గృహలక్ష్మి కస్తూరికి ప్రాణాంతక వ్యాధి: బాడీ మొత్తం సోకడంతో.. ఇక సీరియల్‌లో కనిపించదా!
ఒకప్పుడు వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించిన ఎంతో మంది హీరోయిన్లు.. ఇప్పుడు బుల్లితెరపైన కూడా సందడి చేస్తోన్నారు. అలాంటి వారిలో కోలీవుడ్ నటి కస్తూరి శంకర్ ఒకరు. దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ సినిమాలు చేసిన ఈ భామ.. ఇప్పుడు స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న సూపర్ హిట్ సీరియల్ 'ఇంటింటి గృహలక్ష్మి'లో లీడ్ రోల్ చేస్తూ మెప్పిస్తోంది. ఇలా మరికొన్ని ఆఫర్లతోనూ ఫుల్ బిజీగా గడుపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా కస్తూరి ఓ ప్రాణాంతకమైన వ్యాధి బారిన పడింది. అసలేం జరిగిందో మీరే చూడండి!

అలా వచ్చి.. యమ ఫేమస్
చిన్న వయసులోనే కస్తూరి మిస్ చెన్నైగా ఎంపికైంది. దీంతో ఆమెకు సినిమా అవకాశాలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే 'ఆతా ఉన్ కోయిలిలే' అనే తమిళ చిత్రంతో నటిగా పరిచయమైంది. ఆ వెంటనే 'చక్రవర్తి' అనే మలయాళ చిత్రంలో నటించింది. ఈ క్రమంలోనే 'గ్యాంగ్ వార్' అనే సినిమాతో తెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత కన్నడ చిత్రాల్లోనూ నటించి ఫేమస్ అయింది.

వరుస చిత్రాలతో సందడి
సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అనతి కాలంలోనే కస్తూరి దక్షిణాది మొత్తం గుర్తించే స్థాయికి ఎదిగిపోయింది. దీంతో ఆమెకు మరిన్ని అవకాశాలు వచ్చాయి. ఇలా దాదాపు ఇరవై ఏళ్లకు పైగానే చేతి నిండా చిత్రాలతో ఫుల్ బిజీగా మారిపోయింది. ఈ క్రమంలోనే ఎన్నో విజయాలను కూడా ఖాతాలో వేసుకుంది. దీంతో తన ఫాలోయింగ్‌ను దేశ వ్యాప్తంగా ఏర్పరచుకుని మరిన్ని చిత్రాలు చేసింది.

ఆ సీరియల్‌తో తెలుగింట్లో
హీరోయిన్‌గా దాదాపు రెండు దశాబ్దాలకు పైగానే హవాను చూపిన కస్తూరి.. బుల్లితెరపైకి సైతం ఎంట్రీ ఇచ్చి పలు సీరియళ్లలో నటించింది. ప్రస్తుతం స్టార్ మాలో వస్తున్న 'ఇంటింటి గృహలక్ష్మి'లో లీడ్ రోల్ చేస్తోంది. ఇందులో తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేస్తోంది. ఫలితంగా ఈ సీరియల్‌కు భారీ స్థాయిలో స్పందన వచ్చి.. అత్యధిక రేటింగ్ దక్కుతోంది.

మూవీలు.. వివాదాలతోనే
ఈ మధ్య కాలంలో కూడా కస్తూరి ఏజ్‌కు తగ్గ పాత్రలు చేస్తోంది. గత ఏడాది ఈ భామ 'గాడ్ ఫాదర్' మూవీలో చిరంజీవికి తల్లిగా చేసింది. మరోవైపు, ఈ సీనియర్ హీరోయిన్ తరచూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంటోంది. అలాగే, కాంట్రవర్శీ స్టేట్‌మెంట్లతో ఎంతో మందికి శత్రువుగా మారిపోతోంది. దీంతో కస్తూరి పేరు దేశ వ్యాప్తంగా సెన్సేషన్ అయిపోతూనే ఉంటోంది.

సోషల్ మీడియాలో బిజీగా
దాదాపు రెండున్నర దశాబ్దాలుగా సినిమాల మీద సినిమాలు, సీరియళ్లు, షోలు చేస్తూ ఫుల్ బిజీగా గడిపిన కస్తూరి సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. ఇలా ఇప్పటికీ తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంటూనే ఉంటోంది.
కస్తూరికి ప్రాణాంతక వ్యాధి
గృహలక్ష్మి సీరియల్ హీరోయిన్ కస్తూరి తాజాగా చికెన్ ఫాక్స్ (అమ్మతల్లి లేదా అమ్మవారు లేదా పొంగు) బారిన పడింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ మేరకు కొన్ని ఫొటోలను కూడా షేర్ చేసింది. అందులో తన శరీరంపై వచ్చిన పొక్కులు లేదా దద్దుర్లను చూపించింది. అంతేకాదు, బుంగమూతి పెట్టి మరీ తన బాధను మొత్తం వెల్లగక్కేసింది.

వికృతంగా తయారైందని
కస్తూరి తాజాగా చేసిన పోస్టులో 'హలో ఫ్రెండ్స్.. చికెన్ ఫాక్స్ అనేది ఒక అంటువ్యాధి. ఇది చాలా వరకూ ప్రాణహాని కలిగిస్తుంది. శరీరం మొత్తాన్ని వికృతంగా మారుస్తుంది. కానీ, నా కళ్లకు మాత్రం సోకకపోవడం అదృష్టం. ఈ సమయంలో నాకు అండగా ఉన్న వాళ్లకు ధన్యవాదాలు. నాకు మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉంటుందని ఆశిస్తున్నా' అంటూ చెప్పుకొచ్చింది.

సీరియల్‌లో కనిపించదా
తన పోస్టులో కస్తూరి 'నేను నా లైఫ్ టైం మొత్తంలో మచ్చలేని మృదువైన చర్మంతో ఉన్నాను. కానీ, ఇప్పుడు దీనికి అలవాటు పడాల్సి వస్తుంది' అంటూ రాసుకొచ్చింది. దీనికితోడు చికెన్ ఫాక్స్ అంటు వ్యాధి కావడంతో కస్తూరి దాదాపు రెండు వారాలు రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుందట. దీంతో ఆమె 'గృహలక్ష్మి' సీరియల్‌లో కొద్ది రోజులు కనిపించే అవకాశం లేదని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











