Kasthuri Shankar: దుల్కర్‌కు జరిగినట్లే తనకు జరిగిందంటూ.. గృహలక్ష్మి కస్తూరి షాకింగ్ కామెంట్స్

ఒకప్పటి సీనియర్ హీరోయిన్ కస్తూరి శంకర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. భారతీయుడు సినిమాలో కమల్ హాసన్ చెల్లిగా నటించి.. మెప్పించింది. ఆ తర్వాత నాగార్జున అన్నమయ్య సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది. పలు సినిమాల్లో నటించిన ఈ భామ... ప్రస్తుతం గృహలక్ష్మి సీరియల్ లో నటిస్తూ... వివాదాస్పద పోస్టులు చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. ఇక తాజాగా ఓ ఇంటర్వూలో పాల్గొన్న ఈ భామ... తనకు జరిగిన చేదు అనుభవాన్ని పంచుకుంది. ఆ వివరాల్లోకి వెళితే...

సీనియర్ హీరోయిన్, సీరియల్ ఆర్టిస్టు కస్తూరి శంకర్ సోషల్ మీడియాలో తన ఫాలోయింగ్‌ ను పెంచుకుంటూ, ఆఫర్లను అందుకుంటున్నారు. 1990వ దశకంలో సౌత్ సినిమాల్లో సత్తా చాటిన ఈ భామ.. ఇప్పుడు బుల్లితెరపై గృహలక్ష్మి సీరియల్ గా సందడి చేస్తోంది. అలాగే, కొన్ని సినిమాల్లోనూ నటిస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో యాక్టివ్‌ గా ఉంటూ ఎప్పటికప్పడు ఫోటోస్ షేర్ చేస్తూ ఉంటుంది.

 Kasthuri Shankar

అయితే ఈ ఇటీవల దుల్కర్ కు జరిగినట్లే తనకు జరిగిందంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది కస్తూరి. ఎప్పుడూ వివాదాస్పద కామెంట్స్ చేసే కస్తూరి.. ఈ సారి తన చేదు అనుభవం గురించి ఓ ఇంటర్యూలో చెప్పుకొచ్చింది. అయితే దుల్కర్ ఇటీవల కింగ్ ఆఫ్ కోత సినిమా ప్రమోషన్స్ లో తనకు జరిగిన ఒక సంఘటన బయట పెట్టిన విషయం తెలిసిందే.

ఓ పెద్దావిడ తనని అసభ్యకరంగా టచ్ చేసిందని... చాలా నొప్పి కూడా పుట్టింది అంటు సంచలన వ్యాఖ్యలు చేశారు దుల్కర్ సల్మాన్. అయితే తాజాగా సీనియర్ నటి అయినా కస్తూరి కూడా ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్నట్లు తెలిపింది. ఒకప్పుడు హీరోయిన్ అయినా కన్నడ నటి కస్తూరి... ప్రస్తుతం బుల్లితెరపై గృహలక్ష్మి అనే సీరియల్ లో నటిస్తోంది.

 Kasthuri Shankar

కస్తూరి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఓసారి ఒక ప్రముఖ సంస్థ సెలబ్రిటీలందరిని పిలిచి ఒక పెద్ద ఈవెంట్ జరిగింది. అందులో చాలామంది సెలబ్రిటీలతో పాటు నేను కూడా పాల్గొన్నానని తెలిపింది. ఇక ఆరోజు మా నాన్న కూడా నాతో ఉన్నారన్న కస్తూరి... ఇక ఆ ఈవెంట్ ముగిసాక బయటికి వెళ్లే టైంలో చాలామంది సెలబ్రిటీలను చూడడానికి జనాలు తరలివచ్చారు. ఇక ఆ సమయంలో ఓ వ్యక్తి తనను వెనుక నుండి గట్టిగా నొక్కినట్లు వెల్లడించింది.

 Kasthuri Shankar

దీనితో కస్తూరి వాడి చేతులు పట్టుకొని టక్కున ముందుకి లాగిందంట. ఇక అందరిలో వాడిని పట్టుకొని రెండు కొట్టేసరికి సారీ అక్క సారీ అంటూ గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడని చెప్పుకొచ్చింది. కానీ అలాంటి పనులు చేయడం ఎందుకు తర్వాత అక్క అనడం ఎందుకు అని వాడిని ఎడాపెడా తిట్టేశాను అని చెప్పుకొచ్చింది. ఇక తనపై వస్తున్న కామెంట్స్ పై కూడా స్పందించింది. అలా వ్యక్తిగతంగా కామెంట్స్ చేయొద్దంటూ హితవు పలికింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X