గృహలక్ష్మి కస్తూరి ఓవర్ గ్లామర్ షో: అర్ధరాత్రి అలాంటి సెల్ఫీలతో అరాచకం
సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత అప్పట్లో పద్దతిగా కనిపించిన సీనియర్ హీరోయిన్లు సైతం.. ఇప్పుడు అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోన్నారు. తద్వారా ఇప్పటికీ ఫాలోయింగ్‌ను పెంచుకుంటూ, ఆఫర్లను అందుకుంటున్నారు. అలాంటి వారిలో సీనియర్ హీరోయిన్ కస్తూరి శంకర్ ఒకరు. 90వ దశకంలో సౌత్ సినిమాల్లో సత్తా చాటిన ఈ భామ.. ఇప్పుడు బుల్లితెరపై గృహలక్ష్మిగా సందడి చేస్తోంది. అలాగే, కొన్ని సినిమాల్లోనూ నటిస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. తాజాగా కొన్ని ఘాటు ఫొటోలు వదిలింది. అవి మీకోసమే!
సౌత్‌లో ఫుల్ పాపులారిటీ: మోడల్‌గా తనదైన అందాలతో అలరించిన కస్తూరి అప్పట్లోనే మిస్ చెన్నైగా ఎంపికైంది. ఆ తర్వాత 'ఆతా ఉన్ కోయిలిలే' అనే తమిళ చిత్రంతో నటిగా కెరీర్‌ను ప్రారంభించింది. ఆ వెంటనే 'చక్రవర్తి' అనే చిత్రంతో మలయాళంలోకి, 'గ్యాంగ్ వార్' అనే సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత కన్నడంలోనూ నటించి సౌత్ ఇండియా మొత్తంలో పాపులర్ అయింది.

వరుస సినిమాలతో బిజీ: హీరోయిన్‌గా మొదలైన కొత్తలోనే దక్షిణాది మొత్తంలో హవాను చూపించిన కస్తూరి.. వరుసగా మరిన్ని ఆఫర్లను సొంతం చేసుకుంది. ఇలా దాదాపు ఇరవై ఏళ్లకు పైగానే అన్ని భాషల్లోనూ తనదైన రీతిలో సందడి చేస్తూ ఫుల్ బిజీగా గడిపింది. ఈ క్రమంలోనే ఎన్నో విజయాలను కూడా ఖాతాలో వేసుకుంది. అదే సమయంలో నేషనల్ రేంజ్‌లో గుర్తింపును దక్కించుకుని సత్తా చాటింది.
గృహలక్ష్మిలా సందడిగా: దాదాపు రెండు దశాబ్దాలకు పైగానే సినిమాల్లో సందడి చేసిన కస్తూరి.. బుల్లితెరపైకి సైతం ఎంట్రీ ఇచ్చి చాలా సీరియళ్లు చేసింది. ప్రస్తుతం స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి'లో లీడ్ రోల్ చేస్తోంది. దీని ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇక, ఈ సీరియల్ కూడా భారీ స్థాయిలో టీఆర్పీని సాధించింది. అయితే, ఇటీవలే కాస్త డౌన్ అయింది.

ఆ రోల్స్‌లో.. కాంట్రవర్శీ: కస్తూరికి ప్రస్తుతం 49 సంవత్సరాలు. అందుకు అనుగుణంగానే ఈ భామ ఈ మధ్య కాలంలో అన్ని భాషల్లోనూ ఏజ్‌కు తగ్గ పాత్రలను పోషిస్తోంది. ఇందులో భాగంగానే 'గాడ్ ఫాదర్' మూవీలో చిరంజీవికి తల్లిగా నటించింది. మరోవైపు, ఈ హీరోయిన్ తరచూ ఏదో ఒక కాంట్రవర్శీ కామెంట్ చేస్తూ వివాదాల్లో చిక్కుకుంటోంది. తద్వారా దేశ వ్యాపత్ంగా సంచలనం అయిపోతోంది.
అక్కడ యమ యాక్టివ్‌గా: దాదాపు రెండు, మూడు దశాబ్దాలుగా పెట్టి సినిమాలు, సీరియళ్లు, షోలు చేస్తూ ఫుల్ బిజీగా గడిపిన కస్తూరి శంకర్ సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను, విశేషాలను పంచుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను వదులుతోంది. ఇలా ఇప్పటికీ తన ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది.
అందాల ప్రదర్శనతోనే: సోషల్ మీడియాలో తనదైన రీతిలో ఓ రేంజ్‌లో రచ్చ చేస్తోన్న సీనియర్ హీరోయిన్ కస్తూరి.. తరచూ తన అందాలను చూపిస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు ఆ మధ్య టాప్ లేకుండా దిగిన ఫొటోలతో షాకిచ్చింది. అంతేకాదు, తరచూ హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. తద్వారా కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోకుండా క్రేజ్ పెంచుకుంటోంది.

కస్తూరి బోల్డ్ పిక్స్ వైరల్: కస్తూరి శంకర్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని సెల్ఫీలను షేర్ చేసింది. అర్ధరాత్రి వీటిని తీసుకున్నానని చెబుతూ అందాలను ఆరబోస్తూ ఫోజులు ఇచ్చింది. దీంతో ఆమె పరువాలు భారీ స్థాయిలో కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. ఫలితంగా ఇవి చాలా తక్కువ సమయంలోనే వైరల్‌గా మారిపోయాయి.


Click it and Unblock the Notifications











