50 ఏళ్ల ఏజ్‌లో పైట తీసేసిన గృహలక్ష్మి కస్తూరి: ఎగసిపడుతోన్న అందాలతో అరాచకంగా!
చిత్ర పరిశ్రమలో సుదీర్ఘ కాలం పాటు సందడి చేసి సత్తా చాటిన వారిలో కొందరు మాత్రమే ఇప్పటికీ హైలైట్ అవుతున్నారు. అలాంటి వారిలో సీనియర్ హీరోయిన్ కస్తూరి శంకర్ ఒకరు. ఒకప్పుడు సౌత్ ఇండియా మొత్తంలో ఎన్నో సినిమాలు చేసిన ఈ చిన్నది.. ఈ మధ్య కాలంలోనూ అవకాశాలను బాగానే ఉంటోంది.
అలాగే, సోషల్ మీడియాలో విపరీతంగా యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే ఎన్నో వివాదాల్లో చిక్కుకోవడంతో పాటు అందాలను ఆరబోస్తోంది. ఇలా తాజాగా కస్తూరి కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. లేట్ లేకుండా వాటిని మీరే చూసేయండి మరి!

అన్ని భాషల్లో పాపులర్
ఆరంభంలోనే అందంతో మాయ చేసిన కస్తూరి అప్పట్లోనే మిస్ చెన్నైగా ఎంపిక అయింది. ఆ తర్వాత 'ఆతా ఉన్ కోయిలిలే' అనే తమిళ చిత్రంతో నటిగా కెరీర్‌ను మొదలెట్టింది. ఆ వెంటనే 'చక్రవర్తి' అనే చిత్రంతో మలయాళంలోకి, 'గ్యాంగ్ వార్' అనే సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత కన్నడంలోనూ నటించి సౌత్ ఇండియాలో పాపులారిటీని అందుకుంది.

వరుస చిత్రాలతో క్రేజ్
హీరోయిన్‌గా ప్రయాణం మొదలు పెట్టిన కొత్తలోనే దక్షిణాది మొత్తంలో హవాను చూపించిన కస్తూరి.. వరుసగా మరిన్ని ఆఫర్లను సొంతం చేసుకుంది. ఇలా దాదాపు ఇరవై ఏళ్లకు పైగానే అన్ని భాషల్లోనూ తనదైన రీతిలో సందడి చేస్తూ ఫుల్ బిజీగా గడిపింది. ఈ క్రమంలోనే ఎన్నో విజయాలను కూడా ఖాతాలో వేసుకుంది. అదే సమయంలో నేషనల్ రేంజ్‌లో గుర్తింపును దక్కించుకుంది.

గృహలక్ష్మిలా సందడి
సుదీర్ఘ కాలం పాటు సినిమాల్లో హీరోయిన్‌గా సందడి చేసిన కస్తూరి.. బుల్లితెరపైకి సైతం ఎంట్రీ ఇచ్చి చాలా సీరియళ్లు చేసింది. ఈ క్రమంలోనే స్టార్ మాలో ప్రసారం అయిన 'ఇంటింటి గృహలక్ష్మి'లో లీడ్ రోల్ చేసింది. దీని ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇక, ఈ సీరియల్ కూడా భారీ స్థాయిలో టీఆర్పీని సాధించింది. అయితే, ఇటీవలే ఇది అయిపోయింది.
ఆ రోల్స్‌లో.. వివాదాలే
కస్తూరికి ప్రస్తుతం 50 సంవత్సరాలు. అందుకు తగ్గట్లుగానే ఈ భామ ఈ మధ్య కాలంలో అన్ని భాషల్లోనూ వయసుకు తగ్గ పాత్రలను పోషిస్తోంది. ఇందులో భాగంగానే 'గాడ్ ఫాదర్' మూవీలో చిరంజీవికి తల్లిగా చేసింది. మరోవైపు, ఈ హీరోయిన్ తరచూ ఏదో ఒక కాంట్రవర్శీ కామెంట్ చేస్తూ వివాదాల్లో చిక్కుకుంటోంది. తద్వారా దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిపోతోంది.
అక్కడ యమ యాక్టివ్
కెరీర్ మొదలైనప్పటి నుంచి వరుస పెట్టి సినిమాలు, సీరియళ్లు, షోలు చేస్తూ ఫుల్ బిజీగా గడిపిన కస్తూరి శంకర్ సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను, విశేషాలను పంచుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను వదులుతోంది. ఇలా ఇప్పటికీ తన క్రేజ్‌ను పెంచుకుంటూ వెళ్తోంది.

అందాల ప్రదర్శనతో
సోషల్ మీడియాలో ఎవరూ ఊహించని రీతిలో రచ్చ లేపుతోన్న సీనియర్ హీరోయిన్ కస్తూరి.. తరచూ తన అందాలను చూపిస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు ఆ మధ్య టాప్ లేకుండా దిగిన ఫొటోలతో షాకిచ్చింది. అంతేకాదు, తరచూ హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. తద్వారా కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోకుండా సెన్సేషన్ అవుతోంది.
కస్తూరి ఫొటోలు వైరల్
తాజాగా కస్తూరి శంకర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె పైటను తీసేసి మరీ అందాలను ఆరబోస్తూ ఫోజులు ఇచ్చింది. దీంతో ఆమె పరువాలు భారీ స్థాయిలో ఎగసిపడుతూ కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది. ఫలితంగా ఇవి చాలా తక్కువ సమయంలోనే వైరల్ అయిపోయాయి.


Click it and Unblock the Notifications











