. అప్పుడు లాస్య 'పెద్ద ముత్తైదువ పేరంటానికి రెడీ అయ్యి వచ్చింది చూడు' అని నందూతో చెప్తుంది. అనంతరం తులసి హానిని రెడీ చేస్తుంది. అందరూ బాగుందని అంటారు. హానికి తప్పకుండా ఫస్ట్ వస్తుంది అని సామ్రాట్ అంటాడు. ఆ తర్వాత తన పాప గురించి తులసికి ఎన్నో మాటలు చెప్తాడు. అప్పుడే లక్కీ వచ్చి తులసిని భయపెడతాడు. ఆ తర్వాత తులసి లక్కీని దగ్గరకు తీసుకుని మాట్లాడుతుంది. కాంపిటీషన్‌లో ఎలా ఉండాలో చెప్తుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











