Kasthuri Shankar: బికినీలో గృహలక్ష్మి హీరోయిన్ కస్తూరి.. 48 ఏళ్ల వయసులో ఘాటుగా.. వీడియో వైరల్
గతంలో సినీ నటీమణులు ఆఫర్లతో బిజీగా ఉంటేనే హైలైట్ అవుతూ ఉండేవారు. కానీ, ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి రావడంతో ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దీని ద్వారా ఫేడౌట్ అయిన ఎంతో మంది హీరోయిన్లు కూడా ఇప్పటికీ ప్రభావాన్ని చూపించే స్థాయికి చేరుతోన్నారు. అందులో సీనియర్ హీరోయిన్ కస్తూరి ఒకరు. చాలా కాలం క్రితమే సినిమాల్లోకి వచ్చిన ఈ భామ.. ఇప్పుడు తెలుగు బుల్లితెరపై తెగ సందడి చేస్తోంది. అలాగే అడపాదడపా ఆఫర్లను సొంతం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా కస్తూరి ఓ హాట్ వీడియోను షేర్ చేసింది. దానిపై మీరూ ఓ లుక్కేయండి మరి!

అలా ఎంటర్.. ఫుల్ పాపులర్
మోడలింగ్ రంగంలో సత్తా చాటుతోన్న సమయంలోనే కస్తూరి మిస్ చెన్నైగా ఎంపికైంది. ఆ తర్వాత 'ఆతా ఉన్ కోయిలిలే' అనే తమిళ చిత్రంతో నటిగా పరిచయమైంది. ఆ వెంటనే 'చక్రవర్తి' అనే మలయాళ చిత్రంలో నటించింది. ఈ క్రమంలోనే 'గ్యాంగ్ వార్' అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి వచ్చింది. ఆ తర్వాత కన్నడ ఇండస్ట్రీలోకి కూడా ఈ అమ్మడు అడుగు పెట్టింది.

వరుస సినిమాలతో సందడి
హీరోయిన్‌గా పరిచయమైన తక్కువ సమయంలోనే దక్షిణాది మొత్తంలో సత్తా చాటిన కస్తూరి.. వరుసగా ఎన్నో అవకాశాలను సొంతం చేసుకుంది. ఇలా దాదాపు ఇరవై ఏళ్లకు పైగానే చేతి నిండా చిత్రాలతో ఫుల్ బిజీగా మారిపోయింది. ఈ క్రమంలోనే ఎన్నో విజయాలను కూడా ఖాతాలో వేసుకుంది. దీంతో తన ఫాలోయింగ్‌ను దేశ వ్యాప్తంగా ఏర్పరచుకుని సత్తా చాటుకుంది.

ఆ సీరియల్‌తో సెన్సేషన్‌గా
దాదాపు రెండు దశాబ్దాలకు పైగానే హీరోయిన్‌గా సందడి చేసిన కస్తూరి.. బుల్లితెరపైకి సైతం ఎంట్రీ ఇచ్చి పలు సీరియళ్లలో నటించింది. ప్రస్తుతం స్టార్ మాలో వస్తున్న 'ఇంటింటి గృహలక్ష్మి'లో లీడ్ రోల్ చేస్తోంది. అలాగే, గతంలో తమిళ బిగ్ బాస్ మూడో సీజన్‌లో కంటెంస్టెంట్‌గా వచ్చి సత్తా చాటింది. ఆ తర్వాత కూడా ఎన్నో షోలలో భాగం అవుతూ ప్రేక్షకులను అలరిస్తోంది.

అలాంటి రోల్స్.. వివాదాలు
ప్రస్తుతం కస్తూరికి 48 సంవత్సరాలు. అందుకు తగ్గట్లుగానే ఈ భామ కొంత కాలంగా అన్ని భాషల్లోనూ ఏజ్‌కు తగ్గ పాత్రలు చేస్తోంది. ఇటీవలే 'గాడ్ ఫాదర్' మూవీలో చిరంజీవికి తల్లిగా చేసింది. మరోవైపు, ఈ సీనియర్ హీరోయిన్ తరచూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంటోంది. దీంతో ఈ మధ్య కాలంలోనే కస్తూరి దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోయింది.

సోషల్ మీడియాలో సందడి
చాలా కాలం పాటు సినిమాల మీద సినిమాలు, సీరియళ్లు, షోలు చేస్తూ ఫుల్ బిజీగా గడిపిన కస్తూరి సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. ఇలా ఇప్పటికీ తన ఫాలోయింగ్‌ను పెంచుకుంటూనే ముందుకు సాగుతోంది.
అప్పుడప్పుడూ హాట్ ట్రీట్
సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా ఓ రేంజ్‌లో రచ్చ చేస్తోన్న సీనియర్ హీరోయిన్ కస్తూరి.. తరచూ తన ఫిగర్‌ను చూపిస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు ఆ మధ్య టాప్ లెస్ ఫొటోలతో షాకిచ్చింది. అంతేకాదు, హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. తద్వారా లేటు వయసులోనూ కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోనని నిరూపించుకుంటోంది.

కస్తూరి హాట్ వీడియో వైరల్
క్రేజీ సీనియర్ హీరోయిన్ కస్తూరి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఆమె స్విమ్మింగ్ పూల్‌లో బికినీలో హాట్ షో చేస్తోంది. దీంతో ఆమె అందాలు భారీ స్థాయిలో కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ వీడియోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది. ఫలితంగా ఇది చాలా తక్కువ సమయంలోనే భారీ స్థాయిలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











